న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఓటమిని జీర్ణించుకోలేకనే రిటైర్‌మెంట్ ప్రకటించా'

Wasnt pressurised to announce retirement: Sardar Singh

హైదరాబాద్: హాకీ ఇండియా ఒత్తిడి మేరకే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తాజాగా స్పందించాడు. జాతీయ శిక్షణ శిబిరం కోసం బుధవారం 25 మందితో కూడిన జట్టుని హాకీ ఇండియా ప్రకటించగా.. అందులో సర్దార్ సింగ్‌కి చోటు లభించలేదు. దీంతో.. మనస్తాపానికి గురైన ఈ మిడ్‌ఫీల్డర్ రోజు రాత్రి అంతర్జాతీయ కెరీర్‌కి గుడ్‌బై చెప్పేశాడు.

<strong>హాకీకి సెలవు ప్రకటించనున్న సర్దార్ జీ</strong>హాకీకి సెలవు ప్రకటించనున్న సర్దార్ జీ

ఫిట్‌నెస్‌లో గ్రాండ్ మాస్టర్ సర్దార్

ఫిట్‌నెస్‌లో గ్రాండ్ మాస్టర్ సర్దార్

కానీ.. అసలు విషయం అది కాదంటూ చెప్పుకొస్తున్నాడు హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్. ఆయన ఫిట్‌నెస్ విషయానికొస్తే.. కోహ్లిని కూడా మించిపోతాడు. 32 ఏళ్ల ఈ స్టార్ హాకీ ప్లేయర్ ఫిట్‌నెస్ ముందు ఎవరైనా దిగదుడుపే. కోహ్లి యోయో టెస్ట్ స్కోరు 19 మాత్రమే. అదే స‌ర్దార్ సింగ్‌ 21.4 స్కోరుతో విరాట్‌ను సునాయాసంగా అధిగమించేశాడు. నిజానికి క్రికెటర్ కనీసం 16.1 స్కోరు సాధిస్తేనే నేషనల్ టీమ్‌లోకి ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పుడు స‌ర్దార్ సింగ్‌ సాధించిన స్కోరు దీనికంటే చాలా ఎక్కువ.

ఆసియా గేమ్స్ పరాజయంతో విస్తుపోయిన సర్దార్:

ఆసియా గేమ్స్ పరాజయంతో విస్తుపోయిన సర్దార్:

ఫీల్డ్‌లో నెమ్మెదిగా కదులుతున్నాడని అజ్లాన్ షా కప్ టోర్నీ నుంచి స‌ర్దార్ సింగ్‌ను తొలగించారు. అప్పటి నుంచి తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన అతడు.. తీవ్రంగా కసరత్తులు చేశాడు. చివరకి పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఆసియా గేమ్స్ పరాజయంతో విస్తుపోయిన సర్దార్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఆసియా గేమ్స్ ముగిసినప్పటి నుంచి చర్చిస్తున్నట్లు :

ఆసియా గేమ్స్ ముగిసినప్పటి నుంచి చర్చిస్తున్నట్లు :

తాను రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయంపై ఆసియా గేమ్స్ ముగిసినప్పటి నుంచి సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్దార్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇండోనేషియా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్‌లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌‌లో ఓడటం నన్ను బాధించింది.

12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చాలా అనుభవించా:

12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చాలా అనుభవించా:

‘మలేషియా జట్టు చేతిలో ఆ పరాజయాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి బాధల్ని నేను చాలా అనుభవించా. కానీ.. ఆ ఓటమి బాధని మాత్రం నేను అధిగమించలేకపోయా. దీంతో.. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి రిటైర్మెంట్‌ తీసుకోవాలనే తుది నిర్ణయానికి వచ్చా. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. హాకీ ఇండియా నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. అంతేకాకుండా.. శిక్షణ శిబిరానికి నన్ను ఎంపిక చేయకపోవడం కూడా ఈ రిటైర్మెంట్‌కి కారణం కాదు' అని సర్దార్ సింగ్ స్పష్టం చేశాడు.

Story first published: Friday, September 14, 2018, 14:39 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X