న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

216 మిలియన్ వీక్షకులు: ఐఎస్ఎల్‌కు పెరిగిన ఆదరణ

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్‌లో క్రమంగా ఫుట్‌బాల్ క్రీడ పట్ల ఆదరణ పెరుగుతోంది. 2015 ఎడిషన్‌తో పోలిస్తే 2016లో ఐఎస్ఎల్ టోర్నీ మ్యాచ్ లను వీక్షించేందుకు స్టేడియంలకు వచ్చిన అభిమానుల సంఖ్య, టివి చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షిస్తున్న వారి సంఖ్య సుమారు 90 లక్షలకు పై చిలుకు పెరిగింది. టైటిల్ కోసం జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 4.1 కోట్ల మంది వీక్షించారు.మూడో ఎడిషన్ ఐఎస్ఎల్ టోర్నీని మొత్తం 21.60 కోట్ల మంది వీక్షించారు.

2015లో 20.70 కోట్ల మంది మాత్రమే వీక్షించారు. అనూహ్య రీతిలో వీక్షకుల సంఖ్య పెరగడంతో ఐఎస్ఎల్ నిర్వాహకులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఏడాది కాలంలోనే గ్రామీణ వీక్షకుల సంఖ్య పెరగడం ఆసక్తికర పరిణామం. మ్యాచ్‌లను వీక్షించిన వారి సంఖ్య సగటున 1.01 కోట్లకు చేరుకున్నది. తద్వారా క్రీడ పట్ల విస్రుతస్థాయి ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని అనడానికి సంకేతమని ఐఎస్ఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

2016 సీజన్‌లో ముంబై, చెన్నై వంటి కీలక మెట్రో మార్కెట పరిధిలో వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 50 శాతానికి పైగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే తమిళనాట 20 శాతం వీక్షకులు పెరిగారు. ఫుట్ బాల్ ఆటకు సంప్రదాయ కేంద్రాల కంటే మిగతా ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతున్నదనడానికి ఈ గణాంకాలే నిదర్శమని నిర్వాహకుల మాట.

41 శాతం పెరిగిన వీక్షకులు

41 శాతం పెరిగిన వీక్షకులు

కేరళలోని కోచి స్టేడియంలో డిసెంబర్ 18న అట్లెటికో డి కోల్ కతా, కేరళ బ్లాక్ బస్టర్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరును వీక్షించేందుకు వచ్చిన అభిమానులు 54 వేల మందికి పైగా ఉంటే దేశ వ్యాప్తంగా 4.1 కోట్ల మంది టివి చానెళ్లు, ఇతర డిజిటల్ మీడియా ద్వారా వీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే చానెళ్లు, డిజిటల్ మీడియాలో ఫుట్ బాల్ ఫైనల్స్ ను వీక్షించిన వారి సంఖ్య 41 శాతం పెరిగింది.

నీతా అంబానీ మాట్లాడుతూ

నీతా అంబానీ మాట్లాడుతూ

ఫుట్ బాల్ స్పోర్ట్ డెవలప్ మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఫుట్ బాల్ ఆటకు క్రమంగా ప్రజాదరణ పెరుగుతుందని ఇప్పటికీ ఆశాభావంతోనే ఉన్నారు. ఐఎస్ఎల్ విజన్ పట్ల ప్రజలు అనుబంధం పెంచుకుంటున్నారని ఆమె గుర్తుచేశారు. ‘మనకూ ఒక ఫుట్ బాల్ లీగ్ ఉన్నదన్న విజన్ ప్రతి ఒక్కరిలోనూ డెవలప్ అవుతున్నది. ఇది అభిమానులు, ప్రజల్లో పెరుగుతున్న అభిమానం, ఆదరణకు గొప్ప నిదర్శనం. భారతీయ ఫుట్ బాల్ పట్ల విశ్వాసం, ప్రయాణం సరైన దిశలోనే కొనసాగుతున్నది' అని ఆమె వ్యాఖ్యానించారు.

రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ

రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ

తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మార్కెట్ తోపాటు ఆదరణ రోజురోజుకు ఇనుమడిస్తోందన్నారు. ఇప్పటికే ఫుట్ బాల్ తో అనుబంధం ఉన్న కేరళ, పశ్ిచమబెంగాల్ రాష్ట్రాల్లో ఐఎస్ఎల్ పట్ల మరింత అభిమానం పెరుగుతున్నదని నీతా అంబానీ చెప్పారు. పెరుగుతున్న ఆదరణ అంతా స్టేడియంకు వచ్చే అభిమానులు, టీవీ వీక్షకులతోనే పెరిగిపోతుందన్నారు. ఆదరణ, వీక్షకుల పెరుగుదలతో భవిష్యత్ లో భారత్ నిర్దేశిత ఫుట్‌బాల్ ర్యాంక్‌కు చేరుకోగలమని, కొత్త లక్ష్యాల నిర్దేశానికి మార్గం సుగమం అవుతుందన్నారు.

2016 ఎడిషన్‌లో వీక్షకుల సంఖ్య 25 శాతానికి

2016 ఎడిషన్‌లో వీక్షకుల సంఖ్య 25 శాతానికి

సగటున 2015తో పోలిస్తే 2016 ఎడిషన్ ఐఎస్ఎల్ టోర్నీలో వీక్షకుల సంఖ్య 25 శాతానికి పైగా పెరిగింది. ఆటలో పెరుగుతున్న నైపుణ్యాన్ని గమనిస్తున్న అభిమానులు కొత్త నిర్వచనాలిస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఐఎస్ఎల్ పట్ల ప్రజల్లో ఆదరణ పెంపొందిస్తున్నదీ ఈ ఐఎస్ఎల్. సరిహద్దులకు అతీతంగా అభిమానులకు సంపాదించుకుంటున్నదీ టోర్నీ. అంతేకాదు వైవిధ్య భరితమైన ఫ్యాన్స్‌ని కూడగట్టుకుంటున్నది.

గతేదాడితో పోలిస్తే 2.3 రెట్లు పెరిగింది

గతేదాడితో పోలిస్తే 2.3 రెట్లు పెరిగింది

డిజిటల్ మీడియా ద్వారా ఐఎస్ఎల్ టోర్నీని వీక్షించిన వారి సంఖ్య 2016 ఎడిషన్ లో భారీస్థాయిలో పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 2.3 రెట్లు పెరిగింది. హాట్ స్టార్ నుంచి జియో ఫ్లాట్ ఫాం వరకు ప్రతి వేదికపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ఐఎస్ఎల్ టోర్నీలను వీక్షించేందుకు అన్ని క్లబ్ ల పరిధిలోని స్టేడియంలకు అభిమానుల సైన్యం, ఫుట్ బాల్ ఆట పట్ల ఆసక్తి పరులైన వారి సంఖ్య సగటున 84 శాతం పెరిగింది. గత మూడు ఎడిషన్లలో ఇదే అత్యధికం.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X