బార్సిలోనాకే ‘లా లీగ’ టైటిల్: రేపు మాడ్రిడ్ క్లబ్‌ల మధ్య సెమీస్

Posted By:
 Reals Madrid derby dilemma: End Atleticos title dream and gift La Liga to Barcelona

మాడ్రిడ్: లా లీగా టోర్నీలో మాడ్రిడ్ సిటీకి చెందిన రెండు క్లబ్‌లకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. లా లీగా సెమీ ఫైనల్స్‌లో రియల్ మాడ్రిడ్, అట్లెంటికో మాడ్రిడ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2012 తర్వాత ఏ దశలోనూ తలపడలేదు.

అందునా సెమీ ఫైనల్స్ దశలో ఈ రెండు జట్లు ముఖాముఖీ పోటీ పడుతుండటంతో ఏదో ఒక జట్టు ఫైనల్స్‌లో అడుగు పెడితే.. మరో జట్టు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆదివారం రియల్ మాడ్రిడ్, అట్లెంటికో మాడ్రిడ్ జట్లు సొంత గడ్డపై తలపడనున్నాయి. కానీ రియల్ మాడ్రిడ్ గెలుపొందే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇది లాస్ బ్లాంకోస్ జట్టుకు సానుకూల పరిణామమే మరి.

చివరి మ్యాచ్‌లో ఫలితం డ్రా

చివరి మ్యాచ్‌లో ఫలితం డ్రా

లా లీగా టోర్నీలో సొంతగడ్డపై అట్లెంటికో మాడ్రిడ్ జట్టుపై రియల్ మాడ్రిడ్ జట్టు గెలుపొందిన దాఖలాలే లేవు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ అట్లెంటికో మాడ్రిడ్ జట్టుతో రియల్ మాడ్రిడ్ ఓటమి పాలైంది. చివరి మ్యాచ్‌ను డ్రా ముగించుకున్నది రియల్ మాడ్రిడ్. తాజా పరిస్థితుల్లో ఆదివారం మాడ్రిడ్ రెండు క్లబ్ జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో విజయం లాస్ బ్లాంకోస్ (అట్లెంటికో మాడ్రిడ్) జట్టునే వరిస్తుందని చెబుతున్నారు.

పాయింట్ల పట్టికలో టాప్‌లో బార్సిలోనా

పాయింట్ల పట్టికలో టాప్‌లో బార్సిలోనా

లా లీగ టైటిల్ మాత్రం మాడ్రిడ్ ప్రత్యర్థి జట్టు బార్సిలోనాకు వెళుతుందని అంటున్నారు. బార్సిలోనా సొంత గడ్డపై శక్తిమంతమైన జట్టుగా పేరొంది. ఏడు రౌండ్లు సాగిన లా లీగ టోర్నీలో మిగతా జట్ల కంటే బార్సిలోనా 10 పాయింట్ల ఆధిక్యంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బార్సిలోనా 76 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే తర్వాతీ స్థానాల్లో అట్లెంటికో మాడ్రిడ్ 67, రియల్ మాడ్రిడ్ 63, వాలెంసియా సీఎఫ్ 62 పాయింట్లతో కొనసాగుతున్నాయి.

 డ్రాగా ముగించుకున్నా నాలుగో స్థానానికి రియల్ మాడ్రిడ్

డ్రాగా ముగించుకున్నా నాలుగో స్థానానికి రియల్ మాడ్రిడ్

ఒకవేళ రియల్ మాడ్రిడ్ గెలుపొందితే సిటీ క్లబ్ జట్టుపై గెలుపొందితే టోర్నీ ముగింపులో మూడు స్థానంతో కంటే మెరుగ్గా రన్నరప్ గానో, కాలం కలిసి వస్తే మళ్లీ ‘లా లీగ' టైటిల్ విజేతగానో నిలుస్తుంది. లేదంటే మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తుంది. ఒకవేళ డ్రా గా ముగిసినా బార్సిలోనాకే మేలు చేస్తుంది. ఏ దశలోనూ అట్లెంటికో మాడ్రిడ్ జట్టును ఢీ కొట్టలేకపోతే రియల్ మాడ్రిడ్.. వాలెంసియా తర్వాత స్థానంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 మాడ్రిడ్ క్లబ్ జట్లకు ఇబ్బందికర పరిస్థితులు ఇలా

మాడ్రిడ్ క్లబ్ జట్లకు ఇబ్బందికర పరిస్థితులు ఇలా

రియల్ మాడ్రిడ్‌పై అట్లెంటికో మాడ్రిడ్ గెలుపు ఆ జట్టు టైటిల్ కైవసం ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ రియల్ మాడ్రిడ్ జట్టుకు మాత్రం మోయలేని తలపోటుగా పరిణమిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఏ రకంగానూ సాంకేతిక అంశాలూ రియల్ మాడ్రిడ్ జట్టుకు అనుకూలంగా లేవు. టైటిల్ కోసం బార్సిలోనా పెట్టుకున్న ఆశలే ఎక్కువ సానుకూలంగా ఉన్నాయి. చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో జువెంటస్ జట్టుపై బుధవారం మ్యాచ్‌లో రొనాల్డో మెరుపు గోల్ సాధించిన నేపథ్యంలో మాడ్రిడ్ లోని రెండు క్లబ్ జట్లకు ఇబ్బందికర పరిస్థితులే తెచ్చి పెట్టింది.

 జువెంటస్‌పై గెలిచినంత తేలిక్కాదు అట్లెంటికో మాడ్రిడ్‌తో పోరు

జువెంటస్‌పై గెలిచినంత తేలిక్కాదు అట్లెంటికో మాడ్రిడ్‌తో పోరు

ప్రస్తుతానికి జట్టు పరంగా అట్లెంటికో మాడ్రిడ్ కంటే రియల్ మాడ్రిడ్ పరిస్థితి మెరుగ్గా ఉన్నది. యానిక్ కుర్రాస్కో, నికో గైటాన్ గత ఫిబ్రవరిలో చైనాకు వెళ్లిపోయిన తర్వాత కేవలం 17 మంది ఆటగాళ్లతో సిమ్మోన్స్ బరిలోకి దిగుతున్నారు. అయినా లా లీగ, యూరోపా లీగ్ లో అట్లెంటికో మాడ్రిడ్ పోటీ పడుతూనే ఉంది. జువెంటస్ జట్టుపై గెలుపొందినంత తేలిగ్గా లా లీగాలో అట్లెంటికో మాడ్రిడ్ జట్టుపై రియల్ మాడ్రిడ్ జట్టు విజయం తేలిక్కాదు.

Story first published: Saturday, April 7, 2018, 13:40 [IST]
Other articles published on Apr 7, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి