న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోకి వరద నీరు.. సాయం కావాలంటూ వేడుకున్న యువరాజ్‌!!

Hockey player Yuvraj Walmiki pleads for help after house gets water logged

ముంబై: కొన్ని రోజులుగా మహారాష్ట్రలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబై మహానగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక బుధవారం భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా బీభత్సం సృష్టించాయి. వేగంగా వీచిన గాలుల ధాటికి పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు కుప్పకూలగా.. పెద్ద పెద్ద భవనాలు సైతం దెబ్బ తిన్నాయి. మరోవైపు భారీ వర్షంతో చెంబూర్, పరేల్, హింద్మాతా, వడాలా మరియు ముంబైలోని ఇతర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో ముంబైలో నివాసముంటున్న భారత హాకీ స్ట్రయికర్‌ యువరాజ్‌ వాల్మీకి ఇల్లు దెబ్బతింది.

బుధవారం ఇంట్లోకి వరద నీరు రావడంతో యువరాజ్‌ వాల్మీకి నానా కష్టాలు పడ్డాడు. తన ఇంట్లోకి చేరిన నీటిని బయటకి పారబోస్తున్న వీడియోను వాల్మీకి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 28 సెకన్ల వీడియోలో వాల్మీకి తన డ్రాయింగ్ రూమ్ నుండి నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో తమను ఆదుకోవాలని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రేను వాల్మీకి కోరాడు.

భారీ ఈదురు గాలుల ధాటికి నవీ ముంబైలోని ప్రఖ్యాత డీవై పాటిల్‌ స్పోర్ట్స్ స్టేడియం ధ్వంసమైంది. స్టేడియం పైకప్పులో కొంతభాగం కిందపడిపోయింది. స్టేడియంలో పలుచోట్ల విధ్వంసం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ధాటికి స్టేడియంలో భారీగానే నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.పైకప్పులో ఓవైపు భాగమంతా పూర్తిగా పడిపోయిన దృశ్యాలను నవీ ముంబై పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

మరోవైపు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) కార్యాయలంపై ఉండే సైన్ బోర్డు కూడా ధ్వంసమైంది. గాలులు ధాటికి ఒరిగిపోయి గాల్లో వేలాడుతోంది. ఆ సైన్ బోర్డు కింద పడితే.. తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని, అది కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీఎస్ఈ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు ఈ రోజు కూడా పడే అవకాశం ఉండడంతో బృహన్ ముంబై కార్పొరేషన్ అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ను రంగంలోకి దింగి సహాయక చర్యలను చేపట్టింది.

England vs Pakistan: అలవాటులో పొరపాటు.. కరోనా రూల్స్ మర్చిపోయిన కెప్టెన్లు!!England vs Pakistan: అలవాటులో పొరపాటు.. కరోనా రూల్స్ మర్చిపోయిన కెప్టెన్లు!!

Story first published: Thursday, August 6, 2020, 11:43 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X