న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కెరీర్‌లో 85వది: సూపర్ ఫామ్‌లో రొనాల్డో, మొరాకో మ్యాచ్‌లో రికార్డు

By Nageshwara Rao
World Cup 2018: Cristiano Ronaldo happy with 4th goal in Russia

హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా గ్రూప్ బీలో బుధవారం పోర్చుగల్-మొరాకో జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రొనాల్డో కొట్టిన గోల్‌తో పోర్చుగల్ జట్టు మొరాకోపై 1-0తేడాతో విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఐరోపా ఆటగాడిగా రొనాల్డో ఘనత సాధించాడు. మొరాకోపై సాధించిన గోల్‌ కెరీర్‌లో అతడికి 85వది. తద్వారా ప్రపంచంలో అత్యధిక గోల్స్ చేసిన రెండో పుట్‌బాలర్‌గా క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. యూరోప్ లీగ్స్‌లో అత్యధిక గోల్స్‌ (78) చేసిన మొదటి ఫుట్‌బాలర్ కూడా అరుదైన ఘతన సాధించాడు.

రెండో ఆటగాడిగా రొనాల్డో అరుదైన ఘనత

రెండో ఆటగాడిగా రొనాల్డో అరుదైన ఘనత

కాగా, ప్రపంచంలో అత్యధిక గోల్స్ చేసిన వారి జాబితాలో ఇరాన్‌ దిగ్గజం అలీ దెయి (109 గోల్స్‌) మాత్రమే రొనాల్డో కన్నా ముందున్నాడు. కాగా, రష్యా వేదికగా జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డో ఇప్పటివరకు నాలుగు గోల్స్ కొట్టాడు. తాజా విజయంతో పోర్చుగల్ జట్టు 4 పాయింట్లతో గ్రూప్‌-బిలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

1998 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత

1998 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత

మరోవైపు 1998 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన మొరాకో.. వరుసగా రెండో ఓటమితో నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం రొనాల్డో మాట్లాడుతూ "గోల్ చేసినందుకు సంతోషంగా ఉంది. అన్నిటి కంటే ఎక్కువ సంతోషాన్ని కలిగించే అంశం ఈ మ్యాచ్‌లో మేం విజయం సాధించాం" అని అన్నాడు.

తొలి నాలుగు షాట్లలోనే మూడు గోల్స్

తొలి నాలుగు షాట్లలోనే మూడు గోల్స్

రాబోయే మ్యాచ్‌ల్లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తామని రొనాల్డో చెప్పుకొచ్చాడు. గత వరల్డ్ కప్‌ల్లో (2006, 2010 and 2014) రొనాల్డో ఆటతీరుని ఒక్కసారి పరిశీలిస్తే 70 షాట్లలో మూడు గోల్స్ చేయగా, రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మాత్రం తొలి నాలుగు షాట్లలోనే మూడు గోల్స్ నమోదు చేశాడు.

మ్యాచ్‌లో నాలుగో నిమిషంలోనే గోల్‌

మ్యాచ్‌లో నాలుగో నిమిషంలోనే గోల్‌

ఈ వరల్డ్ కప్‌లో రొనాల్డో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో నాలుగో నిమిషంలోనే గోల్‌ కోట్టి పోర్చుగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట ప్రారంభంలోనే మొరాకో ఫార్వర్డ్ శ్రేణి కాస్త దూకుడుగా పోర్చుగల్ గోల్‌పోస్టుపై దాడికి దిగింది. మూడో నిమిషంలో పోర్చుగల్ ఎదురుదాడి ప్రారంభించింది.

హెడ్డర్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపిన రొనాల్డో

హెడ్డర్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపిన రొనాల్డో

పోర్చుగల్ మిడ్‌ఫీల్డర్ బెర్నోర్డో సిల్వా కొట్టిన క్రాస్ షాట్‌ను మొరాకో డిఫెండర్లు అడ్డుకుని ఎలాంటి నష్టం లేకుండా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంతోషం వారికి నిమిషమన్నా నిలువలేదు. నాలుగోనిమిషంలో కుడివైపు కార్నర్ నుంచి వచ్చిన క్రాస్‌ను స్టార్ ప్లేయర్ రొనాల్డో హెడ్డర్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. దీంతో పోర్చుగల్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది..

Story first published: Thursday, June 21, 2018, 11:51 [IST]
Other articles published on Jun 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X