న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఎట్టకేలకు దిగొచ్చిన రష్యా: జర్మనీ జర్నలిస్ట్‌కు వీసా జారీ

Russia lifts World Cup ban on German journalist

హైదరాబాద్: జర్మనీ జర్నలిస్ట్ హజో సెప్పెల్ట్‌కు వచ్చేనెల 14 నుంచి ప్రారంభమయ్యే సాకర్ సంరంభం వేడుకలను కవర్ చేసేందుకు రష్యా వీసా జారీ చేసింది. ఇంతకుముందు రష్యా ప్రభుత్వం అధికారికంగా డోపింగ్‌ను ప్రోత్సహించిన నేపథ్యంలో బయటపెట్టిన జర్నలిస్ట్ హాజో సెప్పెల్ట్‌కు తొలుత రష్యా వీసా నిరాకరించింది.

ఇలా ట్వీట్‌తో హాజి సెప్పెల్ట్ వీసా బహిర్గతం

ఇలా ట్వీట్‌తో హాజి సెప్పెల్ట్ వీసా బహిర్గతం

ఈ మేరకు జర్మనీ విదేశాంగశాఖ మంత్రి హైకో మాస్ ట్వీట్ చేసి ఈ సంగతి బయట పెట్టారు. ‘వరల్డ్ కప్ కోసం హాజి సెప్పెల్ట్ రష్యా రావచ్చు. స్వేచ్ఛగా వార్తల కవరేజి చేసుకోవచ్చునని రష్యా మాకు సమాచారం అందజేసింది' అని తెలిపారు. గత శీతాకాలంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన ఒలింపిక్స్ గేమ్స్‌లో రష్యా అథ్లెట్ల డోపింగ్ వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో హాజి సెప్పెల్ట్ బయటపెట్టారు. దీంతో రష్యా అథ్లెట్ల వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.

హాజి సెప్పెల్ట్ వీసా దరఖాస్తు నిరాకరణ

హాజి సెప్పెల్ట్ వీసా దరఖాస్తు నిరాకరణ

ఈ నేపథ్యంలో హాజి సెప్పెల్ట్ గతవారం జర్మనీ ప్రాంతీయ వార్తా చానెల్ ఎస్‌డబ్ల్యూఆర్ ద్వారా దాఖలు చేసిన వీసా పత్రాలను రష్యా తిరస్కరించింది. వీసా జారీచేయకూడని వ్యక్తుల జాబితాలో చేర్చింది. హాజి సెప్పెల్ట్‌కు వీసా జారీ చేయకపోవడానికి కారణాలేమిటో వివరించలేదు. డోపింగ్ వ్యవస్థ బహిర్గతం చేయడంతో రష్యా ప్రభావం తీవ్రంగా పడింది. దీనిపై జర్మనీ తీవ్రంగా ప్రతిస్పందించింది. హాజి సెప్పెల్ట్‌కు వీసా నిరాకరణ రష్యా తప్పిదమని పేర్కొన్నది.

మీడియా స్వేచ్ఛపై జర్మనీ ఇలా హెచ్చరికలు

మీడియా స్వేచ్ఛపై జర్మనీ ఇలా హెచ్చరికలు

ఒకవేళ మీడియా స్వేచ్ఛను అనుమతించకపోతే రష్యాకు ప్రతికూల ప్రభావం చూపుతుందని జర్మనీ హెచ్చరించింది. ప్రపంచం ద్రుష్టంతా రష్యాపైనే ఉంటుందని పేర్కొన్నది. అంతకుముందు జర్మన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధినేత రైన్‌హార్డ్ గ్రిండెల్.. ఈ విషయమై ఫిఫా చైర్మన్ జియాన్ని ఇన్ ఫాంటినోతో చర్చించారు. ‘రష్యా ప్రభుత్వంతో వ్యక్తిగతంగా జియాన్ని ఇన్‌ఫాంటినో చర్చించి ఉంటారని భావిస్తున్నా' గ్రిండెల్ తెలిపారు.

 ఇప్పటికే సాకర్ కప్ హక్కుల విషయమై రష్యాపై ఆరోపణలు

ఇప్పటికే సాకర్ కప్ హక్కుల విషయమై రష్యాపై ఆరోపణలు

ఇప్పటికే 2010లో ముడుపులు చెల్లించి 2019 వరల్డ్ కప్ హక్కులు పొందిందని రష్యాపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టోర్నమెంట్ కవరేజీ కోసం వీసా దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టు హాజి సెప్పెల్ట్‌కు అనుమతి నిరాకరించడం మరింత వివాదాస్పదమైంది. గమ్మత్తేమిటంటే హాజి సెప్పెల్ట్‌కు అక్రిడిటేషన్ కల్పిస్తూ ఫిఫా ఆదేశాలు జారీ చేసింది.

మీడియా కవరేజీకి ఫిఫా ఇలా ప్రాధాన్యం

మీడియా కవరేజీకి ఫిఫా ఇలా ప్రాధాన్యం

'ఫిఫా ఎల్లవేళలా మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తుంది. తాము ఎల్లవేళలా పిఫా కార్యక్రమాల కవరేజీ కోసం మీడియా ప్రతినిధులకు అనుమతినిస్తుంది' అని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. జర్మనీ చాన్స్‌లర్ ఎంజీలా మెర్కెలా త్వరలో రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానుండగా ఈ వివాదం వెలుగు చూడటం గమనార్హం. ఇప్పటికే సిరియా, ఉక్రెయిన్ సంక్షోభంలో పశ్చిమ దేశాల నుంచి రష్యా విభేదాలు ఉన్నాయి.

Story first published: Thursday, May 24, 2018, 11:00 [IST]
Other articles published on May 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X