న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంచలన వ్యాఖ్యలు: నా తండ్రికి భారతరత్న ఇవ్వమని అడుక్కోను

 Will Not Beg For Bharat Ratna, Says Dhyan Chands Son Ashok Kumar

హైదరాబాద్: తన తండ్రికి భారతర్న అనార్డు ఇవ్వాలని తాను యాచించనని హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్ అన్నారు. భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో మొదటివాడు మేజర్ ధ్యాన్ చంద్. ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది.

1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించాడు. హాకీలో భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు ధ్యాన్ చంద్ ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్‌ పేరు ప్రపంచ పటంలో మారుమ్రోగి పోవడంతో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు.

రాష్ట్రపతి చేతుల మీదుగా 'ఖేల్‌రత్న': ఎవరీ దీపా మాలిక్

ఎంతోమందిని ఆశ్చర్యానికి

ఎంతోమందిని ఆశ్చర్యానికి

అలాంటి వ్యక్తికి ఇంతవరకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వకపోవడంపై ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా తన తండ్రికి దేశ అత్యున్నత పురస్కారమైన ధ్యాన్ చంద్ ఇవ్వకపోవడంపై ఆయన కుమారుడు అశోక్‌ కుమార్‌ మాట్లాడారు.

రాజకీయ అంశాలు కీలక పాత్ర

రాజకీయ అంశాలు కీలక పాత్ర

దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు నామినేట్‌ చేయడానికి గాను మన దేశంలో రాజకీయ అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని... అందుకే తన తండ్రికి ఇంత వరకు ఆ పురస్కారం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు అప్పడిప్పుడే కాదు: గంభీర్ సంచలనం

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫైల్‌పై సంతకం చేసినా

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫైల్‌పై సంతకం చేసినా

"దాదా(ధ్యాన్‌చంద్‌)కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫైల్‌పై సంతకం చేసి అప్పటి క్రీడల మంత్రికి పంపారు. ఏమైందో తెలియదు కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం మమ్మల్ని కాదు... దేశ ప్రతిష్ఠను పెంచిన గొప్ప ఐకాన్‌ ను అవమానించినట్టు" అని అన్నారు.

అవార్డు ఇవ్వండని అడగకూడదు

అవార్డు ఇవ్వండని అడగకూడదు

"అవార్డులను కోరకూడదు. అవార్డు ఇవ్వండని అడగకూడదు. యాచించకూడదు. ఎవరైతే వాటిని స్వీకరించే అర్హత ఉందో వారికి ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వమే నిర్ణయించాలి. ధ్యాన్‌చంద్‌ భారతరత్నకు అర్హుడో కాదో అని" అశోక్‌ కుమార్‌ అన్నారు. కాగా, బ్రిటీష్‌ నిబంధలను ఎదురించి 1936 ఒలింపిక్స్‌కు వెళ్లేటప్పుడు సూట్‌కేస్‌లో ధ్యాన్‌చంద్‌ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారని చెప్పారు.

ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి

ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి

దీంతో ప్రతి ఏడాది ధ్యాన్‌ చంద్ పుట్టినరోజైన ఆగస్ట్ 29న భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా క్రికెటర్లు, షూటర్లు, రెజ్లర్లు, బాక్సర్లు, అథ్లెట్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించారు.

Story first published: Friday, August 30, 2019, 13:16 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X