న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటైర్మెంట్ తర్వాత సర్దార్ సింగ్ పయనమెటు?

After ending hockey career, Sardar Singh eyes professional golf

హైదరాబాద్: "ఆటకు అతనే నిజమైన రాయబారి" ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పన్నెండేళ్ల కెరీర్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ హాకీ నుంచి రిటైరవుతున్నట్టు సర్దార్ సింగ్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్దార్ సింగ్‌ను ఉద్దేశించి భారత హాకీ (హెచ్‌ఐ) కీలక వ్యాఖ్యలు చేసింది.

'ఓటమిని జీర్ణించుకోలేకనే రిటైర్‌మెంట్ ప్రకటించా''ఓటమిని జీర్ణించుకోలేకనే రిటైర్‌మెంట్ ప్రకటించా'

"భారత హాకీ ఉవ్వెత్తున లేచినపుడు, గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నపుడూ జట్టుకు వెన్నుదన్నుగా ఉన్నాడు. ఆటలో నాణ్యతా ప్రమాణాలు, అంకితభావం అతన్ని హాకీకి నిజమైన రాయబారిగా తీర్చిదిద్దాయి" అని హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు రాజీందర్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"భారత హాకీ కెప్టెన్‌గా, తదుపరి ఉత్తమ ఆటగాడిగా యువతరానికి అతను పెద్ద ప్రేరణ. 2014 ఆసియా గేమ్స్‌లో సర్దార్ సింగ్ సారథ్యంలో భారత జట్టు చాంపియన్‌గా నిలవడం ఎప్పటికీ మర్చిపోలేనిది. భారత హాకీలో చోటుచేసుకున్న విప్లవాత్మక ఆట పరిణామాలు, ప్రపంచ ర్యాంకులో జట్టు ఎదుగుదలలో సర్దార్ పాత్ర అనిర్వచనీయం" అని పేర్కొన్నాడు.

"భారత హాకీకి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన సాధించిన ఘనతకు అభినందనలు. సర్దార్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా సాగాలని హాకీ ఇండియా ఆకాంక్షిస్తోంది" అని ఓ ప్రకటనలో తెలిపాడు. భారత హాకీ లెజెండ్ అనిపించుకున్న సర్దార్, తన సారథ్యంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.

2010, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతాలు, 2007, 2017 ఆసియా కప్‌లో స్వర్ణాలు, 2013 ఆసియా కప్‌లో రజతం, 2014 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం, 2015 రాయ్‌పూర్ వరల్డ్ లీగ్‌లో కాంస్యం, 2011 ఛాంపియన్స్ ఛాలెంజ్‌లో రజత పతకాలు సాధించిపెట్టాడు. ఈ ఏడాది బ్రెడాలో జరిగిన ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు రజతాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన తర్వాత సర్దార్ సింగ్ తనకు ఎంతో ఇష్టమైన గోల్ఫ్‌ క్రీడపై ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ శిక్షణ శిబిరం కోసం బుధవారం 25 మందితో కూడిన జట్టుని హాకీ ఇండియా ప్రకటించగా.. అందులో సర్దార్ సింగ్‌కి చోటు లభించలేదు. దీంతో.. మనస్తాపానికి గురైన ఈ మిడ్‌ఫీల్డర్ రోజు రాత్రి అంతర్జాతీయ కెరీర్‌కి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, September 17, 2018, 19:13 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X