న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చిట్టి కూనలూ ఫైనల్‌కు చేరాయ్.. బెబ్బులి బరిలోకి దిగేదెప్పుడో..??

The Daily Fix: If tiny Croatia can be a football superpower, why not India?

హైదరాబాద్: 130 కోట్లకు పైగా జనాభా.. అంతకుమించిన క్రీడా ప్రతిభ.. కానీ ఏం లాభం లేదు. ఫుట్‌బాల్‌కు కొన్నేళ్లుగా ఆదరణ లోపించి కనిపిస్తూ.. కనుమరుగైపోతూ ఉన్నాననిపిస్తోంది. నలభై లక్షల జనాభా కలిగి, అందులోనూ 1991లో స్వాతంత్య్రం సాధించిన క్రొయేషియా దేశం కూడా మొట్ట మొదటిసారి వరల్డ్‌కప్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం 34 లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే, నాలుగు లక్షల లోపు జనాభా కలిగిన ఐస్‌లాండ్‌ క్రీడాకారులతో పోటాపోటీగా రాణించి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకోవడం క్రొయేషియా క్రీడాకారులకే దక్కిన అరుదైన గౌరవం.

ఇంతటి చిన్న దేశాలు అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటున్నప్పుడు ఫుట్‌బాల్‌ క్రీడారంగంలో మనం ఎందుకు రాణించలేక‌పోతున్నామని ప్రశ్న తలెత్తక మానదు. 'భారత్‌ నిద్రపోతున్న దిగ్గజం' అని 2012లో జరిగిన సాకర్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్‌ బ్లాటర్‌ వ్యాఖ్యానించారు.

మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది

మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది

‘భారత్‌లో 130 కోట్లకు పైగా జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్‌బాల్‌ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్‌ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్‌ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్‌లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్‌ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది' అని బ్లాటర్‌ వ్యాఖ్యానించారు.

నిద్రపోతున్న దిగ్గజం' కదలిక లేదు

నిద్రపోతున్న దిగ్గజం' కదలిక లేదు

ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం' ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్‌బాల్‌లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్‌కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్‌ వరల్డ్‌కప్‌ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్‌ ప్రస్తావన వస్తోంది.

 బలమైన పునాదులు లేకుండా భవంతులు నిర్మించలేం

బలమైన పునాదులు లేకుండా భవంతులు నిర్మించలేం

2017, అక్టోబర్‌ నెలలో అండర్‌-17 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ను భారత్‌ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్‌ వచ్చిందీ వెళ్లింది. భారత్‌ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్‌బాల్‌లో రాణించలేం.

 భారత్‌ ఇప్పటికీ వెనకబడే ఉంది

భారత్‌ ఇప్పటికీ వెనకబడే ఉంది

అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్‌ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్‌లో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ఉంది. క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది.

Story first published: Friday, July 13, 2018, 17:41 [IST]
Other articles published on Jul 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X