న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ను శాసించేది వీళ్లే

World Cup 2018 top 10 players to watch: Messi, Ronaldo, Neymar and more

హైదరాబాద్: మరో రెండురోజులలో ఫిపా ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ప్రతి ప్రపంచకప్‌నకు ముందుగా జట్ల అవకాశాలు హాట్ టాపిక్.. ఆయా జట్లలోని సూపర్‌స్టార్ల ఆట ఎలా ఉండబోతుంది.. ఎవరిని ఎలా నియంత్రించుకోవాలో కోచ్‌లు వ్యూహాలు రచిస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా స్టార్ ప్లేయర్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు స్టేడియాలకు పరుగులు పెడుతుంటారు.

ఈ ప్రపంచకప్‌లో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో దాదాపు చివరి ప్రపంచకప్ ఆడుతుండగా.. ఇంగ్లండ్ కొత్త ఆటగాడు హ్యారీకేన్, బెల్జియం ఈడెన్ హజార్డ్, బ్రెజిల్ సూపర్ ఫార్వర్డ్ నెయ్‌మార్ స్టార్ ఆటగాళ్ల హోదాతో రష్యాలో అడుగిడారు. వీళ్లే ప్రధాన బలంగా ఆయా జట్లు బరిలోకి దిగనున్నాయి.

పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

మెస్సీ.. ఫుట్‌బాల్‌లో మరో మారడోనా..

మెస్సీ.. ఫుట్‌బాల్‌లో మరో మారడోనా..

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులు సంపాదించుకున్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ..ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో మారడోనా..అర్జెంటీనా జట్టుకు స్టార్ అట్రాక్షన్.. బంతిపై నియంత్రణ.. అతను గోల్ చేసిన విధానం చూస్తే ఇంత సునాయాసమా ఫుట్‌బాల్ ఆడడం అనేంతగా మంత్రముగ్ధులను చేస్తాడు. ప్రపంచంలోనే అత్యంత సొగసైన స్ట్రయికర్..అతని ఆటలో అందం.. సంధించిన షాట్లలో కచ్చితత్వం.. బంతిని గోల్‌పోస్టులోకి పంపిస్తాడు.. ప్రత్యర్థి గోల్‌కీపర్ కదలికలు వేగంగా పసిగట్టడం ..చివరిక్షణంలో సైతం బంతి దిశను మార్చగలిగేలా నియంత్రణ..ఇలా మెస్సీ తన ఆటతో అందరివాడయ్యా డు. తాజాగా రష్యాలో జరుగనున్న ఈ ప్రపంచకప్‌లో మెస్సీని నిలువరించడం ప్రత్యర్థి జట్లకు శక్తికి మించిన పనే. మరోసారి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ తన కలను నిజం చేసుకునేందుకు ఇదే ఆఖరు అవకాశం కావొచ్చు.. తన అసాధారణ విన్యాసాలతో అభిమానులను అలరించడమే కాదు.. ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేయడంలో ఈ ప్రపంచకప్‌లో నంబర్‌వన్ స్టార్ స్ట్రయికర్‌దే తొలిస్థానం..

పోర్చుగల్ పోటుగాడు రొనాల్డో

పోర్చుగల్ పోటుగాడు రొనాల్డో

34 ఏళ్ల స్టార్ ప్లేయర్ 2016 యూరోకప్‌లో ఒంటిచేత్తో చాంపియన్‌గా నిలిపాడు. మైదానంలో బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి డిఫెండర్లకు దడే.. ఆటలో అతనికున్న బలం వేగం. అంతవేగంలోనూ అతని కాళ్లను వదిలి బంతి వెళ్లదు..గోల్‌పోస్టుపై గురిపెడితే బంతి వెళ్లి పడాల్సిందే.. ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తరఫున నాలుగోసారి ఆడుతున్న రొనాల్డో కేవలం మూడుగోల్స్ మాత్రమే నమోదు చేశాడు.. కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్న ఈ స్టార్ ..చివరిసారి అద్భుతంగా ఆడితే ప్రపంచకప్ విజేతగా చరిత్రలో పేరు సంపాదించుకోగలడు. 5 సార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్ అవార్డు, ప్రపంచమంతా తెలిసేంత పాపులారిటీ, అంతకుమించిన అవార్డులు, రివార్డులు..అతని ఆటతీరుకు ఇవన్నీ దాసోహం అన్నాయి.

