సులేమానీ మృతి ఎఫెక్ట్: ఖతార్ ట్రైనింగ్ క్యాంప్‌ని రద్దు చేసుకున్న యుఎస్ పుట్‌బాల్ టీమ్

హైదరాబాద్: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా యునైటెడ్ స్టేట్స్ పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఖతార్‌లో హాజరు కావాల్సిన ట్రైనింగ్ క్యాంప్‌ని రద్దు చేసుకుంది. జనవరి 5 నుండి 25 మంది ఆటగాళ్లతో దోహాలోని ఆస్పైర్ అకాడమీలో ప్రారంభం కానున్న 20 రోజుల ట్రైనింగ్ క్యాంప్‌ని రద్దు చేసుకుంటున్నట్లు యుఎస్ కోచ్ గ్రెగ్ బెర్హాల్టర్ తెలిపారు.

ఈ మేరకు యుఎస్ సాకర్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. శుక్రవారం ఉదయం బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌కు కమాండర్‌గా ఉన్న జనరల్‌ ఖాసిం సులేమానీ (62)తో పాటు ఇరాన్‌ మద్దతున్న ఇరాక్‌ పారామిలటరీ దళం 'హషీద్‌ అల్‌ షాబీ'కి చెందిన అధికారులు చనిపోయారు.

ఈ ఘటన మిడిల్ ఈస్ట్‌లో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే, విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ పేర్కొనడం విశేషం. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పౌరులపై ఏమైనా దాడులు జరగొచ్చనే ఉద్దేశ్యంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

దీంతో యుఎస్ సాకర్ ఫెడరేషన్ తన ట్విట్టర్‌లో "మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న రాజీకయ పరిస్థితుల కారణంగా పురుషుల జాతీయ జట్టు ట్రైనింగ్ క్యాంప్‌ కోసం జనవరి ఖతార్ ప్రయాణాన్ని వాయిదా వేయాలని యుఎస్ సాకర్ నిర్ణయించింది. కాలిఫోర్నియాలోని డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్కులో ఫిబ్రవరి 1న కోస్టారికాతో మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం" అని పోస్టు చేసింది.

దీంతో పాటు ఖతార్ యొక్క ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు యుఎస్ సాకర్ బృందం త్వరలో మరో అవకాశాన్ని కనుగొంటామని, ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో మేము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2022లో జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌కు ఖతార్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

మిడిల్ ఈస్ట్‌లో ఓ దేశం ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సెప్టెంబరులో యుఎస్ తన క్వాలిఫైయింగ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. అయితే, క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో యుఎస్ విఫలం కావడంతో ఖతార్ 2022 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Saturday, January 4, 2020, 13:11 [IST]
Other articles published on Jan 4, 2020
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X