న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు అప్పడిప్పుడే కాదు: గంభీర్ సంచలనం

IND V WI 2019 : Rohit Will Have To Wait For Their Spots In Indian Test Squad Says Gautam Gambhir
Rohit Sharma, Wriddhiman Saha will have to wait for their spots in Indian Test squad: Gautam Gambhir

హైదరాబాద్: భారత టెస్టు జట్టులో చోటు దక్కాలంటే రోహిత్ శర్మ కొంతకాలం వెయిట్ చేయాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇప్పటికే తుది జట్టులో చోటు దక్కించుకున్న టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకే రహానె, హనుమ విహారి తమ ఎంపికకు న్యాయం చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు.

వెస్టిండిస్ పర్యటనకు రోహిత్ శర్మ ఎంపికైనప్పటికీ... రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఈ సందర్భంగా పీటీఐతో గంభీర్ మాట్లాడుతూ "అవకాశం కోసం అతడు (రోహిత్‌) వేచిచూడాలి. తొలి టెస్టులో రహానే, విహారి మంచి ప్రదర్శన చేశారు. దీంతో అతడు అవకాశం కోసం చూడక తప్పదు. మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది" అని అన్నాడు.

స్మిత్ vs ఆర్చర్: మూడో టెస్టు ఆడనప్పుడు నేను ఎలా ఔట్‌ చేస్తాస్మిత్ vs ఆర్చర్: మూడో టెస్టు ఆడనప్పుడు నేను ఎలా ఔట్‌ చేస్తా

తీవ్ర ఒత్తిడిలో కూడా

తీవ్ర ఒత్తిడిలో కూడా

తొలి టెస్టు తీవ్ర ఒత్తిడిలో కూడా రహానే తొలి ఇన్నింగ్స్‌లో 81, రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక, విహారి సైతం తొలి ఇన్నింగ్స్‌లో 32, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులతో రాణించాడు. దీంతో తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

నన్ను ఆశ్చర్యపరచలేదు

నన్ను ఆశ్చర్యపరచలేదు

"అత్యంత ఒత్తిడిలో ఆడిన రహానె ఇన్నింగ్స్‌ నన్ను ఆశ్చర్యపరచలేదు. వ్యక్తిగతంగానే కాకుండా జట్టు పరంగా అతడిది అవసరమైన ప్రదర్శన. ఇక గెలిచే మ్యాచ్‌లో అయితే అంతకన్నా మించింది ఏముంటుంది" అని గంభీర్ అన్నాడు. మరోవైపు సీనియర్ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా ఎదరుచూడక తప్పదని గంభీర్ చెప్పాడు.

రెండో స్థానంపై కన్నేసిన బెంగాల్... గెలుపు రుచి కోసం తమిళ తలైవాస్

పంత్ యావరేజి బ్యాటింగ్‌లో

పంత్ యావరేజి బ్యాటింగ్‌లో

"పంత్ యావరేజి బ్యాటింగ్‌లో 48(నిజానికి 45.43గా ఉంది) ఉన్నప్పుడు సాహా ఎదురు చూడక తప్పదు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో సెంచరీలతో మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో టెస్టుల్లో ఆడేందుకు అతడే (పంత్‌) అర్హుడు. వచ్చిన అవకాశాన్ని పంత్‌ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు" అని గంభీర్‌ వెల్లడించాడు.

రెండు రోజుల క్రితం పంత్‌కు

రెండు రోజుల క్రితం పంత్‌కు

ఇదిలా ఉంటే, రెండు రోజుల క్రితం పంత్‌కు అవకాశాలు కల్పించేందుకు సాహా కెరీర్‌ను పణంగా పెట్టడం సరైంది కాదని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్‌కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌.. వృద్ధిమాన్ సాహాను పట్టించుకోకపోవడంపై కూడా కిర్మాణి మండిపడ్డారు.

Story first published: Thursday, August 29, 2019, 18:08 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X