న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత రత్న కావాలని ప్రభుత్వాన్ని అర్థించలేను..

I Can’t Ask The Govt For My Bharat Ratna - Balbir Singh SR

హైదరాబాద్: కష్టానికి ఎప్పుడూ ప్రతిఫలం దక్కుతుంది. అది కాస్త ముందైనా వెనకైనా సరే. కాకపోతే మనకు చెందినవి మనమున్నప్పుడు వస్తేనే మనమూ అనుభవించగలం కదా. సరిగ్గా ఇలాంటివన్నీ భారతరత్న అవార్డు కోవలోకి చెందుతాయి. భారత రత్న మన దేశ అత్యున్నత పురస్కారం. ఇది కొందరికి మాజీ అయిపోయాక వస్తే, మరికొందరికి జీవితంలో రాజీ అయిపోయాక వస్తుంది.

బతికున్నంత కాలం వారి ప్రతిభకు అంతటి అత్యున్నత పురస్కారం వస్తుందా. లేదా అన్న సందిగ్ధంలో ఉండాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే ప్రశ్నను భారత హాకీ మాజీ కెప్టెన్, ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న హాకీ క్రీడాకారుడు బల్వీర్ సింగ్‌నుఅడిగితే. ఆయన ఇలా స్పందించారు.

'నేను భారత రత్న కావాలని ప్రభుత్వాన్ని అడగలేను. అడగను కూడా. కేవలం నా ప్రతిభను ప్రదర్శించడమే నా పని. అది ప్రజలు చూస్తారు. ప్రభుత్వం చూస్తుంది. ఆ దేవుడు చూస్తాడు. నా నుదుటిపై ఏం రాసిందో అదే జరుగుతుంది. ఒకవేళ రావాలనుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంది.' అని ఆవేదనను వ్యక్తం చేశారు.

I Can’t Ask The Govt For My Bharat Ratna - Balbir Singh SR

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 11:57 [IST]
Other articles published on Jan 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X