రాష్ట్రపతి చేతుల మీదుగా 'ఖేల్‌రత్న': ఎవరీ దీపా మాలిక్

హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా దేశ అత్యున్నత క్రీడాపురస్కారమైన 'ఖేల్‌రత్న' ను పారా అథ్లెట్ దీపా మాలిక్ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి అవార్డులను అందజేశారు. హాక్ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు 29ని ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు అప్పడిప్పుడే కాదు: గంభీర్ సంచలనం

రాష్ట్రపతి భవన్‌లో ఈరోజున ఉత్తమ క్రీడాకారులకు, కోచ్‌లకు క్రీడాపురస్కారాలు ఇచ్చి గౌరవించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. 2018 సంవత్సరానికి గాను దీపా మాలిక్‌తో పాటు రెజ్లర్ భజరంగ్ పూనియా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

హర్యానాకు చెందిన దీపా మాలిక్

హర్యానాకు చెందిన దీపా మాలిక్

హర్యానాకు చెందిన దీపా మాలిక్ తండ్రి ఓ ఆర్మీ అధికారి. ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు దీపాకు వెన్నుముకపై చిన్నపాటి కణితి వచ్చింది. దీంతో ఆమెకు మూడేళ్ల పాటు వివిధ ఆసుపత్రుల్లో రకరకాల చికిత్సలు చేయించారు. ఎంతో కఠినమైన ఫిజియోథెరపీలు చేయించుకుంటున్నా ముఖంపై చిరునవ్వును చెరగనిచ్చేది కాదు.

చిన్నప్పటి ఆటలంటే పిచ్చి

చిన్నప్పటి ఆటలంటే పిచ్చి

ఆమెకు చిన్నప్పటి నుంచీ ఆటలన్నా, బైక్ రైడింగ్ అన్నా చెప్పలేనంత పిచ్చి. అలా దీపా మాలిక్‌కు ఇరవై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఓ ఆర్మీ అధికారికిచ్చి పెళ్లి చేశారు. అతను దీపా మాలిక్ పరిస్థితిని అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

కణితి తొలగించుకోవాలన్నారు

కణితి తొలగించుకోవాలన్నారు

వారితో ఆమె జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఇంతలోనే ఆమె వెన్నుముకపై ఉన్న కణితి సమస్య పెరిగిపోయింది. ఆసుపత్రికి వెళితే "కణితి తొలగించుకోవాలి లేకపోతే కేన్సర్ బారినపడే మరణించే అవకాశం ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయించుకుని కణితి తొలగించుకుంటే పక్షవాతం బారినపడి జీవితాంతం వీల్‌ఛైర్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది" డాక్టర్లు చెప్పారు.

మూడు ఆపరేషన్లు చేసిన వైద్యులు

మూడు ఆపరేషన్లు చేసిన వైద్యులు

దీంతో ఆమె ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. కణితిని తొలగించుకోవడానికి వైద్యులు మొత్తం మూడు ఆపరేషన్లు చేశారు. అప్పటి నుంచి ఆమె శరీరంలోని కింది భాగం మొత్తం పక్షవాతానికి గురైంది. అప్పటివరకూ భర్త, పిల్లలతో ఆనందంగా గడిపిన ఆమె ఒక్కసారిగా తన నిర్ణయంతో అచేతనంగా మారిపోయింది. అయినా ఏమాత్రం బెదరలేదు.

ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు సొంతం

ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు సొంతం

ఆరేళ్ల పాటు ఫిజియోథెరపీ చేయించుకుంది. ఆ సమయంలో ఆమెలో పట్టుదల పెరిగి ఆటలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా కూడా దీపామాలిక్ చరిత్ర సృష్టిస్తుంది. దీపామాలిక్ ఇప్పటి వరకు 23 అంతర్జాతీయ పతకాలు, 68 రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించింది. ఇప్పటికే ఆమె అర్జున, పద్మశ్రీలను సొంతం చేసుకుంది. తాజాగా దేశ అత్యున్నత పురస్కారం ఖేల్ రత్నను సొంతం చేసుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 29, 2019, 18:58 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X