న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'కరోనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.. నరకం అంటే ఎలాఉంటుందో చూశా'

Struggled To Breathe: Juventus Star Paulo Dybala Details Coronavirus Nightmare

అర్జెంటీనా: మహమ్మారి కరోనా వైరస్ తనను ఉక్కిరి బిక్కిరి చేసిందని జువెన్‌టస్‌ జట్టు సభ్యుడు, అర్జెంటీనా ఆటగాడు పౌలో డైబాల అన్నాడు. ఊపిరి తీసుకోలేకపోయే వాడిని, నరకం అంటే ఏమిటో చూశా అని తెలిపాడు. డైబాల కరోనాతో పోరాటం చేసి తాజాగా బయటపడ్డాడు. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య ఇటలీలో తీవ్రంగా ఉంది. ఇప్పటివరకూ ఇటలీలో 9వేలకు మందిపైగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనాపై బ్రావో పాట.. వైరస్‌పై పోరాదామని పిలుపు (వీడియో)!!కరోనాపై బ్రావో పాట.. వైరస్‌పై పోరాదామని పిలుపు (వీడియో)!!

కోలుకుంటున్న డైబాల:

కోలుకుంటున్న డైబాల:

ఇటలీ ప్రొషెషనల్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్లలో ఒకటైన జువెన్‌టస్‌ జట్టు సభ్యుడు, అర్జెంటీనా ఆటగాడు పౌలో డైబాల సైతం కరోనాతో పోరాడాడు. ఈ క్లబ్‌ తరఫున ఆడే ఆటగాళ్లలో డానియెల్‌ రుగాని, బ్లాసి మాటుడిలో కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్న 26 ఏళ్ల డైబాల.. కరోనా వైరస్‌ తనను ఎంతలా బాధించిందనే అనుభవాలను శుక్రవారం అక్కడి జేటీవీతో పంచుకున్నాడు.

నరకం అంటే ఏమిటో చూశా:

నరకం అంటే ఏమిటో చూశా:

'ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నా. కరోనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చాలా రోజుల క్రితం నా ఆరోగ్యం బాలేదు. నడవడం చాలా కష్టమనిపించేది. ఐదు నిమిషాలు నడిచిన తర్వాత ఆయాసం వచ్చేది. తప్పక అక్కడే ఆగేవాడిని. ఊపిరి తీసుకోలేకపోయేవాడిని. నరకం అంటే ఎలా ఉంటుందో చూశా. ప్రస్తుతం కాస్త నడవగలుగుతున్నా. గత కొన్నిరోజుల క్రితం నడిస్తే షేక్‌ అయ్యే వాడిని. ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి యత్నిస్తున్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా. కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కరోనా బారిన పడిన నా కాబోయే భార్య ఒరియానా కూడా కోలుకుంటుంది' అని డైబాల చెప్పాడు.

ఇంత దారుణమైన వైరస్‌ను ఎప్పుడూ ఎదుర్కొలేదు:

ఇంత దారుణమైన వైరస్‌ను ఎప్పుడూ ఎదుర్కొలేదు:

ఇటీవల దక్షిణాఫ్రికా ప్రముఖ స్విమ్మర్‌ కామెరాన్‌ వాండర్‌బర్గ్‌ కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నాడు. ఆ వైరస్‌తో ఎంతటి నరకం అనుభవించాడో కూడా వివరించాడు. వైరస్‌ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది, ఇంత దారుణమైన వైరస్‌ను నేను ఎప్పుడూ ఎదుర్కొలేదు అని చెప్పాడు. 'గత 14 రోజులుగా కరోనాతో పోరాడుతున్నా. మొదట్లో జ్వరం తీవ్రంగా వేధించింది. శారీరక అలసట మాత్రం నన్ను ఇంకా వేధిస్తున్నది. కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుంది. నా వయసు 31. నేనేప్పుడు ధూమపానం జోలికి పోలేదు. అయినా వైరస్‌ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంత దారుణమైన వైరస్‌ను ఎప్పుడూ ఎదుర్కొలేదు' అని వాండర్‌బర్గ్‌ అన్నాడు.

లోరెంజో శాంజ్‌ మృతి:

లోరెంజో శాంజ్‌ మృతి:

రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు లోరెంజో శాంజ్‌ కరోనా వైరస్‌తో మరణించాడు. 76 ఏళ్ల శాంజ్‌ 1995-2000 మధ్య మాడ్రిడ్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చామని.. చికిత్స పొందుతూ శాంజ్‌ మరణించాడని అతడి కుమారుడు చెప్పాడు. ఓ క్రికెట్ ఆటగాడికి కూడా కరోనా సోకినా విషయం తెలిసిందే.

Story first published: Saturday, March 28, 2020, 16:50 [IST]
Other articles published on Mar 28, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X