న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'మరిన్ని అవార్డులే లక్ష్యం, ఆ రికార్డు సమం చేస్తా'

మరిన్న అవార్డులు గెలుచుకోవడమే తన లక్ష్యమని బాల్లోన్ డీ’ఓర్ - 2016 అవార్డు గ్రహీత, రియల్ మాడ్రిడ్ సారథి క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు.

By Nageshwara Rao

బెంగళూరు: మరిన్న అవార్డులు గెలుచుకోవడమే తన లక్ష్యమని బాల్లోన్ డీ'ఓర్ - 2016 అవార్డు గ్రహీత, రియల్ మాడ్రిడ్ సారథి క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు. ఎఫ్‌సి బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీ తనతోపాటు ఒకే టీంలో ఉన్నా అధిక గోల్స్ సాధించడమే తన లక్ష్యమన్నాడు.

ఈ ఏడాది బాల్లోన్ డి'ఓర్ అవార్డు గ్రహీతగా ఎంపికైన తర్వాత రొనాల్డో మీడియాతో మాట్లాడాడు. మెస్సీ, గ్రైజ్మన్ ఒకే జట్టులోనే ఉన్నా మరిన్ని అవార్డులు గెలుచుకోగలరా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ ఇది చాలా కష్టమైన ప్రశ్న, తనకు ఆ విషయం తెలియదన్నాడు.

'తామిద్దరం ఒకే జట్టు తరఫున ఆడుతుండటం ఆసక్తికరంగానే ఉండొచ్చు. గొప్ప ఆటగాళ్లంతా కలిసే ఆడతారనుకుంటా. ఒకవేళ మేం ఒకే జట్టు తరఫున ఆడినా ఆయనకంటే ఎక్కువ గోల్స్ చేసి అవార్డులు పొందుతా' అని క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. 'లియానెల్ మెస్సీ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన ఐదు బాల్లోన్ డి'ఓర్ అవార్డులు గెలుచుకున్నాడు' అని తెలిపాడు.

లియానెల్ మెస్సీ రికార్డు సమం చేస్తా

లియానెల్ మెస్సీ రికార్డు సమం చేస్తా

వచ్చే ఏడాది లియానెల్ మెస్సీ రికార్డు సమం చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. ‘నేను వచ్చే ఏడాది కూడా బాల్లోన్ డీ ఓర్ అవార్డును గెలుచుకుంటా. ఎల్లవేళలా పోరాటమే నా పంథా. కానీ ప్రస్తుతం నా లక్ష్యం ముఖ్యమైన ట్రోఫీ క్లబ్ వరల్డ్ కప్ గెలుచుకోవడమే. దీని తర్వాత లా లీగ టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవాలి. రియల్ మాడ్రిడ్ గెలుచుకోవాలని భావిస్తున్న టైటిల్ అది. తర్వాత సాధ్యమైతే చాంపియన్స్ లీగ్ టైటిల్ ను మరోసారి గెలుచుకోవాలన్నది మా ఆకాంక్ష. తదుపరి కొపా డెల్ రే కప్ కైవసం చేసుకోవడం మా లక్ష్యం. నేను ఎల్లవేళలా ప్రతిదానిలో విజయం సాధించడానికే ప్రయత్నిస్తా' అని తెలిపాడు. క్రిస్టియానో రొనాల్డో జట్టుకు సారథిగా క్లబ్, సొంత దేశానికి రెండు ముఖ్యమైన టైటిళ్లు అందించాడు. తొలిసారి యుఎఎఫ్ఎ చాంపియన్స్ లీగ్ లో రియల్ మాడ్రిడ్ విజయంతోపాటు సొంత దేశం పోర్చుగల్ జట్టుకు యూరో - 2016 ట్రోఫీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

అవార్డుతో ఆరోపణలు దూది పింజాల్లా తేలిపోయాయ్

అవార్డుతో ఆరోపణలు దూది పింజాల్లా తేలిపోయాయ్

బాల్లోన్ డి'ఓర్ అవార్డు నాలుగోసారి గెలుచుకోవడంతో తాను పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలన్నీ దూది పింజాల్లా కొట్టుకుపోయాయని క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. అవార్డు గెలుపొందిన సంతోషాన్ని ‘పన్ను ఎగవేత' వార్తలు కొంత దెబ్బ తీశాయని అన్నాడు. ఇటువంటి ఆరోపణలు వినడానికి చాలా కష్టంగా ఉంటుందన్నాడు. కానీ ఇదంతా అబద్దం అని ఫ్రాన్స్ పుట్‌బాల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సుమారు 12 యూరోపియన్ దిన పత్రికలు రొనాల్డో సహా పలువురు ఫుట్ బాల్ ప్లేయర్లు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని వార్తా కథనాలు ప్రచురించాయి.

రొనాల్డోపై పన్ను ఎగవేత ఆరోపణలు

రొనాల్డోపై పన్ను ఎగవేత ఆరోపణలు

పోర్చుగీస్ స్ట్రయికర్ రొనాల్డో సుమారు 160 మిలియన్ల డాలర్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని పేర్కొన్నాయి. ఈ వార్తలు వినడానికి తనతోపాటు తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు కష్టంగానే ఉన్నదని చెప్పాడు. బాల్లోన్ డి' ఓర్ అవార్డు కోసం జరిగిన ఓటింగ్‌లో రొనాల్డో 745 ఓట్లు పొందాడు. రెండోస్థానంలో నిలిచిన లియానెల్ మెస్సీకి కేవలం 316 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ తానెప్పటికీ 2016ను మర్చిపోలేనన్నాడు. ఈ ఏడాదే రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుకు యుఎఎఫ్ఎ చాంపియన్స్ లీగ్, పోర్చుగల్ జట్టుకు యూరో కప్ - 2016 గెలుచుకోవడంలో స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశాడు.

ఈ ఏడాది 42 మ్యాచ్ ల్లో 38 గోల్స్

ఈ ఏడాది 42 మ్యాచ్ ల్లో 38 గోల్స్

ఈ ఏడాది రొనాల్డో 42 మ్యాచ్ ల్లో 38 గోల్స్ సాధించాడు. వాటిలో ఐదు హ్యాట్రిక్ గోల్స్ ఉండటం కూడా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకోవడానికి దోహదపడింది. దీంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, ఫుట్ బాల్ ఫ్యాన్స్ రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీ జెయింట్స్ లో ఒకటిగా ఉన్న మాంఛెస్టర్ సిటీ క్లబ్ మొదలు జీనియస్ ఫుట్‌బాల్, సహచర ప్లేయర్లు సెర్జియో రామోస్, మార్సిలిన్హో, జాక్ లారెన్స్ తదితరులు ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X