చివరి రైడ్‌లో నవీన్ విఫలం.. ఢిల్లీపై టైతో గట్టెక్కిన బుల్స్

జైపూర్: చివరి రైడ్‌లో అమిత్ షరాన్ అద్భుత టాకిల్ చేయడంతో బెంగళూరు బుల్స్ గట్టెకింది. దీంతో బుల్స్ వరుసగా మూడో ఓటమిని తప్పించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో సోమవారం దబాంగ్ ఢిల్లీతో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను బెంగళూరు బుల్స్ 39-39తో టైగా ముగించింది. బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ 17 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ అమిత్ 6 టాకిలింగ్ పాయింట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రైడర్ నవీన్ కుమార్ 14 పాయింట్లు చేసాడు.
మ్యాచ్ ఆరంభం నుండి ఇరుజట్లు పాయింట్లు చేస్తూ దూసుకెళ్లాయి. దీంతో ఆధిక్యం మారుతూ వచ్చింది. స్కోర్లు 7-7, 11-11తో సమం అవుతూ వచ్చాయి. తొలి అర్ధభాగాన్ని ఢిల్లీ 21-17తో ముగించింది. అనంతరం ఇరు జట్లు పోటాపోటీగా పోరాడాయి. ఇక 38-39తో ఉన్న సమయంలో ఆఖరి రైడ్‌కు వచ్చిన ఢిల్లీ ప్లేయర్ నవీన్ కుమార్‌ను అమిత్ అద్భుతంగా టాకిల్ చేసి స్కోరు సమం చేశాడు. దీంతో బుల్స్ గట్టెకింది.
ఇక వికాస్ ఖండోలా మరోసారి సూపర్-10తో సత్తాచాటడంతో హరియాణా స్టీలర్స్ 39-34తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. వికాస్ 13 రైడ్ పాయింట్లు సాధించాడు. పట్నా రైడర్ పర్‌దీప్ నర్వాల్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేక పోయాడు. ఇప్పటి వరకు లీగ్‌లో 17 మ్యాచ్‌లాడిన హరియాణా 11 విజయాలు, 5 పరాజయాలు ఒక టైతో మొత్తం 59 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరో విజయం సాధిస్తే హరియాణా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications