న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంత తక్కువా: ప్రో కబడ్డీ లీగ్ విలువెంతో తెలుసా?

How much is Pro Kabaddi League worth? Rs 200 crore?

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ జులై 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, పీకేఎల్ ద్వారా ఆయా ప్రాంఛైజీలు లాభాలను ఆర్జిస్తున్నాయా? ప్రో కబడ్డీని టెలికాస్ట్ చేస్తోన్న స్టార్ ఇండియా లాభాలను గడిస్తుందా? అంటే అవుననే సమాధానం చెప్పాలి.

<strong>గుండెపోటు కాదు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్</strong>గుండెపోటు కాదు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్

సమాచారం మేరకు ప్రో కబడ్డీ 5వ సీజన్ సుమారు రూ. 200 కోట్ల ఆదాయాన్ని సృష్టించింది. అయితే, ఈ సీజన్‌లో కొత్త జట్లు చేరడంతో పాటు ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు మార్కెట్ ఎనలిస్ట్‌లు. నిజానికి ప్రొ కబడ్డీ తొలి సీజన్‌ ఆరంభంలో ఫ్రాంచైజీలన్నీ ఆందోళన పడ్డాయి.

కోట్ల రూపాయల పెట్టుబడులకు ఫలితం ఉంటుందా? అని ఆందోళన చెందాయి. అయితే, వారి అంచనాల్ని తలకిందులు చేసి... అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం రాబట్టడంతో యజమానులు ఆనందపడ్డారు. పీకేఎల్‌ నిర్వహించే మాషల్‌ స్పోర్ట్స్‌లో స్టార్‌ వాటా కొనుగోలు చేయడం వల్ల కొందరు ఆందోళన చెందారు.

పీకేఎల్‌లో మెజారిటీ వాటా అంటే 74 శాతం మాషల్‌ స్పోర్ట్స్‌ కలిగింది. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌, ఇతర ప్రకటనల ద్వారా స్టార్‌తో సమానంగా తమకు ఆదాయం రావడం లేదని విచారపడుతుంది. వాస్తవానికి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)తో పోలిస్తే పీకేఎల్‌కు వ్యూయర్‌షిప్‌ చాలా ఎక్కువే.

రేసులో రవిశాస్త్రి ముందంజ: హెడ్ కోచ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి!

అయితే అందుకు తగ్గ స్పాన్సర్‌షిప్‌ ఆదాయం రావడం లేదు. ప్రస్తుతం పీకేఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి 5-10 స్పాన్సర్లు ఉంటున్నారు. సీజన్‌ను బట్టి, వ్యూయర్‌షిప్‌కు తగ్గట్టు వీరు డబ్బుని చెల్లించడం లేదు. ఉదాహరణకు ప్రధాన స్పాన్సర్‌ జెర్సీలపై తన బ్రాండ్‌ వేయిస్తున్నందుకు సీజన్‌కు రూ.1-3 కోట్ల వరకు ఇస్తున్నారని అనుకోండి.

అయితే, సీజన్‌ కాలపరిమితిని బట్టి ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలన్నమాట. ఇదే ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్‌)లో రూ.5-10 కోట్లు, ఐపీఎల్‌లో రూ.10-20 కోట్లుగా ఉంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఐఎస్‌ఎల్‌తో పోలిస్తే కబడ్డీ ఆటగాళ్లు టీవీలో కనిపించే సమయం కూడా ఎక్కువే.

అయితే, ప్రో కబడ్డీలో ధోని, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రీడాకారులు లేకపోవడం కూడా ఆదాయం తక్కువగా రావడానికి కారణమని భావిస్తున్నారు. ఇక, బ్రాడ్‌కాస్టర్‌ తమ ఉత్పత్తులకు సంబంధించి ఎంత ఫ్రీ కమర్షియల్‌ టైమ్‌ ఇస్తారన్నది కూడా స్పాన్సర్లు చూస్తారని అంటున్నారు. ఈ కారణాల చేతనే ఐపీఎల్, ఐసీఎల్‌తో పోలిస్తే ప్రో కబడ్డీకి తక్కువ ఆదాయం వస్తుంది.

Story first published: Friday, August 16, 2019, 18:05 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X