న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Men in Blue: చరిత్ర సృష్టించడానికి సమాయాత్తం: హాకీ ఇండియా ప్రస్థానం ఇదీ

The Indian Men’s Hockey team plays Great Britain for a place in Semi-Finals after 41 long years
Tokyo Olympics: Men's Hockey Quarter Final | India vs Great Britain | Oneindia telugu

టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో పదో రోజు భారత్.. అత్యంత కీలక మ్యాచ్‌లను ఆడనుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుషుల 91 కేజీల సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో పరాజయం పొందినప్పటికీ.. మరో రెండు ఈవెంట్ల భవితవ్యం ఈ సాయంత్రం తేలిపోతుంది. స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంది. మూడో స్థానం కోసం ఆమె ఈ సాయంత్రం సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఇదివరకే ముగిసిన సెమీ ఫైనల్స్ ఏలో అనూహ్యంగా ఓడిపోయిన సింధు.. ఆ ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంటారా? లేక పరాజయాన్ని కొనసాగిస్తారా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది.

చరిత్ర సృష్టిస్తారా?

చరిత్ర సృష్టిస్తారా?

అదే సమయంలో- భారత హాకీ జట్టు కూడా చరిత్రను సృష్టించడానికి సమాయాత్తమౌతోంది. 41 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని హాకీ ఇండియా.. తన తదుపరి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఓఐ హాకీ స్టేడియంలోని నార్త్ పిచ్‌ ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత భవితవ్యాన్ని తేల్చేయబోతోంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 గోల్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించిన మెన్ ఇన్ బ్లూ.. ఆస్ట్రేలియాపై 1-7 గోల్స్ తేడాతో ఎదుర్కొన్న అవమానకర ఓటమిని ఎదుర్కొంది.

గ్రూప్ దశలో

గ్రూప్ దశలో

అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశమే రాలేదు భారత హాకీ ప్లేయర్లకు. వరుస విజయాలను అందుకుంటూ వచ్చారు. మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌ను వణికించిన హాకీ ఆటగాళ్లు.. అర్జెంటీనాపై తడాఖా చూపారు. 3-1 గోల్స్ తేడాతో మట్టి కరిపించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ తన రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గ్రూప్ దశలో మొత్తం అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలను సొంతం చేసుకుందిన హాకీ ఇండియా. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించింది. 3-2 గోల్స్ తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘోరంగా ఓటమి పాలైంది. 1-7 గోల్స్ తేడాతో దారుణ పరాజయాన్ని చవి చూసింది.

లోకల్ బోయ్స్‌పై ఘన విజయం

లోకల్ బోయ్స్‌పై ఘన విజయం

మూడో మ్యాచ్‌‌లో స్పెయిన్‌‌ను 3-0 తేడాతో ఓడించింది. ఆ తరువాతి మ్యాచ్‌లో అర్జెంటీనాపై 3-1 గోల్స్ తేడాతో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయిదో మ్యాచ్‌లో జపాన్ హాకీ జట్టును వారి సొంత గడ్డ మీదే ఓడించింది. తిరుగులేని విజయాన్ని సాధించింది. లోకల్ బోయ్స్‌ను 5-3 తేడాతో మట్టి కరిపించింది హాకీ ఇండియా. దర్జాగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ తన తదుపరి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీ కొట్టబోతోంది. ఇదో హైఓల్టేజ్ మ్యాచ్‌గా మారడం ఖాయం. గెలిస్తే పతకం ఖాయమయ్యే దశకు చేరుకుంటుంది భారత హాకీ జట్టు.

సమవుజ్జీగా గ్రేట్ బ్రిటన్

సమవుజ్జీగా గ్రేట్ బ్రిటన్

గ్రేట్ బ్రిటన్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. గ్రూప్ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిందా టీమ్. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3-1 గోల్స్ తేడాతో ముప్పతిప్పలు పెట్టింది. రెండో మ్యాచ్‌లో కెనడాను కూడా అదే స్కోర్‌తో దిమ్మ తిరిగేలా చేసింది. మూడో మ్యాచ్‌లో ఓడింది. జర్మనీపై 5-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది గ్రేట్ బ్రిటన్. నెదర్లాండ్స్‌తో సాగిన పోరును డ్రాగా ముగించుకుంది. బలమైన నెదర్లాండ్స్‌తో సమవుజ్జీగా నిలిచింది. 2-2 గోల్స్‌ను సాధించింది. అయిదో మ్యాచ్‌ ఫలితం కూడా ఇంతే. బెల్జియంతో మ్యాచ్‌లోను 2-2 గోల్స్ తేడాతో సమం చేసుకుంది.

Story first published: Sunday, August 1, 2021, 12:28 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X