న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీలో భారత్‌కు పరాభవం: క్వార్టర్స్‌లో ఎంట్రీ కష్టమే: ఇలా చేస్తే గానీ..!

Tokyo Olympics Hockey: Indian women’s team loses 4-1 to Great Britain in Pool A

టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో ఆరో రోజును భారత్ పరాజయంతో ఆరంభించింది. ఒలింపిక్స్ ఆరంభం నుంచి ఎదురవుతోన్న పరాజయాల పరంపర ఆరో రోజు కూడా కొనసాగింది. దీనికి ఒకట్రెండు ఈవెంట్లలో తప్ప ఎక్కడా బ్రేక్ పడట్లేదు. పురుషుల హాకీ ఇండియా ఒకవంక విజయాలను అందుకుంటోండగా.. మహిళా ప్లేయర్లు విఫలమౌతోన్నారు. మహిళల హాకీ కేటగిరీ పూల్-ఏలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేదు.

తాజాగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అపజయాన్నే ఎదుర్కొంది. 4-1 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేకపోవడంతో క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలను దాదాపుగా పోగొట్టుకున్నట్టయింది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాలీ అంటే.. తన తదుపరి మ్యాచుల్లో అంచనాలకు మించిన స్థాయిలో రాణించాల్సి ఉంటుంది. ప్రత్యర్థులపై భారీ గోల్స్ తేడాతో విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే- అది అసాధ్యమే అయ్యేట్టుంది.

భారత్ గోల్స్ తేడా ప్రస్తుతం మైనస్ 9గా నమోదైంది. దీన్ని అధిగమించేలా తదుపరి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. తన తదుపరి మ్యాచుల్లో భారత మహిళా హాకీ జట్టు.. ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలను ఎదుర్కోవాల్సి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆశించిన స్థాయిలో తన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లోనే గ్రేట్ బ్రిటన్ రెండు గోల్స్ సాధించి.. ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ ప్రతిఘటించినప్పటికీ.. ఫలితం రాలేదు.

సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్: కాక మీదున్న బెయిర్‌స్టో: కేప్టెన్‌గా సత్తాసన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్: కాక మీదున్న బెయిర్‌స్టో: కేప్టెన్‌గా సత్తా

సెకెండ్ హాఫ్‌లో భారత ప్లేయర్ల ఆటతీరు కాస్త గాడిన పడినట్టు కనిపించినా.. అది కొద్దిసేపే. షర్మిలా దేవి ఒక గోల్ చేశారు. గ్రేట్ బ్రిటన్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగారు. ఆ తరువాత గోల్ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసినా.. కీపర్ సమర్థవంతంగా అడ్డుకోలిగారు. భారత వ్యూహాలను తిప్పి కొట్టగలిగారు. భారత్‌ను నిలువరిస్తూనే గ్రేట్ బ్రిటన్ తన పని తాను చేసుకుంటూ పోయింది. సెకెండ్ హాఫ్‌లో రెండు గోల్స్ సాధించింది. గ్రేట్ బ్రిటన్ తరఫున హన్నా మార్టిన రెండు, లిలీ ఓస్లే, గ్రేస్ బాల్స్‌డన్ చెరో గోల్ చేశారు.

Story first published: Wednesday, July 28, 2021, 9:00 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X