న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాతే హాకీ పోటీలు: ఎఫ్‌ఐహెచ్‌

International Hockey Can Resume Only After COVID-19 Vaccine

లుసానే: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాతే అంతర్జాతీయ హాకీ పోటీలను నిర్వహించే అవకాశం ఉందని ఇంటర్నేషన్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్‌) స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం 'ఐదు దశల ప్రక్రియ'ను అనుసరించబోతున్నామని ఎఫ్‌ఐహెచ్‌ ప్రకటించింది.

ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. 'ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం.

తొలుత సామాజిక దూరం పాటిస్తూ శిక్షణను ప్రారంభిస్తాం. మరో దశలో రీజియన్ల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. తదుపరి పొరుగు దేశాల్లో జరిగే టోర్నీల్లో తలపడతాం. ఆ తర్వాత ఖండాంతర పోటీలు... ఇలా చివరి దశలో వ్యాక్సిన్‌ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం.

అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది' అని ఎఫ్‌ఐహెచ్‌ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని ఎఫ్‌ఐహెచ్‌ తెలిపింది.

Story first published: Thursday, May 21, 2020, 10:06 [IST]
Other articles published on May 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X