న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

జట్టు నాకౌట్ చేరలేదని.. ఫుట్ బాల్‌కే వీడ్కోలు

World Cup 2018: Sardar Azmoun retires from playing for Iran at 23

హైదరాబాద్: ఆఖరి ప్రపంచ‌కప్‌లో మెస్సీ.. అర్జెంటీనాను ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. అక్కడ ప్రత్యర్థితో గెలవలేకపోవడంతో ఖాళీ చేతుల్తో తిరిగి రావలసి వచ్చింది. ఆ నిరుత్సాహంతో మెస్సీ ఫుట్‌బాల్‌కు చెప్తున్నానంటూ.. ప్రకటించాడు. మళ్లీ నిర్ణయం వెనక్కి తీసుకుని వచ్చాడు. కానీ, ఆటగాళ్లు దాదాపు అలాంటి ఎమోషన్‌తోనే కనిపిస్తారు. తాజాగా ఇరాన్‌కు చెందిన సర్దార్ తన విరమణను ఇలా ప్రకటించాడు. ఒకవైపు ఈ ప్రపంచకప్ కారణంగానే 37ఏళ్ల తర్వాత అక్కడి మహిళలు నేరుగా స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లు చూసేలా ఇరాన్‌ ప్రభుత్వం నిబంధనలను సడలించింది.

మహిళలు నేరుగా స్టేడియాలలో మ్యాచ్‌లు చూసేలా

మహిళలు నేరుగా స్టేడియాలలో మ్యాచ్‌లు చూసేలా

ఇరాన్‌ జట్టు అప్పుడే వెనుదిరగడంతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఐదోసారి ప్రపంచకప్‌ ఆడుతున్న తమ జట్టు కనీసం నాకౌట్‌కు కూడా అర్హత సాధించలేకపోవడం అక్కడి అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఆటగాళ్ల వైఫల్యంతోనే జట్టు ఓడిపోయిందంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.

 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి వైదొలగుతున్నట్లు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి వైదొలగుతున్నట్లు

దీంతో కలత చెందిన ఆ జట్టు కీలక ఆటగాడు సర్దార్‌ అజ్‌మౌన్‌(23) తాజాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా అజ్‌మౌన్‌ మాట్లాడుతూ..‘ఓ ఆటగాడిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణంగా భావించాను. కానీ దురదృష్టవశాత్తు జాతీయ జట్టుకు వీడ్కోలు పలకాలని నేను అనుకుంటున్నా. 23ఏళ్ల వయస్సులోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరమైన విషయమే. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో తప్పక వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు' అతను తెలిపాడు

ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు ఇరాన్‌

ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు ఇరాన్‌

ఫిఫా దశలో గ్రూప్‌ దశలో మ్యాచ్‌లన్నీ దాదాపు ముగింపు చేరుకున్నాయి. ప్రస్తుతానికి గ్రూప్‌-జి, హెచ్‌ మినహా మిగతా గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. అయితే ఆసియా నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు ఇరాన్‌ ఒక విజయం, ఒక డ్రాతో గ్రూప్‌-బిలో మూడో స్థానంతో సరిపెట్టుకొని వరల్డ్‌కప్‌నుంచి నిష్క్రమించింది.

ఇరాన్‌ గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి

ఇరాన్‌ గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి

మొరాకోతో జరిగిన మొదటి మ్యాచ్‌లో అనూహ్య విజయంతో(మొరాకో ఆటగాడి సెల్ఫ్‌గోల్‌) గట్టెక్కిన ఇరాన్‌.. ఆ తర్వాత స్పెయిన్‌తో మ్యాచ్‌లో ఓడిపోయి, పోర్చుగల్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మొత్తంగా నాలుగు పాయింట్లకే పరిమితం కావడంతో ఇరాన్‌ గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.

Story first published: Thursday, June 28, 2018, 20:49 [IST]
Other articles published on Jun 28, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X