న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రిఫరీ నిర్ణయంపై వ్యాఖ్యలు: ఫిఫాకు క్షమాపణ చెప్పిన మారడోనా

By Nageshwara Rao
World Cup 2018: Diego Maradona Apologises Over Colombia-England Referee Slur

హైదరాబాద్: అర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజం ఫిఫాకు క్షమాపణలు చెప్పాడు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌-కొలంబియా జట్ల మధ్య జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఫిఫాకు, ఆ గవర్నింగ్‌ బాడీ అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినోకు క్షమాపణలు తెలియజేశాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మంగళవారం రాత్రి కొలంబియా-ఇంగ్లాండ్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-3తేడాతో కొలంబియాపై విజయం సాధించి క్వార‍్టర్‌కు చేరింది. కొలంబియా జట్టులో రడమెల్‌ ఫల్‌కావో, జుయాన్‌ క్యుడ్రాడో, లూయిస్‌ మూరియల్‌ మూడు గోల్స్ చేయగా... ఇంగ్లాండ్‌ జట్టులో హ్యారీ కేన్‌, మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌, కీరన్‌ ట్రిప్పియర్‌ నాలుగు గోల్స్‌ కొట్టారు.

కొలంబియా ఆటగాడు కార్లోస్‌ బెకా నాలుగో గోల్‌ చేయడంలో విఫలమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ ఆటగాడు ఎరిక్‌ నాలుగో గోల్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. అయితే, పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించే క్రమంలో రిఫరీ ఏకపక్షంగా వ్యవహరించాడంటూ మారడోనా ధ్వజమెత్తాడు.

తాజాగా, దీనిపై మారడోనా క్షమాపణలు తెలియజేశాడు. "ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫరీ నిర‍్ణయాన్ని తప్పుపట్టడం సరికాదు. కొన్ని సందర్బాల్లో రిఫరీ నిర్ణయాలతో నా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారి నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నాడు.

"రిఫరీని విమర్శించినందుకు నన్ను క్షమించండి. ఫిఫా వరల్డ్‌ కప్‌లో రిఫరీ బాధ్యతల్ని నిర్వహించడం చాలా కష్టంతో కూడున్నది. వారి శ్రమ నాకు తెలుసు. నేను మాట తూలడం తప్పే. ఇందుకు ఫిఫాకు, అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినోకు క్షమాపణలు తెలియజేస్తున్నా" అని మారడోనా తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేశాడు.

Story first published: Friday, July 6, 2018, 13:35 [IST]
Other articles published on Jul 6, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X