న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వికాస్‌ ఖండోలా మెరుపులు.. యు ముంబాకు హరియాణా ఝలక్‌

PKL 2019: Haryana Steelers Pip U Mumba with 30-27

చెన్నై: రైడింగ్‌లో వికాస్‌ ఖండోలా (9) సత్తా చాటడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్-7లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 30-27తో యు ముంబాను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌ తప్పిదాలతో ముంబా మూల్యం చెల్లించుకుంది. ఆట చివరలో హరియాణా పుంజుకోవడంతో మ్యాచ్ సొంతం చేసుకుంది. ముంబా ఆల్‌రౌండర్‌ సందీప్‌ నర్వాల్‌ కేవలం 5 పాయింట్లు సాధించాడు.

<strong>టెస్టు సిరీస్‌ కోసం జట్టుతో పాటే నవదీప్ సైనీ</strong>టెస్టు సిరీస్‌ కోసం జట్టుతో పాటే నవదీప్ సైనీ

తొలి రైడ్‌లోనే వికాస్‌ ఖండోలాను ఔట్ చేసి ముంబా ఖాతా తెరిచింది. ఆ తర్వాత వరుస పాయింట్లతో 4-2తో నిలిచింది. 6వ నిమిషంలో ఖండోలా సూపర్‌ రైడ్‌తో హరియాణా 5-4తో పైచేయి సాధించింది. అయితే 12వ నిమిషంలో ముంబాను ఆలౌట్‌ చేసి హరియాణా ఆధిక్యంలోకి వచ్చింది. వరుస పాయింట్లు సాధించి తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్టీలర్స్‌ 16-8తో ఆధిక్యంలో నిలిచింది. రెండవ అర్ధభాగంలో అభిషేక్‌ సింగ్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడంతో ముంబై స్కోరు పరుగులు పెట్టింది. దీంతో 30 నిమిషాల ఆట ముగిసే సరికి ముంబా 17-20తో ప్రత్యర్థిని సమీపించింది.

ఈ సమయంలో రవికుమార్‌, చాంద్‌ సింగ్‌ సూపర్‌ టాకిల్స్‌తో పాటు ముంబై డిఫెన్స్‌ పొరపాట్ల కారణంగా హరియాణా 25-17తో ముందంజ వేసింది. రైడర్ అభిషేక్‌సింగ్‌ రాణించడంతో ముంబా 24-26తో హరియాణా స్కోరుకు చేరువగా వచ్చింది. ఆ తర్వాత అతుల్‌ పాయింట్ తేవడంతో 25-26తో నిలిచింది. ఆట ఆఖర్లో వికాస్‌ ఖండోలా వరుసగా రెండు రైడ్‌ పాయింట్లు తేవడంతో ఆధిక్యాన్ని కాపాడుకున్న స్టీలర్స్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Tuesday, August 20, 2019, 8:28 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X