ప్రపంచ కప్‌కు కౌంట్ డౌన్ మొదలైంది.. ఖతర్‌కు దొరికిన అవకాశం

దోహా: ఎన్నో అంచనాలను దాటుకుని భారీ భద్రతల మధ్య ముగిసిన రష్యా ప్రపంచ కప్ 2018 ఇంకా మరిచిపోనే లేదు. ఇంతలోనే ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఖతర్ 2022 ఫిఫా వరల్డ్ కప్ ఏర్పాట్లను మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో సరిగ్గా నవంబరు 21న ఆరంభమవుతుండటంతో అరబ్ దేశాల్లో మొదలయ్యే తొలి టోర్నీ కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022వ సంవత్సరంలో జరగనున్న ఖతర్ ఫిఫా వరల్డ్ కప్ నవంబరు 21నుంచి డిసెంబరు 18వరకు జరగనుంది.

కొన్ని సంప్రదాయాల కారణంగా వరల్డ్ కప్‌ను శీతాకాలం నిర్వహించేందుకు పూనుకున్నారు. అక్కడి వాతవారణ పరిస్థితుల దృష్ట్యా వేసవిలో వేడి తాపానికి పర్యాటక జట్లు తట్టుకోలేరని నిర్వహకుల అభిప్రాయం. కాగా, షెడ్యూల్ నాటికి అన్నీ ఏర్పాట్లను చక్కదిద్దుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం దాంతో పాటు మిగిలిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేసి టోర్నమెంట్ సజావుగా సాగేందుకు యత్నిస్తున్నారు.

టోర్నమెంట్ కోసమని 8 స్టేడియంలు:

టోర్నమెంట్ కోసమని 8 స్టేడియంలు:

నెలరోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం నిర్వహకులు ఎనిమిది స్టేడియాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వాటన్నింటినీ రెండు సంవత్సరాల ముందుగానే సిద్ధం చేస్తామని మాటిచ్చారు. వాటిలో ఒకటైన దోహాలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ఇప్పటికే తయారైపోయింది. దీనిని గతేడాది మరమ్మతుల అనంతరం పున:ప్రారంభించారు.

ఉత్తరం వైపు వేదికగా

ఉత్తరం వైపు వేదికగా

అల్ ఖోర్‌లోని అల్ బేట్ స్టేడియం 60వేల మంది సీటింగ్ సామర్థ్యంతో సిద్ధమవుతోంది. స్టేడియంను పెద్ద టెంట్ ఆకారంలో నిర్మిస్తుండగా మిగిలిన స్టేడియాలన్నీ దోహా చుట్టు వైపులా ఉండే విధంగా నిర్మిస్తున్నారు. ఖతర్‌ వరల్డ్ కప్ ఫైనల్స్ నిర్వహించేందుకు చాలా చిన్నది. ఈ 8 స్డేడియాలలో ఒక్కో స్టేడియానికి మధ్య దూరం కేవలం 72 కిలోమీటర్లు మాత్రమే.

గుర్తుండిపోయే సందర్భం:

గుర్తుండిపోయే సందర్భం:

స్థానిక నిర్వహక సంఘం(డెలివరీ &లిగసీకు చెందిన సుప్రీం కమిటీ) సెక్రటరీ జనరల్ హసన్ అల్ తవాడీ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ అరబ్ ప్రపంచానికి గుర్తుండిపోయే సందర్భం లాంటిదని చెప్పుకొచ్చాడు. 28 రోజుల పాటు ప్రతి అభిమాని స్టేడియంలలోనూ, టీవీ ద్వారా, స్టార్ట్ ఫోన్లలో మ్యాచ్ గురించే చూస్తుంటారు. ఇది కచ్చితంగా అరబ్ దేశానికి గుర్తుండిపోయే క్షణమే' అని పేర్కొన్నాడు.

'జడేజా.. అతని భార్యతో ముచ్చటించడం గొప్పగా ఉంది'

ఖతర్‌కు దొరికిన అరుదైన అవకాశం

ఖతర్‌కు దొరికిన అరుదైన అవకాశం

ఫిఫా ప్రెసిడెంట్ గియానీ ఇంఫాంటినో మాట్లాడుతూ.. ప్రజలు ఎంతగానో అభిమానించే ఫుట్‌బాల్‌తో మరోసారి అలరించేందుకు మీకు సిద్ధంగా ఉంటాం. 'ప్రపంచ కప్ నిర్వహించడమనేది చాలా అరుదుగా దక్కే అవకాశం. ప్రపంచానికి ఈ ప్రాంతం గొప్పదనమేంటో చాటి చెప్పేందుకు ఏమేం చేయగలదో చెప్పగలదు. కొత్త ప్రదేశం, కొత్త పరిచయాలు, కొత్త సంప్రదాయాలు నేర్చుకునేందుకు ఇదొక చక్కని వేదిక అంటూ

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 21, 2018, 12:37 [IST]
Other articles published on Nov 21, 2018
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X