న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాకిస్థాన్‌కు ఊహించని షాక్: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి, టోక్యో ఒలింపిక్స్‌కు దక్కని బెర్తు

Pakistan hockey team fails to secure Tokyo Olympics berth after Netherlands defeat

హైదరాబాద్: మూడు సార్లు ఛాంపియన్ అయిన పాకిస్థాన్ హాకీ జట్టుకు ఇది గట్టి షాకే. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు పాకిస్థాన్ పురుషుల హాకీ జట్టు అర్హత సాధించలేకపోయింది. రెండో క్వాలిఫియిర్‌లో భాగంగా నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పురుషుల హాకీ జట్టు 1-6తేడాతో దారుణంగా ఓడిపోయింది.

ఈ ఓటమితో పాకిస్థాన్ పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తుని దక్కించుకోలేకపోయింది. శనివారం 4-4తో డ్రాగా నిలిచిన నెదర్లాండ్స్, ఆదివారం అనూహ్యాంగా పుంజుకుంది. అద్భుతమైన ప్రదర్శనతో మొత్తం యావరేజిగా 10-5తో విజయం సాధించింది. హాఫ్ టైమ్ ముగిసేసరికి నెదర్లాండ్స్ 4-0 ఆధిక్యంలో నిలిచింది.

భారత పర్యటనను దెబ్బతీసే కుట్ర: బీసీబీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలుభారత పర్యటనను దెబ్బతీసే కుట్ర: బీసీబీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

నెదర్లాండ్స్ తరుపున డ్రాగ్ ఫ్లికర్ మింక్ వాన్ డెర్ వీర్డెన్ (17వ ని, 29వ మి)లో రెండు గోల్స్ చేయగా... జోర్న్ కెల్లెర్మాన్ (9వ ని), టెరెన్స్ పీటర్స్ (39వ ని), జిప్ జాన్సెన్ (43వ ని) గోల్స్ చేసి ఆ జట్టుకు మరింత ఆధిక్యంలో నిలిపారు. చివరి క్వార్టర్‌లో పాక్ కొంత లయను అందుకుని మూడు పెనాల్టీ కార్నర్‌లను గెలుచుకుంది.

ఈ క్రమంలో పాక్ తరుపున 53వ నిమిషంలో రిజ్వాన్ అలీ ఒక్కడే ఒక గోల్ చేశాడు. పాక్ ఓటమిపై రషీద్ మొహమ్మద్ డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో "ఇదొక చెత్తరోజు, మేము ఒలింపిక్స్‌కు దూరమయ్యాం. ఈరోజు మ్యాచ్‌లో డచ్ టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది. మేము చాలా తప్పులు చేశాం" అని అన్నారు.

కారణమిదే: శ్రీలంకతో రెండో టీ20కి మిచెల్ స్టార్ దూరం!కారణమిదే: శ్రీలంకతో రెండో టీ20కి మిచెల్ స్టార్ దూరం!

ఇదిలా ఉంటే, పాకిస్థాన్ పురుషుల హాకీ జట్టు 1960, 1968, 1984లలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఒలింపిక్స్ సీజన్లలో పాక్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. చివరగా పాకిస్థాన్ 1992లో బార్సిలోనా వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది.

Story first published: Monday, October 28, 2019, 16:31 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X