న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: ఫ్రాన్స్ జగజ్జేతగా నిలిచిన వేళ.. అవార్డులివే

World Cup 2018: The bizarre trophy presentation caps tournament

హైదరాబాద్: రష్యా వేదికగా మొదలై నెల రోజుల పాటు క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 'ఫిఫా ప్రపంచకప్‌' ఆదివారం ఫైనల్‌తో ముగిసింది. భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన జర్మనీ, అర్జెంటీనా, స్పెయిన్, పోర్చుగల్ లాంటి జట్లు పేలవరీతిలో నిష్క్రమించగా.. ఎలాంటి అంచనాలులేని ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు అనూహ్యంగా ఫైనల్‌కి చేరి అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

World Cup 2018: The bizarre trophy presentation caps tournament

ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాని ఓడించి రెండోసారి ప్రపంచకప్‌ని ఎగరేసుకుపోయింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్‌ 2018 విజేతగా నిలిచింది. 1998లో తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్.. ఆ తర్వాత 2006లో ఫైనల్‌కి చేరినా.. టైటిల్‌ను గెలవలేకపోయింది.

1
958085
ప్రపంచకప్‌ కలని నెరవేర్చుకుంది.. ఫ్రాన్స్‌

ప్రపంచకప్‌ కలని నెరవేర్చుకుంది.. ఫ్రాన్స్‌

అయితే.. తాజాగా క్రొయేషియాని ఓడించి మరోసారి ఫ్రాన్స్‌ తన ప్రపంచకప్‌ కలని నెరవేర్చుకుంది. గోల్స్‌ మోత మోగించిన ఫ్రాన్స్‌ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. క్రొయేషియా ఆటగాడు మంజుకిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ (18వ)తో ఖాతా తెరిచిన ఫ్రాన్స్‌కు గ్రీజ్‌మన్‌ (38వ, పెనాల్టీ), పోగ్బా (59వ), ఎంబపె (65వ) తలో గోల్‌ అందించారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ), మంజుకిచ్‌ (69వ) చెరో గోల్‌ చేశారు. ఆత్మవిశ్వాసం సన్నగల్లిన క్రొయేషియా ఆ తర్వాత ఇంకా గోల్‌ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

లూకా మోద్రిచ్‌కి ‘గోల్డెన్‌ బాల్‌’‌

లూకా మోద్రిచ్‌కి ‘గోల్డెన్‌ బాల్‌’‌

టైటిల్‌ను గెలవలేకపోయినా.. క్రొయేషియా పోరాట పటిమతో అభిమానుల మనసులు గెల్చుకుంది. టోర్నీలో ప్రత్యర్థుల నుంచి మొత్తంగా 301 దాడులను కాపాడుకుని ‘ఉత్తమ డిఫెండింగ్' జట్టుగా క్రొయేషియా నిలిచింది. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రొయేషియా ఆటగాడు లూకా మోద్రిచ్‌కి ‘గోల్డెన్‌ బాల్‌'‌ అవార్డు దక్కింది.

ఫ్రాన్స్‌‌కి చెందిన ఎంబపె‌కి

ఫ్రాన్స్‌‌కి చెందిన ఎంబపె‌కి

జట్టు కోచ్‌గా ప్రపంచచకప్పు గెలిచిన మూడో వ్యక్తిగా ఫ్రాన్స్‌ కోచ్‌ డెషాంప్స్‌ ఘనత సాధించాడు. ఉత్తమ యువ ఆటగాడికి ఇచ్చే ‘యంగ్ ప్లేయర్' అవార్డ్ ఫ్రాన్స్‌‌కి చెందిన ఎంబపె‌కి దక్కింది.

బెల్జియం జట్టు మాత్రమే కొట్టిన గోల్స్‌ 16

బెల్జియం జట్టు మాత్రమే కొట్టిన గోల్స్‌ 16

జూన్ 14న ఆరంభమైన ఫిఫా ప్రపంచకప్‌లో మొత్తం 169 గోల్స్ నమోదయ్యాయి. ఇందులో బెల్జియం జట్టు మాత్రమే కొట్టిన గోల్స్‌ 16 కావడం విశేషం.

 అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్‌ బూట్‌

అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్‌ బూట్‌

టోర్నీలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడికి ఇచ్చే ‘గోల్డెన్‌ బూట్‌' ఈసారి ఇంగ్లాండ్‌ స్టార్ హ్యారీకేన్ సొంతమైంది. అతను మొత్తం 6 గోల్స్ చేశాడు.

బెల్జియం గోల్‌ కీపర్‌కు ‘గోల్డెన్ గ్లోవ్’

బెల్జియం గోల్‌ కీపర్‌కు ‘గోల్డెన్ గ్లోవ్’

ఉత్తమ గోల్‌ కీపర్‌గా బెల్జియం గోల్‌ కీపర్ తిబాట్ కోర్టొయిస్ నిలిచి ‘గోల్డెన్ గ్లోవ్'ని అందుకున్నాడు.

న్యాయబద్ధంగా ఆడిన జట్టుగా స్పెయిన్‌

న్యాయబద్ధంగా ఆడిన జట్టుగా స్పెయిన్‌

టోర్నీలో న్యాయబద్ధంగా ఆడిన జట్టుగా స్పెయిన్‌ ‘ఫెయిర్ ప్లే' అవార్డుని దక్కించుకుంది.

Story first published: Monday, July 16, 2018, 14:24 [IST]
Other articles published on Jul 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X