న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ప్రపంచ కప్‌ సమరం ఇప్పుడే మొదలైంది'

Hockey World Cup 2018: Eleven minutes of ecstasy for India

భువనేశ్వర్‌: సొంతగడ్డపై టీమిండియా అంచనాలకు మించి దూసుకెళ్తోంది. డిసెంబర్‌ 13న జరగనున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నుంచే టీమిండియాకు అసలైన ప్రపంచ కప్ ఆరంభమవుతోందని కోచ్‌ హరేంద్ర సింగ్‌ అన్నారు. శనివారం కెనడాపై 5-1 తేడాతో నెగ్గిన భారత్‌.. నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లతో సంబంధం లేకుండా క్వార్టర్స్‌ బెర్త్‌ సొంతం చేసుకోవడానికి కెనడా మ్యాచ్‌ కీలకం. దీంతో విజృంభించి ఆడిన భారత ఆటగాళ్లు చివరి 15 నిమిషాల్లో ఏకంగా 4 గోల్స్‌ సాధించి జట్టును గెలిపించారు.

పూల్-సీలో అగ్రస్థానం కైవసం

పూల్-సీలో అగ్రస్థానం కైవసం

పాయింట్ల పరంగా బెల్జియంతో సమంగా ఉన్నా గోల్స్‌లో తేడాతో పూల్-సీలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ‘గ్రూపు దశలో ఇప్పటి వరకు జరిగింది 4 దేశాల టోర్నీ మాత్రమే. కానీ, ఇక నుంచే భారత్‌కు అసలైన ప్రపంచ కప్‌ మొదలవుతుంది. ఇప్పటి నుంచి మనం పతకం గురించి ఆశించొచ్చు' అని మ్యాచ్‌ అనంతరం హరేంద్ర పేర్కొన్నారు.

ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌

ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌

సొంతగడ్డపై జరిగిన హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. పూల్‌ దశలో జరిగిన చివరి మ్యాచ్‌లో కెనడాపై 5-1తో తిరుగులేని విజయం సాధించింది. సగర్వంగా నాకౌట్‌ దశకు చేరింది. కీలక పోరులో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా 5 గోల్స్‌ సాధించడం ప్రత్యేకం. మ్యాచ్‌లో ఆరంభం నుంచి హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేనదే ఆధిపత్యం. బంతిని తన పరిధిలోనే ఉంచుకుంది. ఆటగాళ్లు చురుగ్గా కదులుతూ ఒకరికొకరు పాస్‌లు అందించారు.

ఈ క్రమంలో భారత్‌ విజృంభించి..

ఈ క్రమంలో భారత్‌ విజృంభించి..

భారత జట్టు ఎక్కువగా ప్రత్యర్థి కోర్టులోనే ఆడారు. 12వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేశాడు. గోల్‌ సాధించి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. రెండో క్వార్టర్‌లో గోల్స్‌ నమోదు కాలేదు. 39వ నిమిషంలో వాన్‌సన్‌ ఫ్లోరిస్‌ గోల్‌ చేసి 1-1తో స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో భారత్‌ విజృంభించి ఆడింది.

6 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్‌ సాధించి

6 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్‌ సాధించి

6 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్‌ సాధించింది. చింగల్‌సేన (46 ని), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (47) వరుసగా ఫీల్డ్‌గోల్స్‌ చేశారు. రోహిదాస్‌ అమిత్‌ (51) పెనాల్టీకార్న్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 2 జట్లు హోరాహోరీగా ఆడాయి. మరో 3 నిమిషాల్లో ముగుస్తుందనగా లలిత్‌ ఉపాధ్యాయ్‌ (57 ని) మళ్లీ గోల్‌ చేసి భారత్‌కు ఘన విజయం అందించాడు. దీంతో టీమిండియా తన ఫూల్‌లో అగ్రస్థానంలో నిలిచి క్రాస్‌ఓవర్‌ మ్యాచ్‌ను తప్పించుకుంది.

Story first published: Monday, December 10, 2018, 9:47 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X