2026 ఫిఫా వరల్డ్ కప్ బిడ్: మొరాకోకు సౌతాఫ్రికా ఫుల్ సపోర్ట్!!

Posted By:
South Africa to back Morocco 2026 World Cup bid ahead of June vote

హైదరాబాద్: వచ్చే 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు మొరాకో దాఖలు చేసిన బిడ్‌కు దక్షిణాఫ్రికా బేషరతుగా మద్దతు పలికింది. నార్త్ అమెరికా దేశాలతో పోటీగా మొరాకో ఈ బిడ్ దాఖలు చేసింది.

వరల్డ్ కప్ నిర్వహణకు సిద్దమైన మొరాకోకు అన్ని విధాల సహకరిస్తామని దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ సంఘం అధ్యక్షుడు డానీ జోర్డాన్ తెలిపారు. వచ్చే జూన్ 13వ తేదీన బిడ్డింగ్ కోసం సభ్య దేశాల మధ్య ఓటింగ్ ఉంటుంది.

మొరాకోకు మద్దతుగా లాబీయింగ్ చేసేందుకు ఎస్ఏఎఫ్ఎ రెడీ

మొరాకోకు మద్దతుగా లాబీయింగ్ చేసేందుకు ఎస్ఏఎఫ్ఎ రెడీ

మొరాకోకు మద్దతుగా వ్యక్తిగతంగా లాబీయింగ్ చేస్తామని జోర్డాన్ తెలిపారు. ఇందుకోసం మొరాకోకు వెళతానని చెప్పారు. మరోవైపు ఫిఫా అధికారులు మొరాకోలో ఫుట్ బాల్ టోర్నీ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేయనున్నారు.

ఫిఫాలో 207 దేశాలకు సభ్యత్వం

ఫిఫాలో 207 దేశాలకు సభ్యత్వం

ఫిఫాలో 207 దేశాలకు సభ్యత్వం ఉన్నది. రష్యాలో వచ్చే జూన్ నెలలో జరిగే వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా ఫిఫా సభ్యదేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు పోటీ పడే దేశాలకు అనుకూలంగా ఓటేస్తాయి. 2026 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చేందుకు అమెరికా - కెనడా - మెక్సికో దేశాలు సంయుక్తంగా పోటీ పడుతున్నాయి. 2010 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణాఫ్రికా.. తనతో పోటీ పడిన మొరాకో, ఈజిప్టు దేశాలపై ఆధిపత్యం సాధించింది. మొరాకో ఈ బిడ్‌ను గెలుచుకుంటే ఆఫ్రికా ఖండ దేశాలు ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి అవుతుంది.

దక్షిణాఫ్రికా ముడుపులపై అమెరికా ఇలా దర్యాప్తు

దక్షిణాఫ్రికా ముడుపులపై అమెరికా ఇలా దర్యాప్తు

‘వరల్డ్ కప్' నిర్వహించే ఆతిథ్య హక్కులు కైవసం చేసుకునేందుకు నార్త్ అమెరికా రీజియన్‌లోని ఫిఫా సభ్యదేశాలకు దక్షిణాఫ్రికా 10 మిలియన్ డాలర్లు ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తోంది. 2015లో అమెరికా న్యాయశాఖ ఈ మేరకు కుట్రదారులుగా ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. కానీ వారి పేర్లు మాత్రం గుర్తించలేదు.

మొరాకోలో మొదలైన ఫిఫా వరల్డ్ కప్ తనిఖీలు

మొరాకోలో మొదలైన ఫిఫా వరల్డ్ కప్ తనిఖీలు

2026లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దమైన మొరాకో.. అందుకు చేస్తున్న ఏర్పాట్లు, వసతుల కల్పన తదితర అంశాలపై ఫిఫా అధికారులు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు తనిఖీ చేస్తారు. అసలు మొరాకోకు వరల్డ్ కప్ నిర్వహణ సామర్థ్యం ఉన్నదా? అన్న విషయమై కేంద్రీకరిస్తారు.

మొరాకో స్టేడియంలు తదితర వసతుల పరిశీలన ఇలా

మొరాకో స్టేడియంలు తదితర వసతుల పరిశీలన ఇలా

మొరాకోలో అందుబాటులో ఉన్న స్టేడియంలు, శిక్షణా వసతులు, ఫ్యాన్ సైట్స్, మీడియా సెంటర్లు తదితర అంశాలను పరిశీలిస్తారు. మొరాకో ఫిఫా బిడ్ కమిటీ అధ్యక్షుడు మౌలే హఫీద్ ఎలాలామీ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ‘ఫిఫాకు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ కుటుంబానికి ఇన్నోవేటివ్ కాంపాక్ట్ కాన్సెప్ట్‌తో అసాధారణ లాభాలతో నిర్వహణ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆఫ్రికా, మొరాకో వారసత్వాన్ని అంతర్జాతీయ సమాజం ముందు నిలుపుతుంది' అని పేర్కొన్నారు. మొరాకోలో వరల్డ్ కప్ నిర్వహణ ఒక్కటే కాకుండా ఈ ప్రాంత అభివ్రుద్ధికి ఉత్ప్రేరకంగా నిలుస్తుందని తెలిపారు.

