న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

2022 ఫిఫా ప్రపంచ కప్ జరగనున్న దేశం, సమయం, టిక్కెట్ల వివరాలు..??

Qatar World Cup 2022: Dates, how to get tickets and everything you should know

హైదరాబాద్: జూన్ 14 నుంచి మొదలై జూలై 15వరకూ దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి తెరపడింది. మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా ప్రపంచకప్ బరిలో దిగి పోటీపడ్డాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా అశేష అభిమానుల మద్దతు మధ్య సాఫీగా సాగింది. రష్యాలో ఉగ్రవాదుల దాడులు జరుగుతాయంటూ.. పలు జాగ్రత్త సూచనలు తీసుకున్న అక్కడి ప్రభుత్వం క్రీడా సంరంభాన్ని ఎలాంటి అవరోధాలు లేకుండానే పూర్తి చేశాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

కాగా, తదుపరి ఫిఫా ప్రపంచ కప్ ఎప్పుడు జరుగుతుందా అనే ఆసక్తి ప్రతి క్రీడాభిమాని మదిలో మెదిలే ప్రశ్న. అయితే దీనిపై వివరణ వచ్చేసింది. ఫ్రాన్స్, క్రొయేషియా ఫైనల్ మ్యాచ్‌కు దేశ అధికారిక భవనం క్రెమ్లిన్‌లో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో సమక్షంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఖతార్ రాజు షేక్ తమీమ్‌బిన్ హమద్‌ఆల్ థనీకి 2022 ప్రపంచకప్ టార్చ్‌ను అందించారు.

కాగా, ఈ 2022 ప్రపంచ కప్ గురించి వివరాలు ఇలా ఉన్నాయి.

అక్కడికి వెళ్లేందుకు టిక్కెట్లు ఇలా:

అక్కడికి వెళ్లాలంటే సహనమే సులువైన మార్గం. కారణం 2021 నుంచి మాత్రమే 2022 ప్రపంచ కప్ టిక్కెట్లు ఇవ్వనున్నారట. 2018 రష్యా వరల్డ్ కప్‌కు కూడా సెప్టెంబర్ 2017 నుంచే ఇచ్చారు.

మరెన్ని జట్లు పొల్గొంటాయో:

ప్రస్తుతం ముగిసిన టోర్నమెంట్లో 32 జట్లు పాల్గొని విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. అలాగే ఈ సారి వరల్డ్ కప్‌కు కూడా 32 జట్లతోనే ప్రపంచ కప్ సిద్ధం కానుంది. కానీ, 2026కు మాత్రం 48 జట్లు సమరానికి సిద్ధమవుతాయి.

2022లో ఎప్పుడు జరుగుతుందంటే:

2022వ సంవత్సరం నవంబరు 21 నుంచి 18 డిసెంబరు 2022వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. అక్కడి ఉష్ణోగ్రతలను బట్టి ఆటగాళ్లకు సౌకర్యవంతంగా ఉంటుందని ఇలా తేదీలను ఖరారు చేశారు. వేసవి కాలంలో అక్కడి ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీల వరకూ ఉంటుంది. అది పూర్తయ్యాక ఈ పోటీలు నిర్వహించనున్నారు.

ఎక్కడ జరుగుతుందంటే:
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న 22వ ప్రపంచ కప్‌ను ఖతర్‌లో నిర్వహించనున్నారు. అరబ్ దేశాలలోనే తొలిసారిగా ఇంత పెద్ద టోర్నీ జరగడం విశేషం.

ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ రష్యా వేదికగా ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. మా మిత్రదేశమైన కతార్‌లోనూ 2022 సంవత్సరంలో సక్సెక్ కావాలని ఆశిస్తున్నా అని అన్నారు. మరోవైపు ఫిఫా ప్రపంచకప్ మా దేశానికి పెద్ద పండుగ లాంటిది అని ఖతార్ రాజు అన్నారు. ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న తొలి అరబ్ దేశంగా ఖతార్ రికార్డుల్లోకెక్కింది.

Story first published: Tuesday, July 17, 2018, 14:29 [IST]
Other articles published on Jul 17, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X