న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మాంచెస్టర్ సిటీకి ‘ప్రీమియర్ టైటిల్’ మరణంతో సమానమే: పోగ్బా

Seeing Man City win the title would be like death – Pogba

హైదరాబాద్: ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను మాంచెస్టర్ సిటీ గెలుచుకుంటుంటే చూడటం మరణంతో సమానమని మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ పాల్ పోగ్బా వ్యాఖ్యానించాడు. మాంచెస్టర్ సిటీ జట్టు టైటిల్ గెలుచుకోకుండా నివారించలేకపోతే తనదే బాధ్యత అని పోగ్బా తెలిపాడు.

శనివారం మాంచెస్టర్ సిటీ ఫస్టాఫ్ ముగిసే సమయానికి విన్సెంట్ కొంపనీ, ఇల్కే గుండోగాన్ చేసిన గోల్స్‌తో 2 - 0 స్కోర్ తేడాతో ఆధిక్యంలో ఉన్నది. సెకండాఫ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ పాల్ పోగ్బా వెంటవెంటనే రెండు గోల్స్ చేయడంతో స్కోర్ సమమైంది. కానీ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ చిరిస్ స్మాలింగ్ మరో గోల్ చేయడంతో 3 - 2 స్కోర్ తేడాతో టైటిల్ దక్కించుకున్నది.

గత జనవరిలో ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా పాల్ పోగ్బా తమ జట్టులో చేరడానికి తన ఏజంట్ మినో రాయోలా ద్వారా ప్రయత్నించాడని మాంచెస్టర్ సిటీ కోచ్ పెప్ గౌర్డియాలా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మాంచెస్టర్ యునైటెడ్‌పై మాంఛెస్టర్ సిటీ గెలుపొందింది. కానీ ఈ దఫా అలా జరుగకుండా చూడాలని భావించానని పోగ్బా తెలిపాడు. క్రితం సారి ఓటమి తన మనో ఫలకంపైనే కొనసాగుతున్నదని చెప్పాడు.

'ఒకవేళ వారు గెలిచి ఛాంపియన్లుగా నిలిస్తే మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులకు అది మరణంతో సమానమే. మాంచెస్టర్ యునైటెడ్‌పై ఓడిపోయినందుకు వారిని పండుగ చేసుకోనివ్వండి. నేను ఆ పని చేయను' అని పోగ్బా వ్యాఖ్యానించాడు.

పాల్ పోగ్బా పెనాల్టీ ఏరియా నుంచి చివరి దశలో చేసిన రెండు గోల్స్.. మాంఛెస్టర్ యునైటెడ్ శక్తిని చూపాయి. తాను ఈ గోల్స్ చేయడంలో మిఖైల్ కార్రిక్ ఎంతో సాయం చేశాడు అని ఈ ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ చెప్పాడు.

'ఆయన ఎల్లవేళలా నేనేం చేస్తున్నానో తెలియజేసేందుకు నా వీడియోలు ప్రదర్శించేవాడు. మాంఛెస్టర్ సిటీతో జరిగే మ్యాచ్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడాలని భావించాం. వారు డిఫెండ్ చేసే స్థితిలో లేరు. దీంతో నేను గోల్ బాక్స్ వద్దకు వెళ్లగలిగాను. నా వెంటే నేమంజా మాటిక్, అండర్ హెర్రేరా కూడా ఉన్నారని నాకు తెలుసు' అని పాల్ పోగ్బా తెలిపాడు.

'గోల్ చేయడం కోసం నేను మిగతా అంశాలను పట్టించుకోలేదు. అలెక్సిస్ సాంచెజ్ నేరుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. నేను గోల్ పోస్ట్ వరకు వెళ్లేందుకు స్థలం ఉంటే చాలు. విన్సెంట్ కొంపనీ ఒత్తిడి తేవకపోవడం నాకు లక్కీగా పరిణమించింది' పోగ్బా చెప్పాడు.

Story first published: Sunday, April 8, 2018, 12:23 [IST]
Other articles published on Apr 8, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X