న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: కబడ్డీలో ఇరాన్‌ విజయం వెనుక భారత్‌

By Nageshwara Rao
How an Indian Coach Plotted India’s Kabaddi Shocker at Asian Games

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల కబడ్డీలో భారత ఆధిపత్యానికి గండిపడింది. ఇన్నేళ్లు ఆసియాడ్ కబడ్డీలో ఏకఛత్రాధిపత్యంతో ఏలిన మనోళ్లు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

కబడ్డీలో తమకు తిరుగులేదనుకున్న టీమిడియాకు ఈ ఆసియా గేమ్స్‌లో ఊహించిన రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 24-27 తేడాతో ఇరాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ముచ్చటగా మూడోసారి స్వర్ణపతకాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న అమ్మాయిల ఆశలపై ఇరాన్ జట్టు నీళ్లు గుమ్మరించింది.

ఇరాన్‌ స్వర్ణం సాధించడం వెనుక భారత్‌ ప్రమేయం

ఇరాన్‌ స్వర్ణం సాధించడం వెనుక భారత్‌ ప్రమేయం

అయితే, కబడ్డీలో మహిళల విభాగంలో ఇరాన్‌ స్వర్ణం సాధించడం వెనుక భారత్‌ ప్రమేయం ఉండటం విశేషం. ఇరాన్‌ మహిళల కబడ్డీ జట్టుకు కోచింగ్‌ ఇచ్చింది భారత కోచ్‌ షెల్జా జైన్‌ కాబట్టి. ఇరాన్‌ను ప్రపంచంలో అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్ది అత్యుత్తమ కోచ్‌ అనిపించుకోవడమే లక్ష్యంగా ఆమె ఈ ఆసియా గేమ్స్‌ బరిలోకి దిగింది. అనుకున్నది సాధించింది.

నాసిక్‌కు చెందిన షెల్జా

నాసిక్‌కు చెందిన షెల్జా

నాసిక్‌కు చెందిన షెల్జా.. ఇరాన్‌ కోచ్‌గా 18 నెలల క్రితం బాధ్యతలు చేపట్టింది. ఇరాన్ మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ జట్టు అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఆ జట్టు సాధించిన విజయాల్లో షెల్జా జైన్‌‌దే కీలకపాత్ర. ఫైనల్ అనంతరం షెల్జా మీడియాతో మాట్లాడారు.

డిఫెన్స్‌లో ఇరాన్‌ చాలా బలంగా తయారైంది

డిఫెన్స్‌లో ఇరాన్‌ చాలా బలంగా తయారైంది

"ఇరాన్‌కు తొలిసారి వెళ్లినప్పుడే అనుకున్నా. ఆ జట్టును ప్రపంచ ఉత్తమ జట్టుగా నిలపాలని. కోచ్‌గా నేనెంటో నిరూపించుకోవాలని. డిఫెన్స్‌లో ఇరాన్‌ చాలా బలంగా తయారైంది. భారత్‌తో ఆసియా క్రీడల కబడ్డీ ఫైనల్లో సత్తా చాటింది. ఒక భారతీయురాలిగా నా జట్టు ఓడినందుకు చాలా బాధగా ఉంది. కానీ కోచ్‌గా ఇరాన్‌ గెలవాలనే కోరుకున్నా" అని షెల్జా చెప్పింది.

స్వర్ణ పతకం లేకుండా తిరుగుముఖం పట్టిన కబడ్డీ జట్లు

స్వర్ణ పతకం లేకుండా తిరుగుముఖం పట్టిన కబడ్డీ జట్లు

మరోవైపు ఈ ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో భాగంగా ఇరాన్‌తో జరిగిన పోరుతో భారత కబడ్డీ జట్టు 27-18తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. ఆసియా గేమ్స్ చరిత్రలో తొలిసారి భారత కబడ్డీ జట్లు స్వర్ణ పతకం లేకుండా తిరుగుముఖం పట్టాయి.

Story first published: Saturday, August 25, 2018, 11:32 [IST]
Other articles published on Aug 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X