న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పాన్సర్ దొరికాడు: హాకీ వరల్డ్ కప్ కోసం భారత్‌కు రానున్న పాక్

Cash-strapped Pakistan hockey finally finds sponsor, World Cup doubts over

హైదరాబాద్: భారత్ ఆతిథ్యమిస్తోన్న 14వ హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ హాకీ జట్టు భారత్‌కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆర్థిక సమస్యల కారణంగా భారత్‌లో నవంబర్ 28 నుంచి ఆరంభమయ్యే హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనడం సందేహంగా మారిన సంగతి తెలిసిందే.

అయితే, ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ 'హైయర్‌' పాకిస్థాన్ హాకీ జట్టుకు 2020 వరకు స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు ముందుకు వచ్చింది. దీంతో పాకిస్థాన్ జట్టు హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనే విషయంలో స్పష్టత వచ్చింది. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (క్రికెట్‌) జట్టు పెషావర్‌ జల్మీ ఫ్రాంఛైజీ అధినేత జావెద్‌ అఫ్రిదీ హాకీ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించాడు.

హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని ప్రకటించిన జావేద్‌ అఫ్రిది

హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని ప్రకటించిన జావేద్‌ అఫ్రిది

పాకిస్థాన్ హాకీ జట్టు ఆడనున్న అంతర్జాతీయ పర్యటనలతో పాటు దేశంలో కూడా హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని జావేద్‌ అఫ్రిది ప్రకటించారు. ఈ స్పాన్సర్‌షిప్‌ 2020 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొన్న ఆటగాళ్లకు దినసరి భత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పాక్‌ హాకీ సమాఖ్య ఉంది.

భువనేశ్వర్ వేదికగా హాకీ వరల్డ్ కప్

భువనేశ్వర్ వేదికగా హాకీ వరల్డ్ కప్

ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.80 మిలియన్ల నిధులను వెంటనే విడుదల చేయాలని... అలా చేయకపోతే భారత్‌లోని భువనేశ్వర్ వేదికగా జరిగే హాకీ వరల్డ్‌కప్‌లో పాల్గొనబోమని పీహెచ్‌ఎఫ్‌ హెచ్చరించింది. అయినా కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో పాకిస్థాన్ హాకీ జట్టు వరల్డ్‌ కప్‌లో పాల్గొనబోవడం లేదని వార్తలు వచ్చాయి.

పీసీబీని రుణం అడిగిన పీహెచ్‌ఎఫ్‌

పీసీబీని రుణం అడిగిన పీహెచ్‌ఎఫ్‌

మరోవైపు తమకు ఆదుకోవాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డును రుణం అడిగినా కూడా ఫలితం లేకపోయింది. ఈ దశలో దిగ్గజ ఆటగాడు షహబాజ్‌ అహ్మద్‌ చొరవతో ఆ జట్టుకు స్పాన్సర్‌షిప్‌తో పాటు పాత బకాయిలు తీర్చేందుకు అవకాశం లభించింది. మరోవైపు తమకు సాయం అందించాలంటూ పాక్‌ హాకీ సమాఖ్య చేసిన విజ్ఞప్తికి ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విశేషం.

 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు

నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు

హాకీ వరల్డ్ కప్‌కు భువనేశ్వర్‌లోని కలింగ అంతర్జాతీయ హాకీ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొనున్నాయి. నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఈ హాకీ వరల్డ్ కప్ కోసం భారత హాకీ జట్లు(పురుషులు, మహిళలు) ఇప్పటికే పూర్తిగా సన్నద్ధమయ్యాయి. నవంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే పురుషుల హాకీ వరల్డ్‌కప్ డిసెంబర్ 16తో ముగియనున్నాయి. ఈ టోర్నీలో పురుషుల హాకీ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

Story first published: Tuesday, November 13, 2018, 12:01 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X