న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇండియా vs ఖతార్: ఎప్పుడు, ఎక్కడ, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు!

World Cup 2022 Qualifier: India vs Qatar: Preview, when and where to watch, TV timing, live streaming, head to head

హైదరాబాద్: ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్ 2022 క్వాలిఫయిర్ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం ఆసియా ఛాంపియన్ ఖతార్‌తో భారత పుట్‌బాల్ జట్టు తలపడనుంది. ప్రస్తుతం 62వ ర్యాంకులో ఉన్న ఖతార్ 103వ ర్యాంకులో ఉన్న భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఖతార్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

క్వాలిఫయిర్స్‌లో భాగంగా సెప్టెంబరు 5న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 6-0తో ఖతార్ విజయం సాధించిన ఖతార్ ఇప్పుడు రెండో విజయంపై కన్నేసింది. మరోవైపు అదే రోజున గౌహతి వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఛెత్రి నాయకత్వంలోని భారత పుట్‌బాల్ జట్టు 1-2తో ఒమన్‌ చేతిలో పరాజయంపాలైంది.

Ashes 2019: విరాట్ కోహ్లీ టెస్టు రికార్డుని బద్దలు కొట్టిన స్మిత్Ashes 2019: విరాట్ కోహ్లీ టెస్టు రికార్డుని బద్దలు కొట్టిన స్మిత్

ఒమన్ చేతిలో ఓటమి

ఒమన్ చేతిలో ఓటమి

సునీల్ ఛెత్రి గోల్‌ చేయడంతో 24వ నిమిషంలో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక, రెండో అర్దభాగంలో భారత్ జోరు పెంచినా.. గోల్స్ మలచడంలో విఫలమైంది. మరో ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా ఒమన్‌కు చెందిన రబియా అలవి (82వ, 90వ నిమిషం) రెండు గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఓటమితో ఆరంభించిన భారత్

ఓటమితో ఆరంభించిన భారత్

దీంతో క్వాలిఫయిర్స్‌ని భారత్ ఓటమితో ప్రారంభించగా... ఖతార్ విజయంతో అరంభించింది. 2022లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు ఖతారే ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఖతార్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఈ ఏడాది యుఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌ను సైతం ఖతారే సొంతం చేసుకుంది.

కోప్ అమెరికాలో సత్తా చాటిన ఖతార్

కోప్ అమెరికాలో సత్తా చాటిన ఖతార్

కోపా అమెరికా లీగ్‌లో ఓ ఆహ్వాన మ్యాచ్‌ని ఆడిన ఖతార్ జట్టు ప్రత్యర్ధిపై గెలిచేంత పని చేసింది. మరోవైపు భారత జట్టు కూడా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. జనవరిలో జరిగిన ఆసియా కప్‌లో యూఏఈ, బహ్రెయిన్ జట్లపై విజయం సాధించిన భారత జట్టు నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది.

చివరగా 2007 సెప్టెంబర్‌లో

చివరగా 2007 సెప్టెంబర్‌లో

కాగా, ఇరు జట్ల మధ్య రికార్డుని ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా మూడు మ్యాచ్‌ల్లో ఖతారే విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరగా ఇరు జట్లు సెప్టెంబర్ 2007లో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టుపై 6-0తో ఖతార్ విజయం సాధించింది.

భారత్ vs ఖతార్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

భారత్ vs ఖతార్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

సెప్టెంబర్ 10 - జాస్సిమ్ బిన్ హమద్ స్టేడియం, దోహా

భారత్ vs ఖతార్ మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం

భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:00 గంటలకు

ఇండియాలో లైవ్ టెలికాస్ట్

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ వీక్షించొచ్చు?

హాట్ స్టార్ యాప్‌లో లేదా hotstar.com లో

జట్ల వివరాలు:

ఖతార్: సాద్ షీబ్, మేషాల్ బర్షమ్, మహ్మద్ అల్-బక్రీ, పెడ్రో, సేలం అల్-హజ్రీ, తారెక్ సల్మాన్, అబ్దుల్కరీమ్ హసన్, బౌలేమ్ ఖౌఖి, హసన్ అల్-హేడోస్, అక్రమ్ అఫీఫ్, అబ్దులాజీజ్ అల్-అన్సారీ, హషీమ్ అలీ, బస్సామ్ అల్ రావ్ అస్సిమ్ మాడిబో, అల్మోజ్ అలీ, కరీం బౌడియాఫ్, అలీ అఫీఫ్, ముసాబ్ కేడర్, అహ్మద్ ఫాతి, యూసఫ్ అబ్దేల్‌రాజాక్, అల్ మహదీ అలీ, అహ్మద్ అలయెల్దిన్, అబ్దులాజీజ్ హతీమ్, అబ్దుల్లా అబ్దుల్ సలాం.

భారతదేశం: గుర్ప్రీత్ సింగ్ సంధు, అమృందర్ సింగ్, కమల్జిత్ సింగ్, విశాల్ కైత్, రాహుల్ భేకే, నిషు కుమార్, ప్రీతమ్ కోటల్, అనాస్ ఎదతోడికా, సందేష్ జింగాన్, నరేందర్ గహ్లోట్, సార్థక్ గోలుయి, ఆదిల్ ఖాన్, సుభాషిష్ బోస్, మందార్ నౌదార్ రావు సింగ్, అనిరుధ్ థాపా, రేనియర్ ఫెర్నాండెజ్, వినిత్ రాయ్, సహల్ అబ్దుల్ సమద్, బ్రాండన్ ఫెర్నాండెజ్, లల్లియన్‌జులా చాంగ్టే, హలీచరన్ నర్జరీ, ఆశిక్ కురునియాన్, బల్వంత్ సింగ్, సునీల్ ఛెత్రి, మన్వీర్ సింగ్.

Story first published: Tuesday, September 10, 2019, 15:20 [IST]
Other articles published on Sep 10, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X