న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

68 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన చిన్న దేశంగా చరిత్ర సృష్టించిన క్రొయేషియా

By Nageshwara Rao
Smallest nation, lowest ranked team: Croatia creates many new records

హైదరాబాద్: క్రొయేషియా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. ఎందుకంటే... రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో గురువారం లుజ్నికీ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది.

దీంతో వరల్డ్ కప్ ఫైనల్లో తలపడే రెండు జట్లు ఏవో తెలిసిపోయింది. బెల్జియంతో జరిగిన తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ విజయం సాధించగా, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో క్రొయేషియా విజయం సాధించి మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.

1998 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌ చేరుకోవడమే క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. దీంతో ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరిన చిన్నదేశంగా (జనాభా పరంగా) క్రొయేషియా నిలిచింది. క్రొయేషియా దేశ జనాభా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

క్రొయేషియా జనాభా సుమారు నలభై లక్షలు

క్రొయేషియా జనాభా సుమారు నలభై లక్షలు

క్రొయేషియా జనాభా సుమారు నలభై లక్షలు. అంటే మన దేశంలో మిజోరం-నాగాలాండ్‌ ఈ రెండు రాష్ట్రాలను కలిపితే ఉన్న జనాభా కంటే క్రొయేషియా దేశ జనాభానే తక్కువ. ఒక్క హిమాచల్‌ ప్రదేశ్‌(68.6లక్షలు) రాష్ట్రంతో పోల్చి చూసినా క్రొయేషియా జనాభా తక్కువే. దీంతో 1950లో వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన చిన్న దేశంగా ఉరుగ్వే చరిత్ర సృష్టించింది.

68 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన చిన్న దేశం

68 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన చిన్న దేశం

ఆ తర్వాత అంటే 68 ఏళ్ల తర్వాత 2018 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన చిన్న దేశంగా క్రొయేషియా చరిత్ర సృష్టించింది. అంతేకాదు తక్కువ ర్యాంకులో ఉన్న ఓ జట్టు ఫైనల్‌ చేరడం ఫిఫా చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం క్రొయేషియా ర్యాంకు 20గా ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ వరల్డ్ కప్ బరిలోకి దిగిన క్రొయేషియా తన సంచలన ప్రదర్శనతో వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.

గ్రూప్ స్టేజిలో అద్భుత విజయాలు

గ్రూప్ స్టేజిలో అద్భుత విజయాలు

ఫైనల్స్‌కు చేరే క్రమంలో క్రొయేషియా 2014 వరల్డ్ కప్ రన్నరప్ జట్టు అర్జెంటీనాతో పాటు నైజీరియా, ఐస్‌ల్యాండ్ జట్లను గ్రూప్ స్టేజిలో ఓడించింది. నాకౌట్ స్టేజిలో డెన్మార్క్ జట్టుపై 3-2తేడాతో విజయం సాధించిన క్రొయేషియా క్వార్టర్ ఫైనల్లో రష్యాపై పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-3తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో పటిష్ట ఇంగ్లాండ్‌పై 2-1తో విజయం సాధించి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.

సంబరాల్లో మునిగిపోయిన క్రొయేషియా ప్రజలు

సంబరాల్లో మునిగిపోయిన క్రొయేషియా ప్రజలు

జనాభా పరంగా చాలా చిన్నదేశమైన క్రొయేషియా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడంతో ఆ దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆ దేశ ప్రజలంతా ఫ్రాన్స్‌తో జరగనున్న వరల్డ్ కప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వరల్డ్ కప్‌లో క్రొయేషియా తన చివరి మూడు మ్యాచ్‌లను అదనపు సమయంలో గెలవడం విశేషం.

Story first published: Thursday, July 12, 2018, 13:37 [IST]
Other articles published on Jul 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X