న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భువనేశ్వర్‌లో హాకీ వరల్డ్‌కప్: భారత్ పునర్‌వైభవం తెచ్చేనా?, ఫేవరెట్‌ జట్లివే

Hockey World Cup 2018: In Temple City of Bhubaneswar, a hockey pilgrimage

హైదరాబాద్: భారత జాతీయ క్రీడ హాకీ. అలాంటి హాకీకి పునర్‌వైభవం తెచ్చేందుకు భారత్‌కు ఇదొక చక్కటి అవకాశం. భారత్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్‌కప్ హాకీ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ వరల్డ్‌కప్‌కు మంగళవారం తెరలేవనుంది.

హాకీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. తొలిసారిగా 1994లో ముంబాయి వేదికగా జరిగిన టోర్నీలో భారత్‌ ఐదోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2010 ఢిల్లీ వేదికగా ఎనిమిదోస్థానంతో సరిపెట్టుకుంది. 19 రోజుల పాటు జరిగే టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 36 మ్యాచుల్లో తలపడనున్నాయి.

తొలి రోజైన మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు మాత్రమే జరుగుతుండగా.... బుధవారం నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. 1975లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు ఇదే సరైన సమయం. ఎనిమిదేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో తొమ్మిదో స్థానం పొందిన భారత్‌ ఈసారి ఆతిథ్య దేశం హోదాలో నేరుగా అర్హత సాధించింది. టోర్నీలో దక్షిణాఫ్రికా, కెనడా, బెల్జియం జట్లతో కలిసి భారత్‌ పూల్‌ 'సి'లో ఉంది. ప్రస్తుత భారత పురుషుల జట్టు ఫామ్‌ను చూస్తుంటే దక్షిణాఫ్రికా, కెనడా జట్లపై అలవోకగా విజయం సాధించే అవకాశం ఉంది.

అయితే, బెల్జియంతో జరిగే మ్యాచ్‌ మన జట్టుకు పరీక్షగా నిలువనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే పూల్‌ 'టాపర్‌' హోదాలో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుంది. క్వార్టర్స్ అడ్డంకిని అధిగమిస్తే టీమిండియాకు సెమీస్‌ బెర్తుని ఖాయం చేసుకుంటుంది. ఈ హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యం వహిస్తున్నాడు.

మన్‌ప్రీత్‌తో పాటు సీనియర్లు అయిన మాజీ కెప్టెన్‌, గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌, ఆకా‌ష్‌దీప్‌ సింగ్‌, బీరేంద్ర లక్రాలు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. రెండేళ్ల క్రితం జూనియర్‌ వరల్డ్‌కప్ నెగ్గిన యువ భారత్‌లోని ఏడుగురు ఆటగాళ్లు ఈసారి సీనియర్‌ జట్టులో ఉన్నారు. ఈసారి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, జర్మనీ జట్లు టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి.

భారత హాకీ జట్టు:

భారత హాకీ జట్టు:

మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), పీఆర్‌ శ్రీజేశ్, కృషన్‌ పాఠక్‌ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, సిమ్రన్‌జిత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్, కొతాజిత్, చింగ్లేన్‌సనా, సురేందర్, లలిత్‌ ఉపాధ్యాయ్, నీలకంఠ శర్మ, సుమీత్, వరుణ్‌ కుమార్, అమిత్‌ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హారేంద్ర సింగ్‌ (కోచ్‌).

 ప్రతి గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన జట్టు

ప్రతి గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన జట్టు

ప్రతి గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుతుంది. మిగిలిన నాలుగు క్వార్టర్స్‌ బెర్త్‌ల కోసం రెండు, మూడు స్థానాల జట్లు క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లలో తలపడతాయి. అంటే, గ్రూప్‌లో నాలుగోస్థానం (చివరిస్థానం)లో నిలిచిన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.

 గ్రూపులు

గ్రూపులు

పూల్‌ ఎ: అర్జెంటీనా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌

పూల్‌ బి: ఆస్ర్టేలియా, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, చైనా

పూల్‌ సి: బెల్జియం, భారత్‌, కెనడా, దక్షిణాఫ్రికా

పూల్‌ డి: నెదర్లాండ్స్‌, మలేసియా, జర్మనీ, పాకిస్తాన్‌

 ఈ మెగా ఈవెంట్‌లో గొప్పగా లేని భారత్ ప్రదర్శన

ఈ మెగా ఈవెంట్‌లో గొప్పగా లేని భారత్ ప్రదర్శన

ఇప్పటివరకు జరిగిన ప్రతి వరల్డ్‌కప్‌లోనూ ఆడిన నాలుగు జట్లలో ఒకటైన భారత ప్రదర్శన ఈ మెగా ఈవెంట్‌లో అంత గొప్పగా లేదు. తొలి మూడు ప్రపంచకప్‌లలో (1971, 1973, 1975) టాప్‌-3లో నిలిచిన టీమిండియా ఆ తర్వాత ఒక్కసారి కూడా మళ్లీ టాప్‌-3కి చేరలేకపోయింది. మొత్తంగా 91 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 39 మ్యాచ్‌ల్లో గెలిచింది. 41 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 11 మ్యాచ్‌లను ‘డ్రా'గా ముగించింది.

నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన పాకిస్థాన్

నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన పాకిస్థాన్

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 12 సార్లు పాల్గొన్న పాకిస్తాన్‌ జట్టు అతధికంగా నాలుగు సార్లు (1971, 1978, 1981, 1994) విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా (1986, 2010, 2014); నెదర్లాండ్స్‌ (1973, 1990, 1998) మూడేసిసార్లు చాంపియన్‌గా నిలిచాయి. జర్మనీ రెండుసార్లు (2002, 2006) రెండుసార్లు ఈ టైటిల్‌ను గెలుపొందగా... భారత జట్టు (1975లో) ఒకే ఒక్కసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఐదుసార్లు తలపడిన భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది.

 హాకీ వరల్డ్ కప్‌లో భారత్ షెడ్యూల్

హాకీ వరల్డ్ కప్‌లో భారత్ షెడ్యూల్

నవంబరు 28: దక్షిణాఫ్రికాతో రా.గం. 7 నుంచి

డిసెంబరు 2: బెల్జియంతో రా.గం. 7 నుంచి

డిసెంబరు 8: కెనడాతో రా.గం. 7 నుంచి

మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

వరల్డ్ కప్‌లో భారత్‌ ప్రస్థానం

వరల్డ్ కప్‌లో భారత్‌ ప్రస్థానం

1971 మూడో స్థానం

1973 రన్నరప్‌

1975 విజేత

1978 6వ స్థానం

1982 5వ స్థానం

1986 12వ స్థానం

1990 10వ స్థానం

1994 5వ స్థానం

1998 9వ స్థానం

2002 10వ స్థానం

2006 11వ స్థానం

2010 8వ స్థానం

2014 9వ స్థానం

Story first published: Tuesday, November 27, 2018, 12:29 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X