ఫుట్‌బాల్‌లో కొత్త రూల్, తలకు తగిలిందా.. అంతే ఇక..!

Posted By:
 The NFLs New Targeting Rule Will Save Football

హైదరాబాద్: అమెరికాలోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ నిర్వహకులు సరికొత్త నియమానికి తెరలేపారు. అంతర్జాతీయ జట్లలో సాధారణంగా మనం హెల్మెట్ లేకుండా ఆడే ఆటగాళ్లను చూస్తాం. కానీ, కొన్ని గేమ్‌లలో ఆటగాళ్లు హెల్మెట్‌లతో దర్శనమిస్తుంటారు. ఇప్పుడు తెచ్చిన కొత్త ప్రతిపాదన కూడా వారికి సంబంధించినదే. ఇప్పటివరకు తలవంచుకుని బంతిని చూసుకుంటూ పరిగెత్తే ఆటగాళ్లకు ఇకమీదట పద్ధతి మార్చుకోవాల్సిందే.

ఒకరినొకరు గుద్దుకోవడం:

ఒకరినొకరు గుద్దుకోవడం:

హెల్మెట్లతో.. పరిగెత్తుతూ గోల్ చేసే క్రమంలో ఒకరినొకరు గుద్దుకోవడం తద్వారా గాయాలపాలవడంతో నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ నిర్వహకులు కొత్త నిర్ణయానికి తెరలేపారు. ఇకమీదట ఏ సందర్భంలోనైనా ప్రత్యర్థి జట్టు ఆటగాడి హెల్మెట్‌కి తగలడానికి వీల్లేదు. ఒకవేళ అలా తగిలిందా.. దానిని ఫౌల్ కింద భావిస్తారు. ఇక తర్వాత ఆ ఆటగాడిపై నియమాలననుసరించి చర్యలు తీసుకుంటారు.

చెప్పుకోదగ్గ కొత్త మార్పు:

చెప్పుకోదగ్గ కొత్త మార్పు:

కొన్ని సందర్భాల్లో అతనిని జట్టు నుంచి తీసేసే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ కమిటీ సీఈవో రిచ్ మెక్ కే మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్లు భద్రంగా ఉంటారు. ఇది 'చెప్పుకోదగ్గ కొత్త మార్పు'. నా కళ్లతో చూశాను. చాలా మంది ఆటగాళ్లు తమ ఇతరుల హెల్మెట్ కారణంగా తలకు గాయాలపాలైయ్యేవారు. అని పేర్కొన్నాడు.

 మ్యాచ్ నుంచి పంపేయడం:

మ్యాచ్ నుంచి పంపేయడం:

కాలేజ్ ఫుట్‌బాల్‌లో సైతం అదే నియమాలను అనుసరించనున్నారు. ఎవరి హెల్మెట్ అయితే వేరొకరి హెల్మెట్ కి తగులుతుందో వారిని ఫౌల్‌గా పరిగణించి మ్యాచ్ నుంచి పంపేయడం, ఇక మిగిలిన జట్టును మైదానంలో ఒక 15యార్డుల దూరం వరకు వెనక్కి జరగమనడం వంటివి చేయనున్నారు. నేషనల్ ఫుట్‌బాల్‌లో ఇంతకుముందు చాలామంది తలలకు గాయాలయ్యేవి. ఇప్పుడు తీసుకురానున్న కొత్త పద్థతి ద్వారా ఇంకొంతమంది ఈ విషయంలో భయం వదిలి ఆటవైపు మొగ్గు చూపుతారనే ఆశను వ్యక్తం చేస్తున్నారు.

 రక్తం కారుతున్నా.. చూసి ఆనందం:

రక్తం కారుతున్నా.. చూసి ఆనందం:

ఈ నియమాన్ని ఎందుకిష్టపడాలంటే బాక్సింగ్‌లో ప్రత్యర్థిని చిత్తు చేస్తుంటే రక్తం కారుతున్నా.. చూసి ఆనందించే హింసాత్మక ధోరణి ఉన్న వాళ్లకు ఈ పద్ధతి నచ్చకపోవచ్చు. అలా కాకుండా ఫుట్‌బాల్ మీద ఏ మాత్రమైనా ఆసక్తి ఉన్న వాళ్లు దీన్ని అమితంగా ఇష్టపడతారు. గేమ్‌ను భద్రంగా, జాగ్రత్తగా ఆడాలనే లక్ష్యంతోనే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Story first published: Monday, April 2, 2018, 16:13 [IST]
Other articles published on Apr 2, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి