పాత మిత్రులు చేరువవనున్నారా..? మెస్సీ జట్టు మారే ప్రయత్నం?

Posted By:
Surely not Messi to PSG? Neymar teases big announcement

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా నేమార్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. బార్సిలోనా జట్టు మాజీ ఆటగాడైన మెస్సీని ఉద్దేశించి నేమార్ పోస్టు చేసిన ట్వీట్ అది. గతేడాది ఆగష్టులో జరిగిన క్యాంపులో పారిస్ సెయింట్ జర్మన్ స్టార్ నేమార్ ప్రమాదానికి గురైయ్యాడు. బ్రెజిల్‌లో జరగబోయే ప్రపంచ కప్‌కు కోలుకుంటున్న నేమార్ ట్విట్టర్ వేదికగా చర్చను లేవదీశాడు.

ఆ ట్వీట్‌లో మెస్సీ, నేమార్ కలిసుండగా, కింద నేను, నా స్నేహితుడు మెస్సీ కలిస్తే చాలా అద్భుతాలు సృష్టించగలం. మరి కొద్ది కాలం వేడి ఉండండి. కొత్త విషయం తెలియబోతుంది' అంటూ పేర్కొన్నాడు. ఈ సందేశం వెనుక ఉన్న పరమార్థం తెలియక నెటిజన్లు వారంతట వారే ఊహాగానాలతో చర్చలు మొదలెట్టేశారు. ఎంతంటే ఆ ట్వీట్‌కు 12 గంటల సమయంలోనే 14వేల స్పందించారు.

ఒకవేళ నేమార్ పారిస్ జెయింట్ జట్టులోకి చేరనున్నాడా.. లేదా మెస్సీ జట్టును వీడనున్నాడా. అనేది సందిగ్ధం. పారిస్ జెయింట్ జట్టు నేమార్ తీసుకుంటుందా అని ఆలోచిస్తే .. ఇప్పటికే ఆ జట్టు నేమార్, కైలియన్, ఎడిన్‌సన్ కవనీలతో దృడంగా ఉంది. మరి అలా అనుకుంటే మెస్సీని ఫ్రెంచ్ జట్టు తీసుకుంటే మాత్రం నేమార్ జట్టుకు లాభమే.

ఐదు సార్లు బాలోన్ డీ ఆర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ బార్కా జట్టును 3-1 స్కోరుతో లెగాన్స్ జట్టుపై గెలిపించాడు. ఈ లీగ్ కు సంబంధించి ఇది అతనికి హ్యట్రిక్ విజయమనే చెప్పాలి. సీజన్ మొత్తంలో అతని వ్యక్తిగత స్కోరు 39.

Story first published: Monday, April 9, 2018, 17:56 [IST]
Other articles published on Apr 9, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి