న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా: గ్రూప్-బి నుంచి నాకౌట్‌కు అర్హత సాధించింది ఈ రెండు జట్లే

By Nageshwara Rao
World Cup 2018: Spain scrape draw with Morocco and top Group B

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజి మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. దీంతో నాకౌట్‌ బరిలో చోటు దక్కించుకునేందుకు జట్ల మధ్య పోటీ ఎక్కువైంది. సోమవారం రాత్రి మ్యాచ్‌ ఫలితాలను బట్టి గ్రూప్‌-బి నుంచి ఏ రెండు జట్లు నాకౌట్‌కు చేరాయో స్పష్టత వచ్చింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

World Cup 2018: Spain scrape draw with Morocco and top Group B

గ్రూప్ బిలో టాప్‌లో ఉన్న స్పెయిన్, రెండో స్థానంలో ఉన్న పోర్చుగల్‌ నాకౌట్‌కు అర్హత సాధించాయి. సోమవారం మొరాకోతో జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. దీంతో స్పెయిన్ ఆ గ్రూప్ నుంచి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. తొలి సగం మ్యాచ్‌ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌ చేసి సమానంగా నిలిచాయి.

81వ నిమిషంలో మొరాకో మరో గోల్‌ చేసి 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో స్పెయిన్‌ ఆటగాడు ఇయాగో ఆస్పస్‌ (90+1 నిమిషంలో) గోల్‌ చేసి మొరాకోకు షాకిచ్చాడు. ఆ తర్వాత మిగిలిన సమయంలో ఏ జట్టు మరో గోల్‌ చేయకపోవడంతో ఈ మ్యాచ్‌ కూడా డ్రాగానే ముగిసింది.

తాజా విజయంతో పాటు అంతకముందు రెండు డ్రాలతో గ్రూప్‌ బిలో టాపర్‌గా ఉన్న స్పెయిన్‌ నాకౌట్‌లోకి ఆడుగుపెట్టింది. స్పెయిన్ తన నాకౌట్ మ్యాచ్‌ను ఆతిథ్య రష్యాతో ఆడనుంది. మరోవైపు టోర్నీలో భాగంగా ఇరాన్‌-పోర్చుగల్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది.

ఇరాన్‌-పోర్చుగల్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్ ఆఖర్లో అద్భుత ప్రదర్శన చేసింది. తొలి అర్ధ భాగంలోనే పోర్చుగల్‌ స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా తొలి గోల్‌(44వ నిమిషంలో) నమోదు చేసి ఆధిక్యాన్ని అందించాడు.

ఆటలో భాగంగా పోర్చుగల్‌ 14సార్లు గోల్‌ కోసం ప్రయత్నించగా, ఇరాన్‌ ఎనిమిది సార్లు ప్రయత్నించింది. అయితే, ఇంజూరీ సమయంలో ఇరాన్‌ ఆటగాడు కరీమ్‌ అన్సారీఫార్డ్‌ గోల్‌ చేయడంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో పోర్చుగల్‌ గ్రూప్‌-బి నుంచి నాకౌట్‌కు అర్హత సాధించగలిగింది.

ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఓడిపోయి ఉంటే గ్రూప్‌ దశలోనే నిష్క్రమించేది. మరోవైపు, నాకౌట్‌కు చేరడం పోర్చుగల్‌కు ఇది నాలుగోసారి. ఐదు ప్రపంచకప్‌లు ఆడిన ఇరాన్‌ ప్రతి టోర్నీలోనూ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం విశేషం.

Story first published: Tuesday, June 26, 2018, 11:55 [IST]
Other articles published on Jun 26, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X