న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ వరల్డ్ కప్: టైటిల్ సాంగ్ కోసం జత కట్టిన రెహమాన్, గుల్జార్

Rahman and Gulzar team up to compose title song for Hockey World Cup

హైదరాబాద్: 2018లో జరిగే పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు భువనేశ్వర్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ హాకీ వరల్డ్ కప్ టైటిల్ సాంగ్ కోసం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, వెటరన్ బాలీవుడ్ రచయిత గుల్జార్‌లు జత కట్టనున్నారు. "జై హింద్, జై ఇండియా" అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ హాకీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ టైటిల్ సాంగ్‌ భారత దేశ హాకీ చరిత్రతో పాటు హాకీ ప్రాముఖ్యాన్ని తెలిపేలా చక్కటి సాహిత్యంతో పాటు ఓ రిథమలో ఉండబోతోందని సమాచారం. గతంలో రెహమాన్ అనేక అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా రెహమాన్ పాడిన వందేమాతరం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

చాలా సంతోషంగా ఉంది

చాలా సంతోషంగా ఉంది

రెహమాన్ మాట్లాడుతూ "మనం ఎంతగానో ప్రేమించే హాకీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది. అందుకు భువనేశ్వర్ వేదిక అవడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ సాంగ్ మిమ్మల్ని ప్రేరణకు గురిచేస్తుంది. అంతేకాదు మిమ్మల్ని మీ పాదాలపై నిలబెడుతుంది. హాకీ పండుగ సందర్భంగా నాతో కలిసి రండి. కేవలం ఒక్క భారత జట్టు మాత్రమే కాదు, స్ఫిరిట్ ఆఫ్ ద గేమ్‌ను కాపాడేందుకు" అని రెహమాన్ తెలిపాడు.

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ

హాకీ వరల్డ్ కప్ టైటిల్ సాంగ్ కోసం గుల్జార్, ఏఆర్ రెహమాన్ జతకట్టడంపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. "జీనియస్ గుల్జార్ సాహెబ్, మ్యాజిక్ మ్యాన్ రెహమాన్ ఇద్దరూ కలిసి టైటిల్ సాంగ్‌కి ట్యూన్ కడుతున్నారు. ఈ మ్యూజిక్ వీడియోని రెహమాన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. " అని తెలిపాడు.

నవంబర్ 27న రెహమాన్ లైవ్ ప్రదర్శన

నవంబర్ 27న రెహమాన్ లైవ్ ప్రదర్శన

"గెలుపు ఓటములతో పోలిస్తే, ఈ హాకీ వరల్డ్ కప్ టైటిల్ సాంగ్‌లో ఇండియా, ఒడిషాలకు సంబంధించిన థీమ్‌తో రూపొందించబడుతుంది. అక్టోబర్ మొదటి వారంలో ఒడిషాలోని కలింగ స్టేడియంలో నిర్వహించే ఓ కార్యక్రమంలో ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నాం. ఇక, నవంబర్ 27న జరిగే హాకీ వరల్డ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెహమాన్ లైవ్ ప్రదర్శన ఇస్తాడు. ఒడిషాలో రెహమాన్ ఇస్తోన్న తొలి లైవ్ ప్రదర్శన ఇదే" అని నవీన్ పట్నాయక్ పేర్కొన్నాడు.

మూడోసారి ఆతిథ్యమిస్తోన్న భారత్

మూడోసారి ఆతిథ్యమిస్తోన్న భారత్

2018లో పురుషుల హాకీ వరల్డ్ కప్ ఒడిషాలోని భువనేశ్వర్‌లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. ఇది 14వ హాకీ వరల్డ్ కప్ ఎడిషన్ కావడం విశేషం. హాకీ వరల్డ్ కప్‌కు భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. గతంలో 1982లో ముంబైలో, 2010లో ఢిల్లీ నగరాలు ఆతిథ్యమిచ్చాయి.

Story first published: Saturday, September 22, 2018, 12:18 [IST]
Other articles published on Sep 22, 2018
Read in English:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X