న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

బెంగళూరు ఎఫ్‌సీకి గుడ్‌బై: మూడో దశ కాంట్రాక్ట్‌కు ఆల్బర్ట్ రోసా నో

Roca leaves as Bengaluru FC coach after two successful seasons

హైదరాబాద్: బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ హెడ్ కోచ్ ఆల్బర్ట్ రోసాగా వైదొలిగారు. మే చివరితో బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ హెడ్ కోచ్‌గా కాంట్రాక్టు పూర్తి కానున్నది. వరుసగా రెండు దఫాలు ఆ జట్టు ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించారు. రెండోసారి ఆయన రెండేళ్ల కాంట్రాక్టు 2016 జూలైలో మొదలైంది. వ్యక్తిగత కారణాల వల్ల తన కాంట్రాక్టు పునరుద్ధరించుకోవాలని కోరుకోవడం లేదని ఆల్బర్ట్ రోసా తెలిపాడు.

ఇండియన్ ఫుట్‌బాల్‌లో బెంగళూరు ఎఫ్‌సీ కీలకం

ఇండియన్ ఫుట్‌బాల్‌లో బెంగళూరు ఎఫ్‌సీ కీలకం

బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ సీఈఓ పార్థ్ జిందాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ ఫుట్‌బాల్ రంగంలో ఎల్లవేళలా బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ చాలా ముఖ్యమైన జట్టు. ఆ దిశగా జట్టును శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ఆల్బర్ట్ రోసాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం' అని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన తత్త్వానికి అనుగుణంగా ఫుట్‌బాల్ తీర్చిదిద్దారని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు. ఆసియాన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సీ) కప్ టోర్నమెంట్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు నాకౌట్ దశకు చేరుకున్నది. అంతకుముందు ఢాకాలో ఢాకా అబాహాని జట్టుపై బెంగళూరు ఎఫ్‌సీ జట్టు 4 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

 ఆగస్టులో తదుపరి ఎఎఫ్‌సీ మ్యాచ్‌లు

ఆగస్టులో తదుపరి ఎఎఫ్‌సీ మ్యాచ్‌లు

ఎఎఫ్‌సీ టోర్నమెంట్ తదుపరి దశ మ్యాచ్‌లు ఆగస్టులో జరుగనున్నాయి. భారతీయ ఫుట్‌బాల్ క్లబ్ జట్టును 2016లో ఎఎఫ్‌సీ ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో ఆల్బర్ట్ రోసా పాత్ర తిరుగులేనిది. 2017లో ఫెడరేషన్ కప్, 2018 సూపర్ కప్ టైటిళ్లను బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ జట్టు గెలుచుకున్నది. 2017 - 18 సీజన్‌లో ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో బెంగళూరు ఎఫ్ సీ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

బెంగళూరు ఎఫ్‌సీ కోచ్‌గా ఆల్బర్ట్ రోసా కెరీర్‌లో ప్రత్యేకం

బెంగళూరు ఎఫ్‌సీ కోచ్‌గా ఆల్బర్ట్ రోసా కెరీర్‌లో ప్రత్యేకం

‘ఆయన ఆలోచనలకు అనుగుణంగా క్లబ్ జట్టును తీర్చిదిద్దాం. అయితే ఆసియా ఖండ స్థాయి నుంచి బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్ జట్టును అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌లో బెంగళూరు ఎఫ్‌సీ‌లోకి ఎల్లవేళలా ఆహ్వానం ఉంటుంది' అని పార్థ్ జిందాల్ తెలిపారు. ఇంతకు ముందు 2016 - 17 వరకు బార్సిలోనా ఎఫ్‌సీ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. తర్వాత బెంగళూరు ఎఫ్‌సీ హెడ్ కోచ్‌గా వ్యవహరించడం ఆయన కెరీర్‌లో ప్రత్యేకత సాధించుకున్నారు.

ఆల్బర్ట్ రోసా సారథ్యంలోనే 2016 ఎఎఫ్సీ రన్నరప్‌గా బెంగళూరు

ఆల్బర్ట్ రోసా సారథ్యంలోనే 2016 ఎఎఫ్సీ రన్నరప్‌గా బెంగళూరు

బెంగళూరు ఎఫ్‌సీ హెడ్ కోచ్‌గా ఆల్బర్ట్ రోసా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఆ జట్టు 2016లో ఎఎఫ్సీ కప్ టోర్నీలో నాకౌట్ దశను దాటి ఖతార్ జట్టుతో ఆడి ఫైనల్స్ కు చేరింది. ఫైనల్స్‌లో ఇరాక్ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టు చేతిలో 0 - 1 స్కోర్ తేడాతో రన్నరప్‌గా త్రుప్తి పడింది. కానీ ఐ - లీగ్ టోర్నీలో బెంగళూరు ఎఫ్ సీ నాలుగో స్థానంలో స్థిర పడటంతో మాత్రం ఆల్బర్ట్ రోసాను నిరాశ పరిచింది. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో 2017 - 18లో జట్టును పూర్తిగా పునర్నిర్మాణం చేయడంపై కేంద్రీకరించారు ఆల్బర్ట్ రోసా.

సూపర్ కప్ టైటిల్ గెలుచుకున్న బెంగళూరు ఎఫ్‌సీ

సూపర్ కప్ టైటిల్ గెలుచుకున్న బెంగళూరు ఎఫ్‌సీ

గతేడాది మార్చిలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్స్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు చేతిలో ఓటమి పాలైన బెంగళూరు ఎఫ్ సీ జట్టు తిరిగి సూపర్ కప్ టైటిల్ గెలుచుకోవడంలో ఆల్బర్ట్ రోసా కీలకంగా వ్యవహరించారు. నాలుగేళ్లలో వరుసగా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించడంలో ఆల్బర్ట్ రోసా ముఖ్యమైన పాత్ర వహించారు.

Story first published: Friday, May 18, 2018, 15:04 [IST]
Other articles published on May 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X