న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేరు 'ఓల్లీ': హాకీ వరల్డ్‌కప్ మస్కట్‌ని చూశారా?

Hockey World Cup 2018: Official mascot Olly unveiled in Odisha

హైదరాబాద్: భారత్ ఆతిథ్యమిస్తోన్న హాకీ వరల్డ్‌కప్ 2018 మెగా టోర్నీకి సర్వం సిద్ధమైంది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ కోసం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం సిద్ధమైంది. ఇది 14వ హాకీ వరల్డ్ కప్ ఎడిషన్ కావడం విశేషం. నవంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే పురుషుల హాకీ వరల్డ్‌కప్ డిసెంబర్ 16తో ముగియనున్నాయి.

ఈ వరల్డ్‌కప్ కోసం ప్రముఖ బాలీవుడ్ పాటల రచయిత గుల్జార్ సాహిత్యంలో ఆస్కార్ విజేత ఏఆఱ్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్షన్‌‌లో ప్రమోషనల్ సాంగ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. "జై హింద్, జై ఇండియా" అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ హాకీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

హాకీ వరల్డ్ కప్ కోసం సిద్ధమైన మస్కట్

హాకీ వరల్డ్ కప్ కోసం సిద్ధమైన మస్కట్

ఈ టైటిల్ సాంగ్‌ భారత దేశ హాకీ చరిత్రతో పాటు హాకీ ప్రాముఖ్యాన్ని తెలిపేలా చక్కటి సాహిత్యంతో పాటు ఓ రిథమలో ఉండబోతోందని సమాచారం. తాజాగా ఈ హాకీ వరల్డ్‌కప్ 2018కు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ వరల్డ్‌కప్‌లో అభిమానులను అలరించేందుకు మస్కట్ సిద్దమైంది.

మస్కట్ పేరు ‘ఓల్లీ'

ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా మస్కట్ ‘ఓల్లీ' తుది డిజైన్‌ను ఆవిష్కరించారు. "ఇన్నాళ్లు ఇసుక గూడులో దాక్కున్న ఓలివ్ రిడ్లే... హాకీ వరల్డ్‌కప్ కోసం ఈ ప్రపంచంలోకి రా" అంటూ నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. ఒడిషాలో సముద్ర తీరంలో కనిపించే అతి అరుదైన ఓలివ్ రిడ్లే తాబేలును హాకీ వరల్డ్‌కప్ కోసం మస్కట్‌గా ఎంచుకోవడం విశేషం.

అరుదైన సముద్ర తాబేలే ఈ 'ఓల్లీ'

అరుదైన సముద్ర తాబేలే ఈ 'ఓల్లీ'

అంతరించేపోయే పరిస్థితిలో ఉన్న ఈ అరుదైన సముద్ర తాబేళ్ల నివాస ప్రాంతాలను సంరక్షించేందుకు ఒడిషా ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కృషి చేస్తోంది. ఆ ప్రయత్నాన్ని ప్రపంచానికి తెలియచేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓలివ్ రిడ్లే తాబేలును మస్కట్‌గా ఎంచుకున్నట్టు సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్‌లో తెలిపారు.

తొలి మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్

తొలి మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్

ఇక, టోర్నీలో భాగంగా పూల్-సిలో ఉన్న టీమిండియా నవంబర్ 28న తన తొలి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 2న బెల్జియంతో, డిసెంబర్ 8న కెనడాతో తలపడనుంది. హాకీ వరల్డ్ కప్‌కు భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. గతంలో 1982లో ముంబైలో, 2010లో ఢిల్లీ నగరాలు ఆతిథ్యమిచ్చాయి.

Story first published: Thursday, October 11, 2018, 17:55 [IST]
Other articles published on Oct 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X