న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

నేయ్మార్‌కు ఫ్రాన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు

Paris Saint-Germain’s Neymar wins France’s player of the year, rejects transfer talk

పారిస్: బ్రెజిల్ ప్లేయర్ నేయ్మార్ అత్యంత ప్రియమైన ఫుట్‌బాల్ ఆటగాడు. ప్రస్తుత సీజన్‌లో పారిస్ సెయింట్ జెర్మైన్ క్లబ్ తరఫున ఆడుతున్న నేయ్మార్ 20 లీగ్ మ్యాచ్‌లు ఆడితే 19 గోల్స్ సాధించాడు. గత ఫిబ్రవరిలో ప్రస్తుతం కాలికైన గాయానికి శస్త్ర చికిత్స కోసం సొంత దేశం బ్రెజిల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ఫ్రాన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నేయ్మార్ ఎంపికయ్యారు. దీంతో భవిష్యత్‌లో ఆయనపై సందేహాలను నివ్రుత్తి చేశాడు.

మూడు నెలలుగా టోర్నమెంట్‌కు దూరమైనా..

మూడు నెలలుగా టోర్నమెంట్‌కు దూరమైనా..

గాయంతో బాధపడుతూ మూడు నెలలుగా టోర్నమెంట్లకు దూరమైనా పారిస్ సెయింట్ జెర్మైన్ సూపర్ స్టార్ ఈ ప్రైజ్‌ను గెలుచుకోవడం గమనార్హం. బ్రెజిల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న నేయ్మార్ తన గాయం మానింతర్వాత మరో క్లబ్ జట్టులో చేరతాడని వదంతులు వ్యాపించాయి. కాని ప్లేయర్ ఆఫ్ ది ఫ్రాన్స్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా నేయ్మార్ చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలను పటాపంచలు చేశాయి.

ఉన్నా భవితవ్యంపై చర్చించడానికి నేయ్మార్ నిరాకరణ

ఉన్నా భవితవ్యంపై చర్చించడానికి నేయ్మార్ నిరాకరణ

‘ప్రస్తుత సీజన్‌లో నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకిది గౌరవం. నా సహచరుల మద్దతు లేకుండా ఈ అవార్డు గెలుచుకోవడం చాలా కష్టం' అని నేయ్మార్ తెలిపాడు. క్రిస్టియానో రొనాల్డో నుంచి ఈ అవార్డును అందుకున్నాడు. తన భవితవ్యం గురించి మాట్లాడడానికి నిరాకరించాడు.

ట్రాన్స్‌ఫర్ విండోపై చర్చతో కోపం తెస్తున్నారన్న నేయ్మార్

ట్రాన్స్‌ఫర్ విండోపై చర్చతో కోపం తెస్తున్నారన్న నేయ్మార్

‘ప్రతి సీజన్‌లో ట్రాన్స్‌ఫర్ విండో అమలులోకి వచ్చినప్పుడల్లా నా బదిలీ గురించి చర్చ జరుగుతున్నది. ఈ దశలో నేను ప్రతిస్పందించబోను. నేనిక్కడకు ఎందుకు వచ్చానో అందరికీ తెలుసు. ప్రస్తుతం నా లక్ష్యాలు స్పష్టం. ప్రస్తుతానికి నా లక్ష్యం ప్రపంచ కప్ టోర్నమెంటే. బదిలీ గురించి మాట్లాడొద్దు. నా జీవితం మొత్తం ఫుట్‌బాల్ కోసం పని చేస్తున్నా. ప్రతిసారి బదిలీ చర్చ తీసుకొచ్చి నాకు కోపం తెప్పిస్తున్నారు' అని నేయ్మార్ చెప్పాడు.

నేయ్మార్‌తోపాటు మరో ఇద్దరు పీఎస్జీ ప్లేయర్ల పోటీ

నేయ్మార్‌తోపాటు మరో ఇద్దరు పీఎస్జీ ప్లేయర్ల పోటీ

ప్లేయర్ ఆఫ్ ది ఫ్రాన్స్ అవార్డు అందుకున్న నేయ్మార్‌తోపాటు అదే జట్టుకు చెందిన ఎడిన్సన్ కవానీ, క్యాలియాన్ బాపీ, మార్సెల్లి వింగర్ ఫ్లోరియన్ థౌవిన్ నామినేట్ అయ్యారు. గతేడాది ఆగస్టులో ‘లా లీగ' జెయింట్ ‘బార్సిలోనా' క్లబ్ యాజమాన్యంతో 222 మిలియన్ల యూరోలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే పీఎస్జీ జట్టుతో దేశీయ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. చాంపియన్స్ లీగ్ టోర్నీలో రియల్ మాడ్రిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.

సాకర్ వరల్డ్ కప్‌కు 2000శాతం పక్కాగా హాజరవుతాడు

సాకర్ వరల్డ్ కప్‌కు 2000శాతం పక్కాగా హాజరవుతాడు

వచ్చేనెలలో రష్యాలో సాకర్ సంరంభం ప్రారంభం అయ్యేనాటికి బ్రెజిల్ జట్టు సారధిగా తాను గాయం నుంచి కోలుకుంటానని నేయ్మార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే పారిస్ సెయింట్ జెర్మైన్ క్లబ్ అధ్యక్షుడు నస్సీర్ అల్ ఖెలైఫీ మాట్లాడుతూ నేయ్మార్ తమ జట్టు నుంచి వీడే అవకాశాలు లేవని తెలిపాడు. రియల్ మాడ్రిడ్ జట్టుకు ట్రాన్స్‌ఫర్ విండోలో వెళతాడని 2000% భావించడం లేదని నస్సీర్ అల్ ఖెలైఫీ తిరస్కరించాడు.

 వదంతులపై స్పందించనన్న నేయ్మార్

వదంతులపై స్పందించనన్న నేయ్మార్

గత అక్టోబర్ నుంచి నా బదిలీ గురించే మాట్లాడుతూ వార్తలు రాస్తోంది. కానీ నేను వదంతులను పట్టించుకోను. నాకు అంత సమయం లేదు. కానీ నేను పారిస్ సెయింట్ జెర్మైన్ ప్లేయర్‌గా కొనసాగుతాను' నేయ్మార్ తెలిపాడు. బాప్పె యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ‘నాకు మంచి సీజన్ ఉంది. నేను పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తా. పీఎస్జీ వంటి క్లబ్‌లు అందరికీ సరైన టైం కేటాయించలేవు' అని బాప్పే చెప్పాడు. ఆయన గతేడాది మొనాకో క్లబ్ నుంచి లోన్ విండోపై 180 మిలియన్ల యూరోలకు పీఎస్జీ క్లబ్‌కు బదిలీపై వచ్చాడు.

గతేడాది యువ ప్లేయర్ అవార్డుకు బాప్పే ఎంపిక

గతేడాది యువ ప్లేయర్ అవార్డుకు బాప్పే ఎంపిక

13 గోల్స్ చేసి గతేడాది కూడా బాప్పే ఈ అవార్డును గెలుచుకున్నాడు. అంతేకాదు గతేడాది మొనాకో జట్టు టైటిల్ గెలుచుకోవడంలోనూ బాప్పే కీలకంగా వ్యవహరించాడు. అంతకుముందు రెండు సీజన్లలో యువ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న ఎడెన్ హజార్డ్.. ప్రస్తుతం చెల్సియా క్లబ్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు.

Story first published: Wednesday, May 23, 2018, 14:10 [IST]
Other articles published on May 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X