న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'వారిద్దరి వల్లే అంతర్జాతీయ మ్యాచ్‌లకు గుడ్ బై చెప్పా'

Hurt Sardar Singh blames David John, Sjoerd Marijne for forcing him to retire after Asian Games

హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. హాకీ నుంచి రిటైర్ కావడానికి..కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించడం వెనుక జట్టు మాజీ కోచ్ జియోర్డ్ మారిజ్నె, జట్టు హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ కారణమని బాంబు పేల్చాడు. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం హాకీకి సర్దార్‌సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందురోజు

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందురోజు

గతేడాది ఢాకాలో జరిగిన ఆసియాకప్ టోర్నీ సందర్భంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ఒకరోజు ముందు తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించాడు.ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందురోజు భారత జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ తన గదికి పిలిచారు. ఆ సమయంలో అప్పటి జట్టు కోచ్ మారిజ్నె అక్కడే ఉన్నారు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు

ఆ సమయంలో డేవిడ్ జాన్ నన్ను చాలా అవమానించారు. మ్యాచ్‌లో చాలా తప్పులు చేస్తున్నానని, జట్టుకోసం కాకుండా వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చుకునేలా ఆడుతున్నానని విమర్శించారు. పాకిస్థాన్ లాంటి దాయాది దేశంతో మ్యాచ్‌కు ముందు ఇలా మాట్లాడితే ఎంత కుమిలిపోయి ఉంటానో అర్థం చేసుకోండి అని సర్దార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మలేసియాలో సుల్తాన్ అజ్లాన్ షా టోర్నీకి

మలేసియాలో సుల్తాన్ అజ్లాన్ షా టోర్నీకి

ఆ తర్వాత సర్దార్ ఒమన్‌లో జరిగిన ఆసియాన్ చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన జట్టులో చోటు కోల్పోయాడు. కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ హాకీ లీగ్ లాంటి మెగా ఈవెంట్లకు జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత నన్ను మలేసియాలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీకి ఎంపిక చేసినా ..జూనియర్ సభ్యులను ఇచ్చి పంపారు.

 ఇక కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించా

ఇక కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించా

నా వెనుక ఏం జరుగుతుందో నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆసియా క్రీడల్లో ఆడిన సందర్భంగా 2020 ఒలింపిక్స్ వరకు ఆడాలని బలంగా కోరుకున్నా. ఎందుకంటే జట్టులో అందరికంటే అత్యధిక ఫిట్‌నెస్ ఉన్న ఆటగాన్ని నేనే కావడం అందుకు కారణం. కాగా, మరోసారి జట్టు నుంచి తప్పించడంతో ఇక కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను అని సర్దార్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, November 4, 2018, 14:33 [IST]
Other articles published on Nov 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X