న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత మాజీ కోచ్ ఓల్ట్ మన్‌ను పాకిస్థాన్ జాతీయ జట్టు కోచ్‌గా...

Former Indian hockey coach Roelant Oltmans set to take charge of the Pakistan men’s team

హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కోచ్‌ రోలెంట్‌ ఓల్ట్‌మన్స్‌.. పాకిస్థాన్‌ చీఫ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. రెండున్నరేళ్లపాటు పాక్‌ కోచ్‌గా ఓల్ట్‌మన్స్‌ సేవలందించనున్నట్టు పాకిస్థాన్‌ హాకీ ఫెడరేషన్‌ ప్రకటించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓల్ట్‌మన్స్‌ భారత జట్టు హైపెర్ఫామెన్స్‌ డైరెక్టర్‌, కోచ్‌గా నాలుగేళ్లపాటు సేవలందించాడు.

మున్ముందు రాబోయే కామన్వెల్త్ క్రీడలనుద్దేశించి ఓల్ట్ మన్‌ను పాకిస్థాన్ జట్టు తీసకుంది. ఆయన నేతృత్వంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను దక్కంచుకుంది. ఇదే నమ్మకంతో పాకిస్థాన్ కూడా అతన్ని సంప్రదించింది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన బేరసారాల్లో ఎట్టకేలకు అతను ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు పాక్ హాకీ ఫెడరేషన్ తెలిపింది.

డచ్‌కు చెందిన రాయిలెంట్ ఓల్ట్‌మన్స్‌‌ను ఒమన్‌లో పాక్, జపాన్, ఒమన్ ముక్కోణపు టోర్నీ ఆడుతుండగా అక్కేడ అందుబాటులో ఉండడంతో చర్చలు సులభమైయ్యాయి.

హాకీ ఇండియా 2013లో ఓల్ట్‌మన్స్‌ను హై ఫర్ఫామెన్స్‌ డైరెక్టర్‌గా నియమించింది. 2015లో వివాదాస్పద రీతిలో భారత జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. అద్భుత విజయాలు సాధించినప్పటికీ గతేడాది టీమిండియా ఆశించిన మేరకు రాణించలేదు. ప్రపంచకప్‌కే చాలా కష్టపడి అర్హత సాధించింది. అయితే, గత సెప్టెంబరులో ఈ డచ్‌ కోచ్‌పై హాకీ ఇండియా (హెచ్‌ఐ) వేటు వేసింది.

Story first published: Thursday, March 8, 2018, 8:52 [IST]
Other articles published on Mar 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X