న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్‌కప్ బిడ్డింగ్‌లో గెలిచేందుకు ఖతార్ 'బ్లాక్ ఆఫరేషన్'

By Nageshwara Rao
Qatar World Cup organisers deny black operations campaign claim

హైదరాబాద్: 2010లో జరిగిన 2022 ఫిఫా వరల్డ్ కప్ బిడ్డింగ్‌లో ఖతార్‌ విజయం సాధించింది. అయితే, ఈ బిడ్డింగ్‌‌‌లో గెలిచేందుకు గాను ఖతార్ స్మెర్ క్యాంపెయిన్‌‌ను నిర్వహించిందంటూ సండేటైమ్స్‌ పత్రికలో వెలువడిన కథనంపై ఖతార్‌కు చెందిన ఫిఫా సుప్రీం కమిటీ మండిపడింది.

తాజాగా, ఈ స్మెర్ క్యాంపెయిన్‌‌కు సంబంధించిన పత్రాలు వెలుగులకి వచ్చాయి. ఈ వరల్డ్‌కప్ నిర్వహణకు ఖతార్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌లు పోటీపడ్డాయి. అమెరికా నుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఖతార్‌ అమెరికాకు చెందిన పబ్లిక్‌ రిలేషన్స్‌ సంస్థ బీఎల్‌జేను నియమించుకొంది.

అంతేకాదు బిడ్డింగ్‌లో పాల్గొనే ప్రత్యర్థి దేశాలకు సంబంధించిన వ్యక్తులను 'మేనేజ్‌' చేసేందుకు మాజీ సీఐఏ ఏజెంట్‌ను కూడా నియమించుకొంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రత్యర్థి దేశాల్లో ఫిఫా వరల్డ్‌కప్ నిర్వహణపై వ్యతిరేకత వచ్చేలా వీరు ప్రచారం చేశారనేది పత్రాల్లో వెలుగు చూసిన విషయం.

ఎలా బయటపడింది?
2022 ఫిఫా వరల్డ్ కప్ బిడ్డింగ్‌ ప్రక్రియలో పనిచేసిన ఒకరు సండేటైమ్స్‌కు ఈ పత్రాలకు సంబంధించి మెయిల్‌ చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను ఖతార్‌ కొట్టిపారేసింది. నిజానికి ఇలాంటి క్యాంపెయిన్లు నిర్వహించడం ఫిఫా నిబంధనలను విరుద్ధం. దీంతో ఫిఫా దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో ఖతార్ కమిటీని నిర్దోషులుగా తేల్చింది.

పత్రాల్లో వెలుగు చూసిన విషయాలు:

  • అమెరికా ఫిఫా వరల్డ్ కప్ నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం పడుతుందంటూ ఓ విద్యాసంస్థ ద్వారా నివేదిక తయారు చేయించి ప్రచారంలోకి తెచ్చింది. దీనికి ఖతార్ 9వేల డాలర్లు చెల్లించింది.
  • బిడ్డింగ్‌లో పాల్గొన్న ప్రత్యర్థి దేశాలకు చెందిన కొందరు ఎంపిక చేసిన జర్నలిస్టులను, బ్లాగర్స్‌ను, అత్యున్నత స్థాయి వ్యక్తులను వరల్డ్‌కప్ నిర్వహణకు వ్యతిరేకంగా మాట్లాడించింది.
  • ఆస్ట్రేలియాలో రగ్బీ క్రీడలు జరుగుతున్న చోట్ల ఫిఫా వరల్డ్ కప్ బిడ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించడం.

ఇదిలా ఉంటే, 2022 వరల్డ్ కప్ నిర్వహణను దక్కించుకోలేకపోయిన అమెరికా... 2026 ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో విజయం సాధించింది. కెనడా, మెక్సికో దేశాలతో కలిసి 2026లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Monday, July 30, 2018, 15:37 [IST]
Other articles published on Jul 30, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X