న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2022 పైనల్‌కు ఆతిథ్యమిచ్చే స్టేడియాన్ని చూశారా?

Qatar unveils Lusail Stadium for 2022 FIFA World Cup

హైదరాబాద్: 2022లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఖతార్‌లోని దోహా నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణను దక్కించుకున్న ఖతార్ తాజాగా ప్రారంభ వేడుకలు నిర్వహించే స్టేడియం డిజైన్‌ను ఆవిష్కరించింది.

ఐపీఎల్ వేలం 2019: అమ్ముడుపోయేదెవరు?ఐపీఎల్ వేలం 2019: అమ్ముడుపోయేదెవరు?

ప్రస్తుతం లుసైల్ స్టేడియం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లుసైల్ స్టేడియం సామర్థ్యం 80 వేలు కాగా అరబ్ నిర్మాణ శైలిలో స్టేడియం ఆకృతిని బ్రిటన్‌కు చెందిన పోస్టర్-పాట్నర్స్ సంస్థ రూపొందించింది. 4500 కోట్లతో ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరంగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.

2020 ఏడాదికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానుంది. ఫిఫా వరల్డ్ కప్‌కు మధ్యప్రాచ్యంలో మొదటిసారిగా జరగనున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఖతార్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సహా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రపంచకప్ ఉన్నతస్థాయి కమిటీ తెలిపింది.

లుసైల్ స్టేడియం నిర్మాణం ఇప్పటికే 90 శాతం పూర్తి అయిందని సుప్రీం కమిటీ పేర్కొంది. అరబ్ దేశాల్లో మొట్టమొదటిసారి జరగనున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 21, 2022న ప్రారంభం కానుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్‌కు మొత్తం ఎనిమిది స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి.

Story first published: Tuesday, December 18, 2018, 10:51 [IST]
Other articles published on Dec 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X