న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: రష్యా Vs స్పెయిన్ షూటౌట్, మ్యాచ్ హైలెట్స్

By Nageshwara Rao
FIFA World Cup 2018: Russia eliminate Spain from World Cup in last-16 penalty shootout
 World Cup 2018, Spain vs Russia Highlights: Russia Beat Spain 4-3 On Penalties, Qualify For Quarters

హైదరాబాద్: రష్యాలో వరల్డ్ కప్‌లో ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగిన స్పెయిన్ పేలవ ఆటతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆదివారం లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రష్యా 4-3 స్కోరు (పెనాల్టీ షూటౌట్‌)తో స్పెయిన్‌ను ఓడించింది. 78 వేల మంది ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా అద్భుత ప్రదర్శన చేసింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్‌ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఆట ఆరంభం నుంచీ ఇరు జట్లు గోల్ కోస్ తీవ్రంగా పోరాడాయి.

1
958072

ఈ క్రమంలో రష్యా ఆటగాడు ఇగ్నషెవిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేయడంతో 12వ నిమిషంలో స్పెయిన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 41వ నిమిషంలో జుబా పెనాల్టీని గోల్‌గా మలచడంతో రష్యా 1-1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది.

 World Cup 2018, Spain vs Russia Highlights: Russia Beat Spain 4-3 On Penalties, Qualify For Quarters

షూటౌట్లో స్పెయిన్‌ ఒత్తిడికి గురైంది. ఆ జట్టు ఆటగాళ్లు కొకె, అస్పాస్‌ కిక్‌లను విజయవంతంగా అడ్డుకుని గోల్‌కీపర్‌ అకిన్‌ఫీవ్‌ రష్యాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో వరుసగా ఐదో వరల్డ్‌ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే నెగ్గింది. తాజా విజయంతో రష్యా 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌ చేరింది.

మ్యాచ్ హైలెట్స్:

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తర్వాత వరల్డ్ కప్‌లో రష్యా క్వార్టర్స్‌ చేరడం ఇదే తొలిసారి. విచ్ఛిన్నానికి ముందు 1970లో రష్యా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

ప్రపంచకప్‌లో నాలుగుసార్లు షూటౌట్లు ఆడిన స్పెయిన్‌ మూడుసార్లు ఓటమి పాలైంది. 1986లో బెల్జియం, 2002లో దక్షిణ కొరియా ఆ జట్టును ఓడించాయి.

వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో సెల్ఫ్ గోల్ చేసిన అతిపెద్ద వయస్కుడిగా ఇగ్నాషెవిచ్ (38 ఏళ్ల 352 రోజులు) రికార్డులకెక్కాడు. నోయల్ వాల్డారెస్ (37 ఏళ్ల 43 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో నోయల్ ఈ రికార్డును సృష్టించాడు.

ఒకే వరల్డ్‌కప్‌లో రెండు సెల్ఫ్ గోల్స్ చేసిన రెండో జట్టుగా రష్యా నిలిచింది. అంతకుముందు బల్గేరియా 1966లో ఈ ఘనత సాధించింది.

వరల్డ్ కప్ టోర్నీలో 38 ఏళ్ల ఇగ్నాషెవిచ్ చేసిన గోల్ పదో గోల్ కావడం విశేషం. ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో అత్యధికసార్లు గోల్స్ కావడం ఇదే మొదటిసారి.

స్పెయిన్ తరఫున వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐకర్ కాసిలాస్ (17 మ్యాచ్‌లు) రికార్డును డిఫెండర్ సెర్గియో రామోస్ సమం చేశాడు.

గత నాలుగు వరల్డ్ కప్‌ల్లో స్పెయిన్ ఆతిథ్య జట్టుపై విజయం సాధించలేదు. 1934 క్వార్టర్‌ఫైనల్లో ఇటలీతో 1-1తో డ్రా చేసుకున్న స్పెయిన్ అంతకముందు జరిగిన టోర్నీలో 0-1తో ఓడింది. 1950లో ఫైనల్ రౌండ్‌లో బ్రెజిల్ చేతిలో 1-6తో ఓడింది. 2002 క్వార్టర్ ఫైనల్స్ గోల్స్ లేకుండా డ్రా అయ్యింది. ఇప్పుడు కోచ్‌గా పని చేస్తున్న హిరెరో అప్పటి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Story first published: Monday, July 2, 2018, 11:24 [IST]
Other articles published on Jul 2, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X