ప్రపంచంలోనే ఖరీదైన స్ట్రయికర్‌గా నెయ్‌మార్

ప్రపంచంలోనే ఖరీదైన స్ట్రయికర్‌గా నెయ్‌మార్

బ్రెజిల్ అంటే ఫుట్‌బాల్..వారికి శ్వాస అది.. ఆటలో అంతగా మమేకం అవుతారు. 5సార్లు ప్రపంచకప్ ముద్దాడిన బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదువేలేదు.. పీలే లాంటి దిగ్గజమే కాదు.. ఓ రొమారియో.. బెబెటో.. రాబర్టో బాజియో.. దుంగా.. రొనాల్డో.. కపు.. ఇప్పుడు తాజాగా నెయ్‌మార్..ఔను.. బ్రెజిల్ జట్టులో ఎప్పుడూ స్టార్లు ఉంటారు.. నెయ్‌మార్‌లాంటి సూపర్‌స్టారూ ఉంటాడు.. స్వదేశంలో జరిగిన 2014 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నెయ్‌మార్ గాయంతో జట్టుకు దూరం కాగా.. సెమీస్‌లో ఆ జట్టును జర్మనీ 7-1 గోల్స్ తేడాతో ఓడించింది.. గాయం నుంచి కోలుకుని బ్రెజిల్ జట్టులో నెయ్‌మార్ తిరిగిరావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. అప్పటికి ఇప్పటికీ జట్టులో అతనే స్టార్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టార్ స్ట్రయికర్‌గా నిలిచిన నెయ్‌మార్ తన అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తే బ్రెజిల్ ఆరోసారి ప్రపంచకప్ ముద్దాడడం ఖాయమే..

ఖాళీలను కాళ్లతో శాసించే హజార్డ్

ఖాళీలను కాళ్లతో శాసించే హజార్డ్

అతను కళ్లతోనే ఖాళీలు వెతుకుతాడు. మ్యాచ్ పరిస్థితి గందరగోళంగా ఉన్న తరుణంలో కాళ్లతో మాయ చేయగలడు. ప్రపంచ స్థాయిలో.. టాప్ ప్లేయర్లలో ఒకడైన బెల్జియం స్టార్ ఫుట్‌బాలర్ ఈడెన్ హజార్డ్ చేసే గోల్స్ కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్ట్రయికర్.. ఈడెన్ హజార్డ్. గోల్స్ చేయడంలో దిట్ట. ఇదే అతనికి ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్ తెచ్చి పెట్టింది. ఇదిలా ఉంటే, అతను ఆడుతున్న బెల్జియం జట్టుకూడా ఒక్క పరాజయం లేకుండా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. అతని దూకుడుకి డిబ్రుయెన్ లాంటి స్టార్ మిడ్‌ఫీల్డర్ అండగా.. హజార్డ్ చెలరేగితే ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు ఖాయం.

ప్రపంచ కప్ సాధించాలంటే హ్యారీ కేన్..

ప్రపంచ కప్ సాధించాలంటే హ్యారీ కేన్..

ప్రతిసారి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం..రిక్త హస్తాలతో వెనుదిరగడం ఇంగ్లాండ్ జట్టుకు అలవాటుగా మారినా.. డేవిడ్ బెక్‌హాం.. వేన్‌రూనీ లాంటి స్టార్ ఫుట్‌బాలర్లను అందించింది.. తాజాగా రష్యాలో జరగనున్న ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టులోకి 24 ఏళ్ల స్టార్ హ్యారీ కేన్ ఆశాకిరణంగా నిలుస్తున్నాడు. 2017-18 సీజన్‌లో 41 గోల్స్‌తో ఫుట్‌బాల్ ప్రపంచంలో సరికొత్త స్టార్‌హోదా తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులోని మార్కస్ రాస్‌ఫోర్డ్, డేల్ అలీతోపాటు కేన్ కలిస్తే సునామీ వచ్చినట్లే.. పైగా ఇంగ్లాండ్ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఒత్తిడికూడా లేదు.. దీంతో కేన్ మరింత స్వేచ్ఛగా ప్రత్యర్థి జట్ల పని పట్టేందుకు అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు ఎప్పుడో 1966లో ప్రపంచకప్ విజేతగా నిలిచింది. మరో 52 ఏండ్లు ముగిసినా ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడలేకపోయింది.

Story first published: Tuesday, June 12, 2018, 11:45 [IST]
Other articles published on Jun 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X