న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టాప్ ఫోర్‌లో చోటు: చెన్నైదాటిన ఢిల్లీ ఎక్స్‌ప్రెస్

By Nageshwara Rao

ఫాటోర్డా: ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లు.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌ను దాటేశారు. ఆదివారం రాత్రి గోవా నడిబొడ్డున జరిగిన మ్యాచ్‌లో కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో గోల్స్ చేసి ఎఫ్ సి గోవా జట్టుపై 2 - 0 స్కోర్ తేడాతో ఘన విజయం సాధించారు. టాప్ ఫోర్‌లో చోటు దక్కించుకున్నారు.

18 వేల మందికి పైగా అభిమానుల మద్దతు మధ్య జరిగిన మ్యాచ్ సెకండాఫ్‌లో మార్సిలిన్హో రంగ ప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 72వ నిమిషంలో మార్సిలిన్హో, 76వ నిమిషంలో రిచర్డ్ గాడ్జె చేసిన గోల్స్‌తో జట్టు విజయం ఖరారైంది. ఢిల్లీ జట్టు విజయంతో కోచ్ జంబ్రోట్టా ఉపశమనం పొందినట్లు కనిపిస్తే.. గోవా కోచ్ జికో మాత్రం ఇప్పటికి సెమీస్ బెర్త్‌పై ఆశలొదులుకోలేదని వ్యాఖ్యానించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిమ్యాచ్ ప్రారంభం నుంచే గోవా జట్టు నిర్విరామంగా గోల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఐదో నిమిషంలో రాఫెల్ కొహెల్హో గోల్‌పోస్ట్‌కు పంపిన బంతిని టోనీ డొబ్లాస్ అడ్డుకున్నాడు. అనాస్ ఎడాథోడికా హీరోయిక్‌గా హెడ్డర్ ద్వారా పంపిన బంతి కార్నర్ లైన్ వద్ద దారి మళ్లింది.

కొయెల్హో పంపిన పాస్‌ను లక్కీగా అందుకున్న జులియో సీజర్ కొట్టిన బంతి వైడ్‌గా మారిపోయింది. తిరిగి 26వ నిమిషంలో మందార్ రావు దేశాయ్ దూరం నుంచి పంపిన బంతి పోస్ట్ వద్ద పెయింటాఫ్ అయింది. రోమియో ఫెర్నాండెజ్ ఫస్టాఫ్ ముగియడానికి ముందు పంపిన బంతి గోల్‌పోస్ట్‌కు చేరుకోకపోవడంతో గోవా చివరి ప్రయత్నం ఫలించలేదు.

29వ నిమిషంలో ఢిల్లీ కుర్రాడు గాడ్జె మూడుసార్లు గోల్‌పోస్ట్‌కు పంపిన బంతిని గోవా గోల్ కీపర్ సుభాషియ్ రాయ్ చౌదరి సురక్షితంగా అడ్డుకున్నాడు. అంతకుముందు గాడ్జె కొట్టిన రెండు షాట్లను గోవా డిఫెన్స్ అడ్డుకున్నది. మ్యాచ్ ఫస్టాఫ్ ముగిసే సరికి రెండు జట్లు గోల్ చేయకపోవడంతో స్కోర్ 0 - 0 గానే మిగిలింది.

Super-sub Marcelinho inspires Delhi to a 2-0 win over Goa

సెకండాఫ్ అంతా నెమ్మదిగా సాగింది. ఢిల్లీ కుర్రాడు బ్రూనో పెలిస్సారి 56వ నిమిషంలో పంపిన బంతిని సుభాషియ్ రాయ్ చౌదరి దిగ్విజయంగా అడ్డుకున్నాడు. రెండు నిమిషాల తర్వాత సీజర్ ప్లిక్ చేసిన బంతిని దేశాయ్ గోల్ పోస్ట్ కు పంపినా... అది నేరుగా పోస్ట్ వెనుక చేరిపోయింది.

సెకండాఫ్ ప్రారంభం వరకు బెంచ్‌కు పరిమితమైన ఢిల్లీ కుర్రాడు మార్సిలిన్హో వచ్చీ రావడంతోనే చెలరేగిపోయాడు. గోల్స్ కోసం వెంటవెంటనే రెండు క్విక్ ప్రయత్నాలుచేశాడు. 66వ నిమిషంలో సొబ్రొసా కొట్టిన కిక్‌ను డోబ్లాస్ బార్ వద్ద అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆరు నిమిషాలకు మార్సిలిన్హో కొంత తెలివి ప్రదర్శించి సుదూరం నుంచి పంపిన బంతి నేరుగా గోల్ పోస్ట్‌కు చేరుకోవడంతో బ్రేక్‌పాయింట్ లభించింది.