మొరాకోతోపాటు పోటీ పడుతున్న అమెరికా కూటమి

మొరాకోతోపాటు పోటీ పడుతున్న అమెరికా కూటమి

మొరాకోతోపాటు అమెరికా, మెక్సికో, కెనడా దేశాల కూటమి కూడా 2026 వరల్డ్ కప్ నిర్వహణ కోసం బిడ్డింగ్ దాఖలు చేసింది. ప్రపంచ దేశాలన్నింటా వరల్డ్ కప్ నిర్వహించాలని ఫిఫా సంకల్పంగా నిర్దేశించుకున్నది. ప్రత్యేకించి 2026 వరకు యూరోపియన్, ఆసియా ఖండ దేశాల నుంచి బిడ్లను అనుమతించడం లేదు. వచ్చే జూన్ నెలలో రష్యా వరల్డ్ కప్ నిర్వహిస్తుండగా, 2022లో ఖతార్ ఆతిథ్యం ఇవ్వనున్నది.

జూన్ నెలలో 2026 కప్ నిర్వహణ ఆతిథ్యంపై నిర్ణయం

జూన్ నెలలో 2026 కప్ నిర్వహణ ఆతిథ్యంపై నిర్ణయం

ఇక 2026 వరల్డ్ కప్ నిర్వహణకు ఎవరు ఆతిథ్యం ఇవ్వాలన్న విషయమై ఫిఫా కాంగ్రెస్ వచ్చే జూన్ 13వ తేదీన రష్యా రాజధాని మాస్కోలో జరుగనున్నది. ఆ మరుసటి రోజు నుంచి రష్యాలో సాకర్ సంరంభం ప్రారంభం కానున్నది. ఒకవేళ 2026 ప్రపంచ కప్ నిర్వహణకు సభ్య దేశాన్నిగుర్తించలేకపోతే యూరప్, ఆసియా ఖండ దేశాల నుంచి బిడ్లను ఆహ్వానించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

బ్రెజిల్ జట్టుకు నేయ్మార్ సారథ్యం.. పీలే ఆశాభావం

బ్రెజిల్ జట్టుకు నేయ్మార్ సారథ్యం.. పీలే ఆశాభావం

వచ్చే జూన్ నెల 14 నుంచి రష్యాలో మొదలయ్యే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే బ్రెజిల్ జట్టుకు నేయ్మార్ సారథ్యం వహిస్తాడని బ్రెజిల్ సాకర్ లెజెండ్ పీలే విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి గాయపడిన నేయ్మార్.. సాకర్ సంరంభం ప్రారంభమయ్యే నాటికి కోలుకుంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. పారిస్ - సెయింట్ జర్మైన్ స్ట్రైకర్‌గా ఉన్న నేయ్మార్ సారథ్యంలో బ్రెజిల్ ‘వరల్డ్ కప్' గెలుచుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. పీలే సారథ్యంలోనే బ్రెజిల్ మూడుసార్లు వరల్డ్ కప్‌ను గెలుచుకున్నది.

అత్యధిక వేతనం పొందుతున్న సాకర్ ప్లేయర్ నేయమార్

అత్యధిక వేతనం పొందుతున్న సాకర్ ప్లేయర్ నేయమార్

ప్రపంచంలోకెల్లా అత్యంత వేతనం పొందుతున్న ప్లేయర్ నేయమార్. గత ఫిబ్రవరి 25న కుడి పాదం చీల మండల్లో గాయమైనప్పటి నుంచి నేయమార్ లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. కుడి పాదానికి సర్జరీ చేసిన తర్వాత కూడా ఇంకా గాయం మానాల్సి ఉంటుందని గతవారం తెలిపాడు. అయితే జూన్ 14 నుంచి జూలై 15 మధ్య తాను కోలుకోగలనని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

గత టోర్నీలో సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓటమి

గత టోర్నీలో సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓటమి

సొంతగడ్డపై 2014లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో ఓటమితో అవమానంగా భావిస్తున్నది. ప్రస్తుతం టైట్ అనే కొత్త కోచ్ ఆధ్వర్యంలో టీంను సిద్ధం చేయడానికి టైం సరిపోతుందని భావిస్తున్నానని పీలే తెలిపాడు. యూరప్‌లోని వివిధ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసాధారణమైన ఆటగాళ్లు బ్రెజిల్‌కు ఉన్నారని, వారందరినీ జట్టుగా చేర్చడమే సమస్య అని చెప్పాడు. అర్జెంటీనాకు చెందిన లియానెల్ మెస్సీ, పోర్చుగల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో తదితరుల వల్ల ఆశ్చర్యకర సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అర్జెంటీనాతోపాటు జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ప్రధాన పోటీ దారులని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, April 17, 2018, 13:39 [IST]
Other articles published on Apr 17, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి