న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాంపియన్స్‌ ట్రోఫీకి హాకీ జట్టు ప్రకటన: సర్దార్, బిరేంద్రకు పిలుపు

By Nageshwara Rao
Sardar Singh, Birendra Lakra return to India squad for Champions Trophy

హైదరాబాద్: నెదర్లాండ్స్ వేదికగా జూన్ 23నుంచి మొదలయ్యే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం హాకీ ఇండియా(హెచ్‌ఐ) గురువారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో సర్దార్‌సింగ్‌తో పాటు మిడ్‌ఫీల్డర్ బిరేంద్ర లక్రా కూడా చోటు దక్కించుకున్నాడు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. డిఫెండర్లు రూపిందర్, కొతాజీత్ సింగ్, గురిందర్‌సింగ్‌కు ఉద్వాసన పలికిన సెలెక్షన్ కమిటీ జర్మాన్‌ప్రీత్‌సింగ్, సురేంద్ర కుమార్‌కు చోటు కల్పించింది.

లలిత్ ఉపాధ్యాయ్, గుర్జాంత్‌సింగ్‌పై వేటు వేయగా, రమణ్‌దీప్‌సింగ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. గోల్‌కీపర్ సూరజ్ కర్కెర స్థానంలో క్రిషన్ బహుదూర్ పాథక్‌ ఎంపికయ్యాడు. జట్టు ఎంపికపై చీఫ్ కోచ్ హరేంద్రసింగ్‌ మీడియాతో మాట్లాడాడు.

జకార్తాలో జరిగే ఆసియా క్రీడలకు ముందు ఆటగాళ్లు తమ సత్తాను ప్రదర్శించే కీలక టోర్నీ ఇది. కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా ఆసియా గేమ్స్‌కు జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత హాకీ జట్టు:
గోల్‌కీపర్స్‌:
శ్రీజేశ్‌ (కెప్టెన్‌), బహదూర్‌ పాఠక్‌.
డిఫెండర్స్‌: హర్మన్‌ప్రీత్‌ సింగ్, వరుణ్‌ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్‌ రొహిదాస్‌.
మిడ్‌ఫీల్డర్స్‌: మన్‌ప్రీత్‌ సింగ్, చింగ్లెన్‌సన సింగ్, సర్దార్‌ సింగ్, వివేక్‌ సాగర్‌.
ఫార్వర్డ్స్‌: సునీల్‌ విఠలాచార్య, రమణ్‌దీప్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, సుమిత్‌ కుమార్, ఆకాశ్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌.

Story first published: Friday, June 1, 2018, 11:35 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X