ఢిల్లీ డైనమాస్ 1 - 0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో నాలుగు నిమిషాల తర్వాత హెడ్డర్ ద్వారా మార్సిలిన్హో పంపిన బంతి ఫ్లోరెంట్ మాలౌడా క్రాస్ చేయడంతో గోల్ పోస్ట్ సమీపంలో ఉన్న గాడ్జె దరికి చేరింది. ఈ దఫా ఘనియన్ స్ట్రయికర్ మరో పొరపాటు చేయకుండా జాగ్రత్తగా బాటం కార్నర్ ద్వారా గోల్ పోస్ట్‌కు పంపడంతో ఢిల్లీ 2 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది. చివరి పది నిమిషాల్లో గోల్స్ కోసం గోవా చేసే ప్రయత్నాలన్నీ తిప్పి కొట్టారు ఢిల్లీ డైనమోస్.

కేరళ, చెన్నై మధ్య మ్యాచ్ డ్రా
కేరళ బ్లాక్ బస్టర్స్, డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ మధ్య శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా అయింది. మరోమారు చెన్నైయిన్ ఎఫ్ సి, కేరళ బ్లాక్ బస్టర్స్ జట్లకు ఉన్న గుర్తింపుకు అనుగుణంగా ఆ యా జట్ల కుర్రాళ్లు ఆడటంలో విఫలమయ్యారు. ఇరు జట్లు తమకు లభించిన అవకాశాలు సద్వినియోగంచేసుకోలేక విఫలమయ్యాయి. డిఫెన్స్‌ను అధిగమించి ముందుకెళ్లలేక చతికిల పడ్డాయి.

చెన్నై కుర్రాడు రాఫెల్ అగస్టోకు రెండుసార్లు గుండెకాయ లాంటి అవకాశాలు లభించాయి. మరోవైపు కేరళ సారధి అరోన్ హుగెస్ సైతం రెండుసార్లు జట్టుకు కాపాడుకొనేందుకు ప్రయత్నించాడు. ఎలీ సాబియా పంపిన హెడ్డర్‌ను బల్జిత్ సాహ్నీ కార్నర్ లో అడ్డుకున్నాడు. 27వ నిమిషంలో చెన్నైయిన్ కుర్రాళ్లు మూడు కార్నర్ పాయింట్లు వచ్చినా గోల్స్ గా మార్చుకోలేకపోయారు.

అయితే గోవా ప్లేయర్ హాన్స్ ముల్లర్ గాయపడటంతో మాన్నౌలే బ్లాసిని రీ ప్లేస్ చేయడం పెద్ద ఎదురుదెబ్బే. ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ ప్లేయర్లు మిఖైల్ చోప్రా, మహ్మద్ రఫీలకు పలు చాన్స్‌లు వచ్చినా ఉపయోగించుకోలేదు. రఫీ పంపిన బంతి కరంజిత్ సింగ్ చేతుల్లోకి వెళ్లింది.

సెకండాఫ్ లో చెన్నై కుర్రాడు సుక్కీ మరోసారి ఆఫ్ సైడ్ నుంచి గోల్ పోస్ట్‌కు పంపే ప్రయత్నాన్ని నాండీ అడ్డుకున్నాడు. తొలి ఐదు నిమిషాలు ఆఫ్ సైడ్ లో సుక్కీని కార్నర్ చేయడానికే కేరళ బ్లాక్ బస్టర్స్ విశ్వ ప్రయత్నంచేశారు. మరోవైపు కేరళ ప్లేయర్ సందేశ్ జిజ్నాస్ సైతం కౌంటరివ్వడానికి చేసిన ప్రయత్నాన్ని మెహ్రాజుద్దీన్ వాడో నిలువరించాడు.

కెర్విన్ బెల్ఫోర్ట్ 57వ నిమిషంలో చేసిన ప్రయత్నాన్ని జోసు చుర్రాయిస్ క్రాస్ చేయడంతో అదీ మట్టికొట్టుకుపోయింది. ఈ దశలో గాయం కారణంగా హుగెస్ బెంచ్‌కు పరిమితం కావడంతో సుక్కీ ప్లేస్‌లో మౌరిజియో పెలుసో వచ్చి చేరాడు. మహ్మద్ రఫీఖ్ పంపిన మరో బంతిని బెల్ఫోర్ట్ క్రాస్ చేసి నీరుగార్చాడు.

చివరి క్షణం వరకు కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ చెన్నైయిన్ ప్లేయర్లు తిప్పి కొట్టడంతో గోల్స్ లేని మ్యాచ్‌గా డ్రా అయింది. ఇక రెండు జట్ల మేనేజర్లు తమ కుర్రాళ్ల ఆటతీరుపై తమ అసంత్రుప్తిని బయట పెట్టారు. డిఫెండింగ్ చాంపియన్లుగా చెన్నైయిన్ కుర్రాళ్లు దూకుడుగా ఆడటం నేర్చుకోవాలని ఆ జట్టు కోచ్ మార్కో మాట్టరాజీ వ్యాఖ్యానిస్తే, కేరళ హెడ్ కోచ్ స్టీవ్ కొప్పెల్.. చెలరేగిపోవాలని సూపర్ మాచన్స్‌ను అభ్యర్థించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X